Zodiac Signs People : ఎంతలా ధైర్యం ఉన్న వారైనా దెయ్యాల స్టోరీలు వింటే ఎక్కడో జడుసుకుంటారు. బయటకు ధైర్యంగా ఉన్నట్లు నటించినా కానీ వారికి ఏ మూలో భయం పట్టుకుంటుంది. అంతలా భయపెట్టిస్తాయి. దెయ్యాల స్టోరీలు. ఇక దెయ్యాల సినిమాలు అయితే సరే సరి. ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లు, ఆ ఎఫెక్టులు వెరసి మనలో ఎక్కడో లేని భయాన్ని కలిగిస్తాయి. కొంత మంది దెయ్యాలని ఎక్కువగా నమ్ముతారు. కొన్ని రాశుల వారు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తారు. అటువంటి రాశులేవనేది ఒక్కసారి గమనిస్తే…

మిథునం రాశి : ఈ రాశి వారు ఎక్కువగా దెయ్యాలను నమ్ముతారట. ఈ రాశి వారు ఎక్కువగా సూపర్ నాచురల్ పవర్స్ గురించి ఆరా తీస్తారట. దెయ్యాలంటే కొంత మంది ఈ రాశి వారికి ఎటువంటి భయం లేకున్నా కానీ అటువంటి విషయాలను గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు.
సింహ రాశి : మిథున రాశి వారిలాగానే ఈ రాశి వారికి కూడా దెయ్యాల విషయాల మీద మక్కువ ఎక్కువగా ఉంటుందట. ఇక ఈ రాశి వారి ఇటువంటి విషయాలను తెలుసుకునేందుకు తెగ తాపత్రయపడతారట.
తులారాశి : పై రెండు రాశుల వారికి మల్లే తులా రాశి వారికి కూడా దెయ్యాల విషయంలో తెగ ఆసక్తి ఉంటుంది. వీరు సూపర్ నాచురల్ పవర్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ట్రై చేస్తారు. కానీ అందులో ఉన్న సానుకూల విషయాలను గురించి మాత్రమే ఆలోచిస్తారు.
కుంభరాశి : ఈ రాశి వారు దెయ్యాల కథలంటే చాలా ఉత్సాహంగా వింటారు. కానీ ఎటువంటి దెయ్యాల కథలను చెప్పినా కానీ కుంభరాశి వారు మాత్రం అస్సలు భయపడరట.
Read Also : Horoscope Today : ఈ రాశి వారికి సాయం చేసే గుణం ఎక్కువంట.. ఈ లిస్టులో మీరున్నారో లేదో చూసుకోండి