Headaches in Children : ఐదు సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో ఎక్కువగా తలనొప్పి సమస్య వస్తూ ఉంటుంది. కానీ చాలా మంది తల్లి దండ్రులు తలనొప్పి సమస్యను చాలా లైట్ తీసుకుంటారు. ఇలా తలనొప్పిని లైట్ తీసుకోవడం వలన అనేక ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కావున పిల్లలకు ఎప్పుడు తలనొప్పి వచ్చినా సరే ఆస్పత్రికి తీసుకుపోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు.
అసలు ఈ సమయంలో పిల్లల్లో ఎక్కువగా తలనొప్పి సమస్య ఎందుకు వస్తుందనే విషయం గురించి వైద్యులేం చెబుతున్నారో ఒక్క సారి తెలుసుకుంటే. తలనొప్పి అనేది రెండు రకాలుగా ఉంటుందని వైద్యులు వివరించారు. ఒకటి సాధారణ తలనొప్పి ఈ తలనొప్పి కొద్ది సేపటి తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కావున ఈ నొప్పి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

ఇక రెండో రకం విషయానికి వస్తే ఈ తలనొప్పి అనేది శరీరంలో కానీ తలభాగంలో కానీ ఏదైనా ఇబ్బంది ఏర్పడితే వస్తుంది. అటువంటపుడు పిల్లలు సరిగ్గా తమ సమస్యను బయటకు చెప్పలేరు. ఇక ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లను గమనించి ఆస్పత్రికి తీసుకుపోవాల్సి ఉంటుంది. అసలు రెండో రకం తలనొప్పి ఏ ఏ కారణాల వలన వస్తుందనే విషయంలో వైద్యులు కొన్ని విషయాలను వెల్లడించారు.
పిల్లలకు జలుబు, సైనస్ వస్తే ఈజీగా తలనొప్పి వస్తుందని కావున జలుబును నెగ్లెక్ట్ చేయకూడదని చెబుతున్నారు. ఇక మరో విషయం మన జీవన శైలి వలన కూడా పిల్లలకు తలనొప్పి సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని పిల్లలకు కూడా తలనొప్పి సమస్యలు అధికంగా వస్తుంటాయి. తల నొప్పి సమస్య రాకుండా ఉండడం కోసం తగినంతగా నిద్ర పోవడం కూడా అవసరం.
Read Also : Black Hair Tips : తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కా..!