Ciplukan Fruit : మీ ఊళ్లలో బుడమ కాయ చెట్లు కనిపిస్తుంటాయి. ఆ చెట్లను చూస్తారుకానీ, ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదో పిచ్చి మొక్కగా అనుకుంటారు. కానీ, ఇలాంటి చెట్లు కనిపిస్తే అసలు వదలకండి. ఈ చెట్ల కాయలు, పండ్లు అనేక రోగాలకు సర్వరోగ నివారిణీగా పనిచేస్తాయి. ఈ చెట్టు పండ్లలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. బుడమ చెట్ల పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలిస్తే.. చెట్ల మొక్కల కోసం మీ ఊరంతా తెగ వెతికి తిరిగేస్తారు కూడా. సాధారణంగా చిన్నతనంలో చాలామంది ఈ పండ్లను తింటుండేవారు. కొంచెం తీపి, పులుపుతో ఒకరకమైన రుచి కలిగి ఉంటుంది.
ఈ పండ్లలో అనేక ఔషధ గుణాలను, విటమిన్లు కలిగి ఉంటాయి. చూడటానికి సన్నటి పొరలాంటి కవచం ఉంటుంది. గట్టిగా నొక్కితే పేలిపోయే బుడబుచ్చకాయలుగా పిలుస్తారు. ఒక్కో ఊరిలో ఒక్కోలా పిలుస్తుంటారు. ఈ చెట్లను బుడ్డ కాయ, బుడమ చెట్టు లేదా అడవి టమాటా అనే పేర్లతో పిలుస్తారు. ఈ పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. అదే పండినప్పుడు మాత్రం టమాటా పండు రంగులోకి మారిపోతాయి. ఈ పండ్లను చిన్నపిల్లలకు తినిపించడం ద్వారా కడుపులో నులిపురుగుల సమస్యలను నివారించవచ్చు. పండ్లు తినడం ద్వారా కడుపులోని పురుగులు చనిపోతాయి. అలాగే మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం ద్వారా మలబద్దకం సమస్య నుంచి వెంటనే భయటపడొచ్చు.
ఒకే మొక్క.. ఔషధ గుణాలెన్నో..
ఎన్నో రకాల విటమిన్లు, ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా ఈ బుడమ పండ్లను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఆ తర్వాత ఆరగిస్తుంటారు. ఈ పండ్లలోని విటమిన్లు శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయట.. ఈ ఆకులో విటమిన్ A పుష్కలంగా లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా ఈ బుడమ ఆకులను ఆహారంగా వండుకుని భుజిస్తుంటారు. ఆహారంలో ఈ కాయ ఆకులను చేర్చుకోవడం ద్వారా కంటిశుక్లాలు, దృష్టిలోపం తగ్గడం, కళ్లు మసగబారటం, కంటి సమస్యలు, ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గించుకోవచ్చు.

ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారు ఈ చెట్ల వేరును తెచ్చి కషాయంగా చేసుకుని తాగొచ్చు. ఇలా నిత్యం చేస్తే షుగర్ వ్యాధి వెంటనే కంట్రోల్లోకి వస్తుంది. ఇక మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మడాళ్ల నొప్పులతో బాధపడేవారంతా ఈ బుడమ ఆకులను తెచ్చి మెత్తగా నూరుకోవాలి. మీకు నొప్పులు ఉన్నచోట ఈ ఆకుల పేస్టును లేపనంగా రాయాలి. పసరుకట్ట మాదిరిగా కట్టడం వల్ల తొందరగా నొప్పుల నుంచి రిలీఫ్ పొందవచ్చు.
సెగగడ్డలకు చెక్ :
చాలామంది ఏ వేడి వస్తువులు తిన్నా వెంటనే శరీరంపై ఎక్కడో ఒకచోట సెగ గడ్డలు వేధిస్తుంటాయి. ఈ సమస్య తీవ్రంగా ఉన్నవారంతా ఈ బుడమ కాయ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. ఆ తర్వాత ఆకులతో పసరుకట్టు కడితే సెగగడ్డలు త్వరగా తగ్గిపోతాయి. చిన్న పిల్లల్లో కడుపు నొప్పితో బాధపడుతుంటుటే.. ఈ చెట్టు ఆకులను నూరి పొట్టపై పట్టి వేయాలి. వెంటనే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Ciplukan Fruit : ఈ చెట్ల కాయలతో అనేక జబ్బులు మాయం..
గాయాలు అయినప్పుడు ఈ కాయల నుంచి పసరు తీసి గాయాలు అయినచోట రాయాలి. ఇలా చేయడం ద్వారా రక్తస్రావం తగ్గిపోయి గాయాలు తొందరగా మానిపోతాయి. బుడమ కాయలను తినడం ద్వారా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మనిషికి ప్రధాన అవయవాలైన హృదయం, మూత్రపిండాలు బలంగా ఆరోగ్యంగా మెరుగుపడతాయి. ఈ చెట్లు ఒక్క భారతదేశంలోనే కాదు.. ఇతర దేశాలలో కూడా ఇష్టంగా తింటుంటారు. మరికొన్ని దేశాల్లో అయితే బాక్సుల్లో పెట్టి మరి అమ్మేస్తుంటారు.
ఈ చెట్లు మొత్తం అనేక ఔషధగుణాలతోనే నిండి ఉంది. చెట్ల కాయల్లో అనేక ఔషధ గుణాలు వ్యాధినిరోధకతను పెంచుతాయి. అంతేకాదు.. యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్లను దరిచేరనీయవు. ఈ బుడమ కాయల్లో యాంటీబాక్టీరియల్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ మొక్క సారాన్ని తలనొప్పి ఉన్నచోట రాయడం ద్వారా వెంటనే నొప్ని నుంచి రిలీఫ్ పొందవచ్చు. చర్మ సమస్యలతో బాధపడేవారంతా ఈ చెట్ల నుంచి తీసిన రసాన్ని చర్మంపై రాయడం ద్వారా వెంటనే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని నువ్వుల నూనెతో కలిపి తీసుకోవచ్చు. ఈ నూనె మిశ్రామన్ని గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
ఆ వేడి మిశ్రామాన్ని చెవిలో వేసుకోవడం ద్వారా తొందరగా నొప్పి తగ్గే అవకాశం ఉంది. చెట్టు వేరు కషాయాన్ని తాగితే వెంటనే జ్వరం నుంచి కోలుకోవచ్చు. సాధారణంగా బుడమ చెట్లు గ్రామశివారుల్లో లేదా పోలాల గడ్ల పక్కన పెరుగుతుంటాయి. పైన ఫొటోలో చూపించినట్టుగా కాయలు బుడగలు మాదిరిగా కనిపిస్తాయి. లోపల గింజ ఉంటుంది. ఆ గింజ పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగానూ పండినప్పుడు టమాటా రంగులోకి మారిపోతుంది. ఎవరైనా ఈ చెట్లను ఈజీగా గుర్తుపట్టొచ్చు. మీ ఊళ్లో కూాడా ఇలాంటి చెట్లను ఎప్పుడైనా గమనించారా? అయితే ఈసారి ఆ బుడమ కాయల చెట్లను పరిశీలించండి. చాలామందికి ఈ చెట్లు ఎలా ఉంటాయో తెలిసే ఉంటుంది. అందుకే మీ ఊళ్లచివరిలో ఎక్కడైనా పోలాల్లో కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి. అనేక వ్యాధులకు ఈ చెట్లతో చెక్ పెట్టేయొచ్చు.
Read Also : Girls Notice Boys : ఆడవాళ్లు మగవారిలో గమనించే ముఖ్య విషయాలివే..!!