Weight loss tips : సాధారణంగా కొందరు బరువు తగ్గేందుకు జిమ్, వ్యాయామం, యోగా లాంటివి చేస్తుంటారు. ఇవి చేయడం వలన బరువు ఒక్కటే తగ్గుతారా..? శరీరంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి..
జిమ్ చేయడం వలన శరీరంలో అధికంగా ఉన్న కొవ్వుశాతం కరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కేలరీలు కరుగుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కార్డియో చేయడం వలన కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోతుంది. అయితే, రెగ్యులర్‌గా కార్డియో చేస్తుండటం వలన శరీరంలో కేలరీలు కరగడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. దీంతో వెంటనే మళ్లీ మనస్సు ఆకలి వైపు మళ్లుతుంది. సో జిమ్ తర్వాత వెంటనే ఆహారం తీసుకుంటారు. కానీ, జిమ్ చేయడానికి ముందు కంటే చేశాక ఎక్కువ తింటారని తెలుస్తోంది.
ఒకవేళ ఈరోజు మీరు జిమ్ చేసి 200 కేలరీలు కరిగిస్తే.. ఆకలి బాగా అవుతుందని అధికంగా ఆహారం తీసుకుంటారు. దీని వలన కేలరీలు కరిగినా, తీసుకున్న ఆహారం వలన మళ్లీ కేలరీస్ పెరిగి సమానం అవుతాయి. ఇదే ప్రక్రియ రోజు కొనసాగితే కేలరీలు తగ్గడం, పెరగడం కామన్ అయ్యి బరువు తగ్గడం ఏ మాత్రం జరగదు. కొందరు నిపుణులు తేల్చిన విషయం ఎంటంటే.. జిమ్ చేసిన తర్వాత కరిగిన కేలరీల కంటే మళ్లీ మనం అధిక ఆహారం తీసుకోవడం వలన కేలరీలు పెరిగిపోయి బరువు పెరుగుతారట..
దీంతో జిమ్ చేసిన ఫలితం బరువు తగ్గడానికి కాకుండా పెరగడానికి ఉపయోగపడుతుందని తేల్చారు.అయితే, ఈ మధ్య కాలంలో జరిపిన కొన్ని పరిశోధనల మూలంగా కార్డియో కంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ వల్ల మెటబాలిజమ్ మెరుగవుతుందని తేలింది. రెసిస్టెంన్స్ ట్రైనింగ్ వలన విశ్రాంతి సమయంలో కూడా కేలరీలు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.