Wife Dispute Husband :పెళ్లిళ్లు దేవుడి ఆదేశాల మేరకు నిర్ణయించబడతాయి అని పెద్దలు చెప్తుండటం మనం వింటుంటాం. అలా వారు ఎందుకు చెప్తారో కూడా వివరిస్తుంటారు. వారి వివరణ ఏంటంటే.. తగు ఈడు జోడు మాత్రమే కాదు అర్థం చేసుకునే తత్వం ఉండే వారిని జంటగా భగవంతుడు కలుపుతాడని, అలా దేవుడు వధూవరులను జంటగా మారుస్తాడని చెప్తుంటారు. కాగా, పెళ్లి అయిన కొత్తల్లో కలిసి మెలిసి ఉండే భార్యా భర్తలు ఆ తర్వాత కాలంలో అంత అన్యోన్యంగా ఉండబోరని అంటుంటారు. అందుకు కారణం వారి మధ్య అండర్ స్టాండింగ్ లేకపోవడం. అది తరుచూ గొడవలు పెట్టుకోవడం కూడా కారణంగా ఉంటుంది. ఈ క్రమంలో గొడవలు తగ్గించుకునేందుకుగాను ఏం చేయాలనే విషయాలపై స్పెషల్ స్టోరి.
భర్త ఆర్థిక స్థోమత బట్టి మసలు కోవాలి :
ఇకపోతే మ్యారేజ్ సిస్టమ్ వల్ల అప్పటి వరకు తల్లిదండ్రులతో ఉన్న అమ్మాయి వేరే ఇంటికి రావడం సహజమే. ఈ క్రమంలోనే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అయి నిలదొక్కుకోవాలి. భార్యకు భర్త సహకారం, భర్తకు భార్య సహకారం ఉంటేనే వారు ఇద్దరు జంటగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలరు. తన భర్త ఇన్‌కమ్ సోర్స్, వచ్చే ఇన్‌కమ్ ఎంతో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా మసులు కోవాలి. భర్త ఆర్థిక స్థోమత తెలుసుకుని అందుకు తగ్గట్లుగానే మీరు మూవ్ కావాల్సి ఉంటుంది.
భర్తను ప్రతీ సారి అది కొనివ్వాలి, ఇది కొనివ్వాలి అని అడగకూడదు. భర్త ఆదాయ ఖర్చులను బట్టి అందులో లభించేవి మాత్రమే తీసుకోగలగాలి. పర్టికులర్‌గా భర్త ఆదాయ ఖర్చులను ఎప్పటికప్పుడు భార్యలు గమినిస్తూ ఉండాలి. వేటికి ఎంత ఖర్చు అవుతున్నది అనే తెలుసుకుని అందుకు తగ్గట్లుగానే వ్యవహరించాలి. అర్థం చేసుకునే భార్య దొరికితే భర్త అదృష్టవంతుడు అని అంటుంటడటం మనం చూడొచ్చు కూడా.
ఒకరినొకరు అర్థం చేసుకోవాలి :
సంసారం అంటే కేవలం సంతోషాలు మాత్రమే కాదు. కష్టాలు కూడా ఉంటాయి అని గ్రహించాలి. భర్త ఆరోగ్య, ఉద్యోగ ఒత్తిళ్లలో సతమతమవుతుంటే భార్య ఊరికనే అలా ఉండకూడదు. ఒత్తిళ్ల నుంచి బయటపడేసేందుకుగాను ప్రయత్నించాలి. ఈ క్రమంలోనే ఒకరికొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. భార్య భర్తకు సేవ చేసినట్లుగానే భర్త భార్యకు సేవ చేయగలిగినప్పుడు వారి జీవితం హ్యాపీగా ముందుకు సాగుతుంది.
