Ringworm Home Remedies : సాధారణంగా కొందరిని చర్మవ్యాధులు విపరీతంగా బాధిస్తుంటాయి. సీజన్లతో సంబంధం లేకుండా కూడా వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఎండాకాలంలో అయితే చెమటతో వచ్చే దురదల వలన స్కిల్ ఎలర్జీ ఏర్పడే చాన్స్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కొందరికి తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు అటాక్ అయితే అంత సులువుగా పోవు. దీనంతటికీ శుభ్రంగా స్నానం చేయకపోవడం కూడా కారణం కావొచ్చు. అయితే, వీటికి బయట మందులు, క్రీమ్స్ దొరుకుతాయి.
గోకకుండా ఎలా ఉండగలరు :
చర్మవ్యాధులు రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. మన శరీరం దేనినైనా తట్టుకునే శక్తిని కోల్పోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా ఆడ, మగ అనే తేడా లేకుండా తొడల్లో గజ్జి, తామర వంటి వ్యాధులు అటాక్ అయ్యి తీవ్రంగా బాధిస్తుంటాయి. అవి ఒక్కసారి వస్తే పొద్దున నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా మన చేతులను ఆ ప్రదేశం వద్దకు వెళ్లకుండా కంట్రోల్ చేసుకోలేక నరకం చూడాల్సి వస్తుంది. ఒకవేళ గోకితే అది ఇంకా ఎక్కువ అవుతుంది. బిగుతుగా ఉండే జీన్స్, ఇన్నర్స్ వేయడం వలన రహస్య భాగాల్లో గాలి ఆడక కూడా దురద ఏర్పడి ఇలాంటి చర్మ వ్యాధులు వచ్చే ఆస్కారం లేకపోలేదు.
Ringworm Home Remedies : మన ఇంట్లోనే రెమిడీ ఎలా తయారు చేసుకోవాలంటే..
గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులకు స్కిన్ స్పెషలిస్టును కలిసి మెడిసిన్ తీసుకోవచ్చు. కొందరు వైద్యుల వద్దకు వెళ్లి తమ ఇబ్బందిని చెప్పుకోలేని వారు ఇంట్లోనే దీనికి మందును తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే.. ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసు నీరు పోసుకుని అందులో గుప్పెడు వేప ఆకులు వేసుకుని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మరిగించాలి. అదేవిధంగా టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని అందులో రెండు కర్పూరం బిల్లలను పొడి చేసుకుని వేసుకోవాలి.

ముందుగా ఆ వేపాకు మిశ్రమాన్ని ఎక్కడైతే దురద, తామర ఉంటుంతో అక్కడ శుభ్రంగా కడిగి.. పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఆ తర్వాత కర్పూరంతో కలిసిన నూనెను అక్కడ రాసుకోవాలి. రాత్రి పడుకునే ముందు అయినా, పొద్దున రాసుకుని రాత్రివరకు ఉంచుకున్నా పరువాలేదు. ఇలా క్రమంగా కొన్ని రోజులు చేస్తుంటే ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. వేపాకు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌గా ఉపయోగపడుతుంది.దీంతో చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియాను నివారించడంలో ఇది బాగా తోర్పడుతుంది.