Weight Loss Exercises : బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని గంటలు ఎక్సర్ సైజులు చేయాలో తెలుసా? బరువు తగ్గడం సులభమే.. కానీ, అంతే వేగంగా బరువు పెరిగిపోతారు జాగ్రత్త.. బరువు తగ్గాలనుకునేవారు ఒక క్రమపద్దతిలో వ్యాయామాలు చేయాలి. అప్పుడే అనుకున్నట్టుగా బరువు తగ్గుతారు. అంతేకాదు.. జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. అప్పుడు అధిక బరువు పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అసలు బరువు తగ్గాలంటే ఎన్ని గంటలు (Weight Loss Exercises in telugu ) వ్యాయామం చేయాలంటే..
ప్రస్తుత రోజుల్లో శరీర బరువును తగ్గించుకోనేందుకు ఇబ్బందులు పడుతుంటారు. బరువును తగ్గించుకోవడం కోసం డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటారు. బరువు తగ్గించుకునేందుకు ప్రముఖ న్యూట్రీషియనిస్ట్ సలహాలు బరువును తగ్గించుకునేందుకు సమయాన్ని సూచిస్తున్నారు. అసలు ఎంత సమయం అవసరమో కూడా తెలియజేస్తున్నారు. నెలలో పది కిలోల వరకు బరువు తగ్గాలంటే సాధ్యమేనా? బరువు తగ్గాలంటూ ఏం తినకుండా తెగ కష్టపడేస్తుంటారు. న్యూట్రీషియనిస్ట్ అసలు తినకుండా కసరత్తులు చేయొద్దని సూచిస్తున్నారు. అలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

గంట పాటు వ్యాయామం చేస్తే చాలట :
బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని గంటలు వ్యాయామం చేయాలంటే.. రోజుకు కేవలం గంట పాటు వ్యాయామం చేస్తే చాలంట.. పైన సూచించిన సలహాలను పాటిస్తూ వ్యాయాయాలు చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే బరువుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. శరీర బరువును తగ్గించుకోవడం ఖర్చు అవుతుందని అంటారు. అవసరంలేదు. ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. సులభమైన వ్యాయామాలతోనే సింపుల్ గా బరువు తగ్గిపోవచ్చు.. మీకు తెలిసిన సింపుల్ వ్యాయామాలను చేస్తే సరిపోతుంది. అది కూడా క్రమపద్ధతిలో చేయాలి.. ఎన్ని గంటలు అనేది నిబంధన లేదు. మీకు ఓపిక ఉన్నంత వరకు చేయొచ్చు. మితిమీరిన వ్యాయామం కూడా మంచిది కాదని గమనించాలి.
Weight Loss Exercises : తొందరగా బరువు తగ్గేందుకు వ్యాయామం ఎలా చేయాలంటే?
కనీసం గంట పాటు వ్యాయామం చేసినా చాలు.. తొందరగా బరువు తగ్గించుకోవచ్చు.. ఎంతసేపు వ్యాయామం చేసామనేది కాదు.. ఎలా ఏయే పద్ధతుల్లో వ్యాయామం చేస్తున్నామనే దానిపై ఆధారాపడి ఉంటుంది. ఒకవైపు బలమైన ఆహారంతో పాటు విటమిన్లు, సప్లిమెంట్లు తీసుకుంటూనే బరువు తగ్గించుకునేందుకు వ్యాయామాలను చేయాలి. అప్పుడే మీరు అనుకున్నట్టు బరువు తగ్గడానికి వీలుంటుంది. బరువు తగ్గాలనే ఆలోచన ఉంటే.. పైన సూచించిన విధంగా సూచనలు పాటిస్తే.. మీరు సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.
నిపుణుల శిక్షణలో మాత్రమే :
బరువు తగ్గేందుకు చాలా మంది గంటల పాటు వ్యాయామాలు చేసేస్తుంటారు. ఎంతసేపు వ్యాయామం చేసింది లెక్కకు రాదని గుర్తించాలి. వ్యాయామం ఎలా ఏ స్థాయిలో చేస్తున్నామనేది గుర్తించుకోవాలి. ఆ తర్వాతే వ్యాయామం ద్వారా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మంచి నిపుణుల సలహాలతో తొందరగా బరువు తగ్గేందుకు శిక్షణలో మాత్రమే వ్యాయామాలు చేస్తుండాలి. ఎలా పడితే అలా చేయడం ద్వారా బరువు తగ్గడం తర్వాత సంగతి.. లేనిపోని అనారోగ్య సమస్యలకు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.
బరువు తగ్గడానికి చేసిన కొన్ని గంటలు అయినా సరైన పద్ధతిలో చేయాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. శరీర బరువును తగ్గించుకోవడంలో కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్క వ్యాయామంతో మాత్రమే బరువు ఒక్కసారిగా తగ్గిపోరు. ఆహారం తినే విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఒకవైపు పౌష్టికాహారం తింటూనే మరోవైపు కసరత్తులు వంటివి చేయాలి.
అలా నెమ్మదిగా బరువు తగ్గడం మీరే గ్రహిస్తారు. బరువు కొంచెం తగ్గినప్పుడు అనిపించగానే వెంటనే వ్యాయామాలు, డైటింగ్ ఆపేయరాదు. నెమ్మదిగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మొదటి దశకు తీసుకురావాలి. అలా చేయడం ద్వారా శరీరం కూడా మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటుంది.
Read Also : yoga poses for back pain : వెన్నునొప్పి బాధిస్తోందా? ఈ యోగాసనాలతో చిటికెలో తగ్గించుకోవచ్చు!