సాధారణంగా జీవితంలో చాలా మంది ఒకరి లైఫ్‌లోకి వస్తుంటారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత వెళ్లిపోతుంటారు. కానీ, భార్యా భర్తల సంబంధం అలాంటిది కాదు. కాబట్టి భర్త జీవితంలోకి ఎంటర్ అయిన భార్య ఆయనతో గొడవలు రాకుండా ఉండేందుకు సంయమనం పాటించాలి. భర్తకు భార్య శాశ్వతం, భార్యకు భర్త శాశ్వతం అన్న సంగతి గుర్తించాలి. ఇకపోతే ఇంటి వ్యవహారాలతో పాటు ఉద్యోగ వ్యవహరాలు చూసుకునే భార్య భర్త అవసరాలను కూడా చూస్తుండాలి.
తప్పును క్షమించినప్పుడే :
భర్తతో గొడవలు సాధారణంగా చిన్న చిన్న విషయాల నుంచి స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకు ఎక్కడికైనా వెళ్లాలనుకునపుడు భర్త చెప్పిన సమయానికి రాకపోవడం, భార్య చెప్పిన వస్తువులను భర్త తీసుకురాకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలా జరిగినపుడు భర్తతో భార్య గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భర్త ఎటువంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో ఆలోచించాలి.
అలా ఆలోచన చేసి భార్య భర్తకు సహకారం అందించాలి తప్ప విమర్శలు చేయరాదు. తప్పులు చేసినపుడు క్షమాపణలు చెప్పుకోవడంలో తప్పులేదు. సాధారణంగా భార్య తప్పు చేసినప్పటికీ భర్త క్షమాపణలు చెప్పడం కొందరిలో మనం చూడొచ్చు. భార్య ప్రతీ విషయాలో ఈగో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. తప్పు జరిగినపుడు సారీ చెప్పడం అలవర్చుకోవడం వల్ల బంధం ఇంకా బలపడుతుంది
భర్తను కేవలం డబ్బులు తెచ్చే మెషిన్‌గా, యాంత్రికంగా చూడరాదు. ప్రేమాభిమానాలు భర్త పట్ల కలిగి ఉండాలి. మహిళలు కొందరు భర్తలను బానిసలుగా చూస్తుంటారు అది తప్పు. అలా చేయడం వల్ల భర్త బానిస అని, తాను యజమాని అని భార్య ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా భర్తను రాజును చేసి భార్య రాణిగా ఉండాలి.
అలా ఉంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రావు. ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బుందులున్నప్పటికీ భర్త పరువుకు భంగం వాటిల్లకుండా భార్య జాగ్రత్తపడాలి. భర్త అందరిలో భార్యను ఎగతాళి అస్సలు చేయొద్దు. అలా చేయడం వల్ల భార్యా భర్తల మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే భార్యా భర్తల మధ్య అస్సలు గొడవలు ఉండబోవు అని చెప్పడం అసాధారణం.
కలిసి మెలిసి ఉండటమే గొప్పవరం :
లొల్లి లేకుండా ఉండటం కన్న కూడా ఎన్ని లొల్లిలు పెట్టుకున్నా విడిపోకుండా కలిసి మెలిసి ఉండటం గొప్ప వరం అని చెప్పొచ్చు. ఇక భర్త పొరపాటును భార్యలు భూతద్దంలో పెట్టి చూపించకూడదు. అలా చేయడం వల్ల భర్తలు భార్యలు తప్పులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అలా గొడవలు ఇంకా ఎక్కువైపోయి సంసారం అనేది కలహాలకు దారి తీస్తుంది. భర్త పొరపాటును భార్య సున్నితంగా భర్తకు చెప్పాలి. అది కూడా అందరి ముందు కాకుండా ఎవరు లేని సమయంలో జరిగిన పొరపాటును వివరించి సరిదిద్దే ప్రయత్నం చేయాలి. పొరపాటు జరిగింది కదా అని దానిని ఇంకా పెద్దగా చేసి చూపించే బదులు సరిదిద్దుకుని ముందుకు సాగాలి.
Read More : Ashwagandha : అశ్వగంధతో ఆయుర్వేదంలో ఏయే జబ్బులను నయం చేయవచ్చో తెలుసా?