Curry Taste : మనం తినే కర్రీస్‌కు మంచి టేస్ట్ ఉండాలి. అప్పుడే మనం కడుపునిండా భోజనం చేయగలం. లేకపోతే పూర్తి స్థాయిలో తినలేము. కొంత మంది వంట చేస్తే సూపర్‌గా ఉంటుంది. వారు వండే విధానం గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు. కానీ కర్రీస్ చేసేటప్పుడు వారు వేసే ఇంగ్రీడియన్స్ వల్ల ఆ టేస్ట్ వచ్చిందనేది వాస్తవం. సుగంధ ద్రవ్యాలకు ఇండియా ఫేమస్. కొన్ని మనదేశంలో పండిస్తే.. మరి కొన్నింటిని ఇతర కంట్రీల నుంచి దిగుమతి చేసుకుని మరీ వాడుతుంటాం. వీటిల్లో కొన్ని ఆకుల లాగా ఉంటాయి.
వాటిని వంటకాల్లో వేస్తే దాని టేస్ట్ మారిపోతుంది. కొన్నింటిని వంటకం పూర్తయ్యాక వేస్తారు దీని ద్వారా వచ్చే సువాసన మనసును బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇంక వంటల్లో వేసే పదార్థాల్లో ఒకటి ఒరెగానో.. దీన్నే వాము అని పిలుస్తారు. కొన్ని రకాల వంటలు వండేటప్పుడు అందులో వాము పడాల్సిందే. లేకపోతే దానికి టేస్ట్ రాదు. ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని యూజ్ చేయడం వల్ల రుచితో పాటు మంచి స్మెల్ వస్తుంది. ఇక మరొకటి పార్ల్సీ.. దీని పేరు మనం ఎక్కువగా విని ఉండము. కానీ ఇది హెల్త్‌కు చాలా యూజ్ అవుతుంది.
దీనిని కొత్తిమీరలాగే కర్రీస్‌లో వాడుతుంటాం. చాలా మట్టుకు సూప్స్, సలాడ్‌లలోనూ దీనిని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇందేలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇక పుదీనా.. దీని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఏ కిచెన్‌లో చూసిన ఇది కనిపిస్తుంది. దీనిని ఆహారంలో వాడటమే కాకుండా.. డైరెక్ట్‌గా కూడా తీసుకుంటారు. దీనితో చట్నీ చేస్తే అసలే అది హైలెటే. ఇందులో వ్యాధినిరోదక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక కొత్తమీర అంటే మనందరికీ తెలిసిందే. దాదాపు అన్ని కర్రీస్‌లో దీనిని వాడతారు. వంట పూర్తయ్యాక దానిపై కొత్తిమీర వేసి అట్రాక్ట్‌గా మారుస్తారు.