Kitchen Home Remedies : పాత రోజుల్లోనే కాదు.. ఆధునిక కాలంలోనూ ప్రతిఒక్కరి జీవితంలో వంటింటి చిట్కాలు ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. ఆడవాళ్ల విషయానికి వస్తే వంటింట్లో అడుగుపెట్టకుండా రోజు గడవదు అనే చెప్పాలి. వంటింటికి సంబంధించి అనేక పనులను చేస్తుంటారు. కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయాలంటే బాగా శ్రమించాలి. అలాంటి సమస్యలను సునాయసంగా తగ్గించుకునేందుకు కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలను ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం..
1. చపాతీ పిండిలో నీళ్ళకు బదులు కొబ్బరి నీళ్లను పోసి కలిపితే చపాతీలు రెండు రోజులపాటు తాజాగా ఉంటాయి.
2. మిగిలిపోయిన చపాతీ పిండి ముద్దను తడి గుడ్డలు చుట్టి పెడితే మరునాటికి పొడిబారకుండా ఉంటుంది.
3. చపాతీ పిండి పీటకు అతుక్కుని రాకపోతే పీఠను రెండు నిమిషాలు ఫ్రిజ్లో పెడితే అతుక్కున పిండి సులభంగా వస్తుంది.
4. తోటకూరను అల్యూమినియం ఫైల్ లో చుట్టి ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
5. ఇడ్లీ దోశ పిండి ల మీద ఒక తమలపాకు వేస్తే పిండి మూడు రోజులపాటు కొలవకుండా ఉంటుంది.
6. పచ్చి అప్పడాలు తాజాగా విరిగిపోకుండా ఉండాలంటే వాటిని కాగితం లో పెట్టి బియ్యం లేదా పప్పు డబ్బాలో పెట్టుకోవాలి.
7. సగ్గుబియ్యం వడియాలు పెట్టేటప్పుడు ఉడికిన సగ్గుబియ్యం లో కొంచెం మజ్జిగ కలిపితే వడియాలు తెల్లగా వస్తాయి మంచి రుచిగా ఉంటాయి.
8. మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు శనగపిండిలో రెండు చెంచాల నెయ్యి కలిపితే బజ్జీలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
9. కోడిగుడ్లు తాజావో కాదో తెలుసుకోవాలంటే చల్లని నీళ్లల్లో ఉప్పు కలిపి అందులో కోడిగుడ్లను వేస్తే మునిగినవన్నీ తాజా గుడ్లు తేలినవన్నీ పాత లేదా పాడిన గుడ్లని అర్థం.
10. టమాటా రసం ఒకేసారి తీసి ఐస్టీలో వేసి ఫ్రీజర్ లో పెడితే ఒక వారం వరకు బాగుంటుంది కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు.

11. చలికాలంలో గోరువెచ్చని పాలలో తోడు వేసి ఆ గిన్నె మీద మూత పెట్టి కుక్కర్లో అడుగున నీరు పోసి ఈ గిన్నెను ఉంచి మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తరువాత తీసి బయట పెడితే త్వరగా పెరుగు తోడుకుంటుంది.
12. మధుమేహలు అన్నం తిన్న రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా ఉండాలంటే అన్ని ఉడికేటప్పుడు చిన్న దాల్చిన చెక్క వేస్తే సరి.
13. బియ్యం పప్పుల డబ్బాలో గుప్పెడు వేపాకులు లేదా పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఎంతకాలం నిల్వ ఉన్న పురుగు చేరదు.
14. మొక్కజొన్న గింజలను డీప్ ఫ్రిజ్లో పెట్టి అరగంట ఉంచి తీసి వాటిని నేరుగా వేయిస్తే పాప్కాన్ పెద్ద సైజులో వస్తుంది.
15. కార్పెట్ మీద కార్న్ ఫ్లోర్ పిండి చల్లి వ్యాక్యూమ్ క్లియర్ తో శుభ్రపరిస్తే కొత్త వాటిలో ఉంటాయి.
Kitchen Home Remedies : వంటింట్లో పనులను వేగంగా పూర్తి చేయాలంటే..
16. ఇత్తడి సామాను ఆవును చింతపండుతో క్లీన్ చేస్తే కొత్త వాటిలా మెరుస్తాయి.
17. తుప్పు పట్టిన సూదులను సోప్లో గుచ్చి ఉంచితే పని చేస్తాయి.
18. మిక్సీలో ఉప్పు వేసి గ్రైండ్ చేస్తే బ్లేడ్లు బాగా పనిచేస్తాయి.
19. పాలు విరుగుతాయని అనుమానం వస్తే కాచే ముందు పాలల్లో చిటికెడు వంట సోడా కలిపితే పాలు విరగవు.
20. చలికాలంలో పెరుగు త్వరగా గట్టిగా తోడుకోదు పాలు తోడు పెట్టినప్పుడు వాటిలో ఒక ఎండు మిరపకాయ వేస్తే పెరుగు గట్టిగా త్వరగా తోడుకుంటుంది.
Read Also : Kitchen Remedies : చక్కెరతో బొద్దింకలను ఇలా తరిమేయండి.. ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది..!