Sarvangasana Yoga : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలిలో ప్రతీ ఒక్కరి అలవాట్లు దాదాపుగా మారిపోయాయి. పాతికేళ్లలోపు వాళ్లే ఊబకాయం, బీపీ, షుగర్ ఇతర అనారోగ్య సమస్యలతో సతమవుతున్నారు. భౌతికంగా శరీరానికి ఎటువంటి శ్రమ చేకూర్చకుండా ఉండటం ఇందుకు కారణమవుతుంది. కాగా, యోగా వల్ల మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. కాగా, యోగాలో రకరకాల ఆసనాలుంటాయి. ముఖ్యంగా సర్వాంగసనంతో బోలెడన్ని ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే తప్పకుండా చేయాల్సిన ఆసనాల్లో ఒకటి సర్వాంగసనం. ఈ ఆసనం చేయడం అంత సులువు అయితే కాదు. కానీ, ఒకసారి అలవాటు చేసుకుంటే దీని వల్ల చక్కటి ప్రయోజనాలుంటాయి. అలా అని చెప్పి ఎవరికి వారు సొంతంగా అయితే ఈ ఆసనాలు చేయొద్దు. యోగా నిపుణులు లేదా ఇన్స్ట్రక్టర్స్ పర్యవేక్షణలోనే ఈ ఆసనాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం చేయాలంటే మీరు తొలుత శవాసన భంగిమలో పడుకోవాలి. ఆ తర్వాతనే ఈ ఆసనం చేయాల్సి ఉంటుంది.
అందుకుగాను నేల మీద చాప పరుచుకోవాలి. ఒకవేళ చాప లేనట్లయితే మందంగా ఉండే క్లోత్ను పరుచుకోవాలి. ఆ తర్వాత యోగసనం వేసేందుకు పూనుకోవాలి. అయితే, ఈ ఆసనాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేల మీద చేయొద్దు. అలా చేయడం చాలా ప్రమాదకరం. ఈ ఆసనం వేసే ముందర మీద రెండు కాళ్లను దగ్గరకు చేర్చుకోవాలి.
ఆ తర్వాత మెకాళ్లను చాతీ వరకు మలచి నెమ్మదిగా రెండు కాళ్లను పైకి లేపాలి. ఆ తర్వాత రెండు చేతులను వీపు వెనుక భాగంలోకి చేర్చి నడుముకు రెండు వైపులా చేతుల్ని ఆనించి పట్టుకోవాలి. అలా చేయడం వలన మీ బాడీ వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది. నడుము, కాళ్ల వెయిట్ మెడ మీద పడేలా మెల్లగా బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి లేపాలి. అలా కాళ్లను నైంటి డిగ్రీస్ యాంగిల్లో ఉండేలా ఆసనం వేయాలి. అంతే సర్వాంగసన భంగిమ వచ్చేస్తుంది.
అయితే, మీ బ్యాలెన్సింగ్ స్టామినాను బట్టి ఈ భంగిమలో కొద్ది సేపు అలానే ఉండాలి. ఎంత ఎక్కువ సమయం ఇలా ఉంటే అంత మంచిది. ఇక ఈ ఆసనం నుంచి విశ్రమించేపుడు శరీరాన్ని శవాసనంలోకి తీసుకురావాలి. పిల్లలు ఈ ఆసనం వేయడం ద్వారా బాగా హైట్ అవుతారు. బాడీ అంతటా బ్లడ్ సర్కులేట్ అవుతుంది. హెయిర్ లాస్ కంట్రోల్ అవడంతో పాటు తలనొప్పి, థైరాయిడ్ సమస్యలు పరిష్కరించబడుతాయి.
యోగాసానలతో అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చునని యోగా నిపుణులు చెబుతున్నారు. ఆసనాలను బట్టి మీ అనారోగ్య సమస్యను తగ్గించుకోవచ్చు. యోగాసానాలు వేసే సమయంలో ఏయే ఆసనాలు ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించగలవో తెలుసుకోవాలి. అప్పుడే ఆసనాలు వేసేందుకు సన్నద్ధమవ్వాలి.
కొంతమంది ఆసనాలు గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలా పడితే అలా చేసేస్తుంటారు. ఇలా చేయడం మంచిదికాదు. లేనిపోని కొత్త సమస్యలను కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. ఒక్కో ఆసనానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని తెలిసిందే. ఆసనాలతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుని యోగనియమాలను పాటిస్తూ చేస్తుంటే చక్కని ఫలితాలను పొందవచ్చు.
Read Also : Ciplukan Fruit : మీ ఊళ్లో ఈ పండ్లు, కాయలు కనిపిస్తే అసలు వదలొద్దు.. సర్వ రోగనివారిణి!