Tamalapaku : సాధారణంగా భారతీయ పండుగల్లో దీపావళికి ప్రత్యేకస్థానం ఉంటుంది. బాధలు తొలిపోయాక వచ్చే సంతోషానికి ప్రతీకగా ఈ లైటింగ్ ఫెస్టివల్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఘనంగా జరుపుకుంటారు. ఇంట్లో, బయట దీపాలను వెలిగించి.. చీకటిని పారదోలేందుకు కాంతిని ప్రసరింపజేస్తారు. ఇలా చేయడం వలన ఇళ్లంతా కాంతివంతం కావడంతో దుష్టశక్తులు కూడా తొలగిపోతాయని భావిస్తారు. దీపావళి రోజున ప్రత్యేకంగా లక్ష్మీ దేవికి పూజలు చేసి ఆరాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారుల విషయానికొస్తే ధనలక్ష్మీ కాటాక్షం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారని తెలిసింది. అయితే, ఎల్లప్పుడూ తమ ఇంట్లో ధనలక్ష్మీ కొలువు దీరాలనుకుంటే తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ఆ ఇంట్లో, వ్యాపారంలో కనకవర్షం కురుస్తుందని జోతిష్యశాస్త్రం తెలిసిన వారు చెబుతున్నారు.
దీపావళి రోజున కొందరు ధనలక్ష్మీతో పాటే కుబేరుడు, గణపతిని కూడా ఆరాధిస్తారట. లక్ష్మీ దేవికి చంచల గుణం ఉంటుందని, అందుకే ఒకే దగ్గర నిలకడగా ఉండదని చెబుతున్నారు పండితులు.. అందుకే లాభాలు, నష్టాలు వస్తుంటాయని సెలవిచ్చారు. అయితే, లక్ష్మీదేవి అన్నివేళలా ఇంట్లో కొలువు దీరాలంటే మాత్రం దీపావళి రోజున తమలపాకుతో ప్రత్యేకంగా పూజ చేయాలట.. ఇలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని పండితులు చెబుతున్నారు. ముందుగా ఆ దేవిని తమలపాకుతో ఆరాధించి గల్లా పెట్టెలో (ధనం దాచే చోటు)లో ఉంచితే లక్ష్మీ దేవి శాశ్వతంగా అక్కడే కొలువు దీరుతుందని నమ్మకం.

ఈ మధ్య కాలంలో కరోనా పాండమిక్ పుణ్యమా అని వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇప్పుడిప్పుడే వారి వ్యాపారులు గాఢీన పడుతున్నారు. బిజినెస్‌లో మంచి లాభాలు చేకూరంటే తమలపాకుతో ఈ పరిహారం చేయాలి. దీంతో వ్యాపారం మళ్లీ నష్టాల బాటలో నుంచి లాభాల బాటలోకి వెళుతుంది. ఏం చేయాలంటే.. శనివారం రాత్రి సమయంలో రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజ చేసి తమలపాకులు, ఒక రూపాయి నాణెంను మన వద్ద ఉంచుకోవాలి. తెల్లవారాక ఆ రావి చెట్టు నుంచి ఒక ఆకును తీసుకొచ్చి , దానిపై ఒక తమలపాకును పెట్టి.. ఆ రెండింటిని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచాలి. ఈ పరిహారం తర్వాత తప్పకుండా మీ వ్యాపారం గాఢీన పడుతుందని, అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పండితులు సెలవిచ్చారు.
తమలపాకులు ప్రత్యేకించి ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరమైనవి. తమలపాకుతో హనుమాన్ కు ఆకు పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. హనుమాన్ ఆశ్వీరాదంతో పాటు అనుకున్న పనులు ఎలాంటి ఆటంకులు లేకుండా జరిగిపోతాయని నమ్ముతారు. ఎలాంటి రుణబాధలు, అనారోగ్య సమస్యలు ఉన్నా హనుమాన్ పూజ చేయడం ద్వారా అనేక సమస్యలకు స్వస్తి పలకొచ్చు అంటారు. ధన ఆకర్షణలో కూడా తమలపాకులు అద్భుత రెమడీగా పనిచేస్తాయి. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. అందుకే డబ్బులు పెట్టేచోట ఈ తమలపాకులను పెట్టుకోవడం చేస్తే ధనాన్ని బాగా ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు. తమలపాకులు పూజలో ఎంతో శ్రేష్టమైనవి.. అలాంటి తమలపాకులతో పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగం చేసే చోట లేదా వ్యాపారంలో తమలపాకులను రూపాయి నాణెంతో కలిపి దగ్గర ఉంచుకోవడం ద్వారా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేలా చేస్తాయి.
Read Also : Ciplukan Fruit : మీ ఊళ్లో ఈ పండ్లు, కాయలు కనిపిస్తే అసలు వదలొద్దు.. సర్వ రోగనివారిణి!