weight Loss Tips : మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. కారణం మారుతున్న పరిస్థితులు, ఆహార అలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, తిన్నవెంటనే పడుకోవడం, టైం కానీ టైంలో తినడం వలన కూడా సులువుగా బరువు పెరుగుతారు. ఒక్కసారి బరువు పెరిగాక దాని వల్లే వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. నడుస్తూ వెళ్లాలన్న, మెట్లు ఎక్కేటప్పుడు, పరిగెత్తేటప్పుడు ఊరికే ఆయాసం వస్తుంటుంది.
ఫాస్ట్ గా ఏ పనులు చేయలేరు. ఫలితంగా గుండె జబ్బులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే, సులువుగా బరువు తగ్గేందుకు ఈ పౌడర్ వాడితే చాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అందుకు కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
సోంపు, 50గ్రాములు, పసుపు ఆఫ్ టేబుల్ స్పూన్, అవిసె గింజలు 25గ్రాములు, జీలకర్ర 25గ్రాములు, కరివేపాకు పొడి 25 గ్రాములు, కరక్కాయ పొడి 25 గ్రాములు, ఇంగువ 2 చిటికెలు, సైంధవ లక్షణం లేదా నల్లఉప్పు వీటిని ముందుగా సిద్దం చేసి పెట్టుకోవాలి.
ఎలా తయారు చేసుకోవాలంటే..
అవిసె గింజలు, సోంపు సన్నని సెగ మీద కొద్దిగా వేడిచేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మిక్సిలో పట్టాలి. ఈ పౌడర్‌కు పైన చెప్పిన మిశ్రమాలు అన్నింటిని 25 గ్రాముల చొప్పున కలుపుకుని భద్రపరుచుకోవాలి. భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేశాక గంట తర్వాత ఒక గొరువెచ్చని నీటిలో అరచెంచా పౌడర్ కలుపుకుని తగాలి.
రోజువారీగా ఇలా తాగడం వలన శరీరనంలో అక్కడక్కడా పేరుకుపోయిన కొవ్వును ఈ మిశ్రమం కరిగేలా చేస్తుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన సులువుగా జీర్ణం అవుతుంది. మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ మిశ్రమం మంచి ఫలితాలను ఇస్తుంది. కరక్కాయ, సోంపు కూడా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. శరీరంలో మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది.
Read Also : Milk for Weight Loss : ప్రతిరోజూ పాలు తాగితే బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంత? తప్పక తెలుసుకోండి..!