Gas Burner Cleaning Tips : ప్రతిఒక్కరి ఇంట్లో కిచెన్‌లో గ్యాస్ స్టవ్ (Gas Stove Tips) కామన్‌గా ఉంటుంది. సాధారణంగా ఏదైనా వండినప్పుడు గ్యాస్ స్టమ్ మురికిగా మారుతుంటుంది. స్టవ్ బర్నర్ నుంచి మురికిని బయటకు తీయడం అసాధ్యం కాదు. కానీ, చాలా కష్టమని భావిస్తుంటారు. అలానే వదిలేస్తే మరింత మురికిగా మారుతుంది. స్టవ్ బర్నర్ (Stove Burners Clean) అన్ని మూలల్లోకి ప్రవేశించి అగ్లీగా కనిపిస్తుంది.
వంట చేయాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. మీరు మీ స్టవ్ బర్నర్ పై పేరుకుపోయిన మురికిని తొలగించాలంటే కొన్ని సులభమైన హోం రెమిడీలు ఉన్నాయి. ఈ హోం రెమిడీలతో (Kitchen Home Remedies) స్టవ్ బర్నర్ పై చేరిన మురికిని కేవలం నిమిషాల వ్యవధిలోనే తొలగించవచ్చు. మీ బర్నర్‌ను కొత్తదిగా శుభ్రంగా కనిపించేలా చేసేందుకు అద్భుతమైన చిట్కాలను ఓసారి ట్రై చేయండి. ఇంట్లోలో లభించే వస్తువులతో క్లీన్ ఏజెంట్లతో నిజంగా స్టవ్ బర్నర్‌ను క్లీన్ చేయగలవు. అవేంటో ఓసారి చూద్దాం..
ఇంట్లో కిచెన్ మురికిగా, జిడ్డుగా ఉండే స్టవ్‌లు, మరకలు ఉన్న బర్నర్‌లు చాలా పాతవిగా కనిపిస్తాయి. వండుకునే ఆహారం రుచిపై కూడా ప్రభావితం చూపిస్తాయి. వంటగదిలోని స్టవ్ బర్నర్ క్లీన్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. వంటగదిలో దొరికే వస్తువులు కేవలం స్టవ్ ఉపరితలంపై మాత్రమే క్లీన్ చేయగలవు. వంటగదిని ఎక్కువసేపు మెరిసేలా ఉంచాలంటే తప్పకుండా కొన్ని సులభమైన వంటింటి చిట్కాలను పాటించాలి. ఈ సులభమైన చిట్కాలతో వంటగదితో పాటు స్టవ్ బర్నర్ తళతళ మెరిసేలా చేయొచ్చు.
స్టవ్ పై పేరుకుపోయిన ఆహార అవశేషాలను కాల్చేందుకు కొన్ని నిమిషాలు బర్నర్‌ను ఆన్ చేయండి. ఆ తర్వాత బర్నర్‌ను సబ్బు నీటిలో కడగాలి. కాసేపు వేరుగా ఆ నీటిలో నానబెట్టండి. ముందుగా బేకింగ్ సోడా.. ఆ తర్వాత నీళ్లలో ముంచి 15 నిమిషాలు అలానే ఉంచండి. బేకింగ్ సోడా అవశేషాలను తొలగించేందుకు బర్నర్‌లను బాగా సబ్బు నీళ్లతో ఆ తర్వాత మంచి నీటితో కడగాలి. చివరగా, పూర్తి చేసేందుకు మృదువైన గుడ్డతో తుడవండి.
Gas Burner Cleaning Tips
గ్యాస్ స్టవ్‌ను ఉపయోగించేటప్పుడు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైటర్‌లు తడిసిపోకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాని పై పొర నుంచి అవశేషాలను తొలగించాలంటే తడిగా ఉన్న వస్త్రంతో పై ఉపరితలాన్ని తుడవండి. ధూళిని తొలగించేందుకు స్పాంజ్, సబ్బును ఉపయోగించండి. ఆ తర్వాత మరొక టవల్‌తో క్లీన్ చేయాలి. కొన్ని మరకలు తొందరగా పోవు.
చాలా పొడిగా మొండిగా ఉంటాయి. అప్పుడు.. మీరు ధూళిని తొలగించడానికి బేకింగ్ సోడా మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. 15 నిమిషాలు అలానే వదిలివేయండి. గ్యాస్ రంధ్రాలను క్లీన్ చేసేందుకు మరో చిట్కా ట్రై చేయొచ్చు. పేపర్‌క్లిప్ చివరలతో గ్యాస్ రంధ్రాలను ఈజీగా క్లీన్ చేయొచ్చు. పేపర్ క్లిప్‌ను కొద్దిగా కిందికి వంచి మూలల నుంచి గట్టి మురికిని తొలగించండి.