Red Rice Health Benefits : ఎర్ర బియ్యం ఎప్పుడైనా తిన్నారా? ఎర్ర బియ్యం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చూడడానికి ఈ ఎర్ర బియ్యం ఎర్ర రంగు కలిగి ఉంటాయి. ఈ బియ్యాన్ని అన్నం వండుకొని తినేటప్పుడు బాదం జీడిపప్పులాగా మెత్తగా ఉంటుంది. వీటిని నవారా రైస్ అంటారు. ఎర్ర బియ్యంలో అనేక పోషక విలువలు ఉన్నాయి. అదేవిధంగా, దంపుడు బియ్యం, ఉక్కుడు బియ్యం, నల్ల బియ్యం, కొర్ర బియ్యం లాగే ఎర్ర బియ్యం కూడా మార్కెట్లో దొరుకుతాయి.
ఎర్ర బియ్యంలో (ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్) పదార్థం ఉండడం వల్ల ఎర్రగా ఉంటాయి. ఈ రెడ్ రైస్‌ని కేరళలో ఎక్కువగా పండిస్తారు. ఈ బియ్యం తినడం వల్ల మెదడు యాక్టివ్ గా బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. బాడీకి స్ట్రైన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎర్ర బియ్యం నీటిలో వేస్తే వెంటనే కరిగిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి బియ్యం మెత్తగా ఉంటాయి. ఎముకలు బలంగా పుష్టిగా తయారవడానికి ఎర్ర బియ్యం తింటే మంచిది. ముసలితనాన్ని తగ్గించే పోషకాలు,విటమిన్స్, ఐరన్ ఈ రైస్ లో ఎక్కువగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలను ఇంప్రూవ్ చేస్తాయి.

Red Rice Health Benefits in Telugu : నవారా రైస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
వీటిని తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. రెడ్ రైస్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్ లో అయితే కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఎర్ర బియ్యం లో తక్కువగా ఉంటాయి. ఎర్ర బియ్యం తినేవారికి మలబద్ధ సమస్య ఉండదు. డయాబిట్స్, గుండె జబ్బు, అధిక బరువు వంటి సమస్యలు ఉండవు. ఎర్ర బియ్యం అన్నంలా వండుకొని తింటే కొంచెం తింటే పొట్ట నిండుగా అనిపిస్తుంది.
కాబట్టి బరువు ఎక్కువగా పెరగనివ్వదు.. ముసలివారు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల భారీ నుండి కాపాడుతుంది. శరీరా యవ్వనంగా ఉంచుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ ఆహారంలో ఎర్ర బియ్యాన్ని చేర్చుకోండి. వారంలో ఒకసారైన మామూలు రైస్ బదులుగా ఈ ఎర్ర బియ్యాన్ని తినేందుకు ప్రయత్నించండి. మంచి ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి కూడా ఆస్వాధించవచ్చు.