Kitchen Remedies : ఇల్లాలికి వంటింటి చిట్కాలు.. రోజువారి పనుల్లో కొన్ని చిన్న సమస్యలతో చాలా విసిగిపోతూ ఉంటాం. వంటింట్లో రోజూ ఎదుర్కొనే చిన్న సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను పొందవచ్చు. ప్రతి వంటింట్లో దొరికే నిమ్మకాయలను ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచుకోవాలంటే ఎయిర్ బ్యాగ్ తీసుకోండి. చాలా పల్చటిది. అందులో నిమ్మకాయలు పెట్టి ఉంచడం వల్ల మీకు ఫ్రెష్‌గా ఉంటాయి. నిమ్మకాయల్ని ఫ్రిజ్‌లో పెట్టేముందు నిమ్మకాయలకు కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి.
ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల చాలా రోజులు పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. సహజంగా నిమ్మకాయల్ని అందరూ నిలువుగా కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేయటం వల్ల గట్టి పదార్ధం అడ్డుపడి నిమ్మరసం ఎక్కువగా రాదు. సగం వరకు నిమ్మరసం అందులోనే ఉండిపోతుంది. అలాకాకుండా నిమ్మకాయల్ని అడ్డంగా కొయ్యండి. దానివల్ల పల్చటి పొర అనేది అడ్డుపడదు. మీకు గింజలు కూడా అడ్డుపడవు. నిమ్మచెక్కలో ఉన్నటువంటి రసం మొత్తం కూడా మీకు గిన్నెలోకి వచ్చేస్తుంది. ఆ చెక్కలో పూర్తిగా రసం మొత్తం కూడా తీసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల నిమ్మరసాన్ని పూర్తిగా తీసుకోవచ్చు.
అల్లం పైన తొక్క తీయటానికి రోజు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే, అల్లాన్ని తీసుకొని ఒక స్పూన్ తీసుకోండి. స్పూన్ కింద భాగం అంటే.. స్పూన్ కింద కాడ భాగాన్ని తీసుకుంటే అది అల్లాన్ని ఈజీగా అల్లం పైన పొట్టు తీయటానికి వీలుంటుంది. అల్లం పై పొట్టును చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. అన్నం వండేటప్పుడు విరిగిపోకుండా ముద్దగా అవ్వకుండా ఉండాలి అంటే.. ఇప్పుడు ఈ చిట్కా పాటించండి.
అన్నం వండేటప్పుడు నీళ్లు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక్క స్పూన్ నిమ్మరసం యాడ్ చేయండి. కొద్దిగా వంట నూనెను యాడ్ చేయండి. అలా చేయడం వల్ల అన్నం పొడిగా తెల్లగా వస్తుంది. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ముక్కలు క్రిస్పీగా అంటుకోకుండా నాన్ స్టిక్‌గా అవ్వాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ ముక్కలపైన ఒక స్పూన్ పెరుగు వేసి ముక్కలని ఒకదానికొకటి అంటుకోకుండా కలపాలి. ఇలా చేసి ఫ్రై చేయడం వల్ల బెండకాయలు క్రిస్పీగా వస్తాయి.
Kitchen Remedies : వంటింట్లో సమస్యలకు ఇలా చెక్ పెట్టేయండి..
కూరగాయలపై ఉన్న పేస్ట్ సైడ్ కెమికల్ ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక బౌల్లో ఉప్పు తీసుకోవాలి. ఆ నీళ్లలో 4 నుంచి 5 స్పూన్ల పసుపు వేయాలి. ఆ నీళ్లలో పళ్ళు, కూర కాయలు వేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లలోంచి తీసి మామూలు వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. వాటిపై ఉన్న బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుంది. ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులో హాఫ్ కప్పు సాల్ట్ వేయాలి. ఆ నీళ్లల్లో పళ్ళుు, కూర కాయలు వేసి 10 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత మామూలు నీళ్లతో కడగాలి. ఇలా చేసిన కూరగాయలు పళ్ళ పైన ఉన్న బ్యాక్టీరియా బెస్ట్ సైడ్స్ నివారించుకోవచ్చు. పూరీలు, పకోడీలు బజ్జీలు లేదా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు ఎక్కువగా ఆయిల్ పిలుస్తాయి. ఆయిల్ పాన్‌లో వేసినప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ వేస్తే.. ఆయిల్ ఐటమ్స్ పీల్చుకోవు.
మైక్రోవేవ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ పోగొట్టాలంటే.. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వెనిగర్, ఒక హాఫ్ కప్ వాటర్ వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తర్వాత మైక్రోవేవ్‌లో పెట్టి ఆన్ చేయాలి. 5 నిమిషాల తర్వాత బౌల్ మైక్రోవేవ్ నుంచి తీసేసి ఒక సాఫ్ట్ క్లాత్‌తో అంతా క్లీన్ చేయాలి. ఇలా చేయటం వల్ల మైక్రోవేవ్‌లో ఉండే బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ అవుతుంది. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే.. వేపాకులను సహజసిద్ధమైన క్రిమిసంహారిని వేప ఆకులని తీసుకొని బాగా కడిగి 2 గంటల పాటు ఎండలో ఆరపెట్టండి. ఆ తర్వాత బియ్యంలో ఆకులని లేయర్‌గా వేసి వాటి మధ్యలో ఆకులను వేయండి. ఇలా వేప ఆకులు వేయటం వల్ల బియ్యం ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఫ్రెష్‌గా ఉంటుంది.