Migraine Headache : ఇటీవలి కాలంలో చాలా మంది తలనొప్పి, మైగ్రేన్‌తో విపరీతంగా బాధపడుతున్నారు. ఉద్యోగ పరమైన ఒత్తిడి, ఫ్యామిలీ టెన్షన్స్, మనీ ప్రాబ్లమ్స్, నిద్రలేమి, విపరీతంగా ఆలోచించడం వంటి కారణాల వలన చాలా మంది తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. కానీ కొందరికీ మాత్రమే సమస్య తీరుతుంది. మిగతా వారు నేటికీ పిల్స్ ఉపయోగిస్తూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. అయితే, తలనొప్పి, మైగ్రేన్ వంటి వ్యాధులకు మందులతో కాకుండా యోగాతో చెక్ పెట్టవచ్చునని తెలుస్తోంది. అందుకోసం కొన్ని ఆసనాలను క్రమం తప్పకుండా వేస్తే ఫలితం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మైగ్రేన్ తగ్గుతుందా.. :
ప్రస్తుతం చాలా మంది మైగ్రేన్ (వాంతులతో కూడిన తలనొప్పి) వంటి వ్యాధుల బారిన పడుతున్నట్టు తెలిసింది. ఈ నొప్పి రావడానికి మన జీవనవిధానమే కారణమని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. అటువంటి మైగ్రేన్‌ను యోగాసనాల ద్వారా కంట్రోల్ చేయండం సాధ్యమని యోగా నిపుణులు స్పష్టంచేస్తున్నారు.సాధారణంగా మైగ్రేన్ ఎందుకు వస్తుందంటే.. అధికంగా కాంతి పడినా, శబ్దాలు, రేడియో తరంగాల వలన ఈ మైగ్రేన్ తలనొప్పి సంభవిస్తుంది. అది కూడా తలలో ఒకవైపు మాత్రమే ఉంటుంది. దీని నివారణకు మెడిసిన్ తీసుకోవడం కంటే మూడు రకాల ఆసనాలు వేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మైగ్రేన్‌ను తగ్గించుకునేందుకు మొదటగా ‘సేతు బంధన సర్వాంగాసనం’ వేస్తే బెటర్. ఇది వేయడం వల్ల శరీరానికి కావాల్సిన విశ్రాంతి కలుగుతుంది.మెదడుకు అవసరమైన రక్తప్రవాహం జరుగుతుంది.ఈ ఆసనాన్ని భుజాలు వెనక్కు మడిచి వేస్తారు. రెండోది ‘విపరీత కరాని’ ఆసనం.. దీని వలన కూడా మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుందట.. ఈ యోగాసనాన్ని ఎలా వేయాలంటే.. మన కాళ్లను గోడకు ఆనించి నెమ్మదిగా వేయాలి. యోగాసనం వేసేటపుడు రిస్క్ తీసుకోకూడదు.
తల నేలకు ఆనించి కాళ్లు లేపి గోడకు పెట్టడం వెళ్లగా మెదడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మైగ్రేన్ తలనొప్పి నుంచి వెంటనే విముక్తి పొందవచ్చు. మూడోది ‘కతి పరివర్తనాసనం’ ఇది పై రెండు ఆసనాల కంటే కూడా సులువు. దీనిని ఎలా వేస్తారంటే.. నిల్చొని ఈ ఆసనాన్ని వేస్తారు. దీని వలన లాభం ఎలా ఉంటుందని చాలా మంది సందేహిస్తారు. కానీ, మన వెన్నముక అధిక స్ర్టెస్, నొప్పి నుంచి రిలాక్స్ అవుతుంది. అందువల్ల ఎలాంటి సందేహాలు ఈ ఆసనాన్ని ట్రై చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
Read Also : Headaches in Children : పిల్లల్లో వచ్చే తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి