White Hair : మనలో చాలా మంది తెల్లజుట్టుతో బాధపడుతుంటారు. ఒకప్పుడు వయస్సు మీద పడినప్పుడు మాత్రమే తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్న వయసు వారికి సైతం వైట్ హెయిర్స్ వస్తున్నాయి. దీంతో అలాంటి వారిని ఎదుటి వారు చూస్తూ ఆటపట్టిస్తుంటారు. అయితే ఇలాంటి వైట్ హెయిర్స్‌కు రావడాన్ని కొద్దిమేరకు నివారించొచ్చు. అయితే కొంత మందిలో వారి వంశపారంపర్య వల్ల తెల్ల జట్టు వస్తుంది. మరి కొందరిలో థైరాయిడ్ కారణంగా వైట్ హెయిర్ వస్తుంది.
కొన్ని నేచురల్ మెథడ్స్ వల్ల వైట్ హెయిర్‌ను బ్లాక్ హెయిర్‌గా మార్చుకోవచ్చు. జుట్టు ఎక్కువగా తెల్లపడకుండా ఉండేందుకు కొన్ని ట్రిక్ పాటిస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కొంచెం ఉసిరి పొడిలో కొంచెం నిమ్మరసం కలపండి. దాన్ని ప్రతి రోజూ తలకు అప్లై చేసుకుని రెండు గంటల తర్వాత తల స్నానం చేయడం వల్ల రిజల్ట్ కనబడుతుంది. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడం మొదలవుతుంది.
ఇందుకు మరో చిట్కా కూడా ఉంది. ఉల్లిగడ్డను మెత్తగా నూరి తెల్ల వెంట్రుకలను అప్లై చేసి రెండు గంటల తర్వాత షాంపు పెట్టుకుని తల స్నానం చేయాలి. అదీ కాకుండా కొబ్బరినూనెలో కొంచెం నిమ్మరసం కలిపి దాన్ని క్రమం తప్పకుండా తలకు అప్లై చేయడం వల్ల వైట్ హెయిర్ బ్లాక్‌గా మారుతుంది. రెగ్యులర్‌గా క్యారెట్ జూస్ తాగడం వల్ల వైట్ హెయిర్ రాదు.
అలా కాకుండా నువ్వులను మెత్తని పేస్టుగా మార్చుకుని, అందులో కొంచెం బాదం ఆయిల్ కలుపుకుని దానిని తలకు అప్లై చేస్తే వైట్ హెయిర్ బ్లాక్‌గా మారుతుంది. తినే ఫుడ్ విషయంలో సైతం కొన్ని మార్పులు అవసరం. ప్రొటీన్స్, విటమిన్ బీ12 ఎక్కువగా ఉండే వాటిని తినాలి. ప్రతిరోజూ గుడ్లు, పాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.