Milk for Weight Loss : ప్రస్తుతం దాదాపుగా అందరినీ వెంటాడుతున్న సమస్య అధిక బరువు అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ అయ్యేందుకుగాను బరువు ఉన్న వారందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్సర్‌సైజెస్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ ఎలాగైనా వెయిట్ లాస్ అవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాలు తాగితే బరువు తగ్గుతారని కొందరు అంటున్నారు. అయితే, మరి కొందరు మాత్రం పాలు తాగితే ఇంకా వెయిట్ గెయిన్ అయే చాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలోనే మిల్క్ వల్ల బాడీ వెయిట్ లాస్ అవుతుందా లేదా గెయిన్ అవుతుందా అనే విషయాలు తెలుసుకుందాం.

ప్రతీ ఒక్కరి జీవితంలో మిల్క్ భాగం అని చెప్పొచ్చు. దాదాపుగా అందరూ పాలు తమ డెయిలీ ఫుడ్‌లో భాగం చేసుకుంటారు. ఒకవేళ పాలు తాగని వారు కనుక ఉంటే పాల ఉత్పత్తులు పెరుగు తీసుకుంటారు. లేదా టీ తీసుకుంటారు. కాగా, పాలలో ఉండే సంతృప్త కొవ్వు బరువు తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, అలా అని చెప్పి పాలు తాగడం వల్ల కంపల్సరీగా వెయిట్ లాస్ అవతారని చెప్పలేం కూడా. అయితే, పాలలో ఉండే కాల్షియం హ్యూమన్ బోన్స్ స్ట్రాంగ్ అవడానికి, టీత్ నిర్మాణానికి సహకరిస్తాయి.
ఈ క్రమంలోనే బరువు తగ్గించేందుకు సాయపడతాయి. కానీ, కంప్లీట్ వెయిట్ లాస్ అవడానికి మిల్క్ సాయపడతాయని చెప్పలేం. కొన్ని పరిశీలనల ప్రకారం.. పాలలోని కాల్షియం, విటమిన్ డి కంటెంట్ హ్యూమన్ హెల్త్‌కు సాయం చేయడంతో పాటు జీవక్రియను మెరుగు పరుస్తుందని తేలింది.
ఈ క్రమంలోనే పాలలోని పీవైవై అనే హార్మోన్ ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా మనుషులు ఫుడ్ విషయంలో నియంత్రణతో అంటారు. దాంతో ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ పొట్ట కొవ్వును, రక్తపోటును తగ్గిస్తాయి.
Read Also : Weight Loss Exercises : బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని గంటలు ఎక్సర్‌సైజ్ చేయాలో తెలుసా?