Relationship : యంగ్ ఏజ్ లో ఉన్న మగాళ్లు ఎక్కువగా తమ కొలీగ్స్ ను కానీ , తమతో చదువుకునే అమ్మాయిలను కానీ పడేసేందుకు చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని సార్లు అబ్బాయిలు ఎంత నిజాయతీగా ట్రై చేసినా కానీ అమ్మాయిల ప్రేమను పొందడం చాలా కష్టంగా మారుతుంది. అటువంటి అమ్మాయిలకు విలువైన గిఫ్టులు ఇస్తే ఈజీగా లవ్ లోకి దింపొచ్చని చాలా మంది అబ్బాయిలు తప్పుగా భావిస్తారు.
కానీ వారికి గిఫ్టులు ఇవ్వడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. గిఫ్టులిస్తేనుకుంటేనే ప్రేమిస్తారు. కేవలం డబ్బున్న అబ్బాయిలకు మాత్రమే ప్రేమ దొరికేది. కానీ ప్రపంచం మీద అలా జరగడం లేదు కదా. మరి అటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటే ఇంప్రెస్ అవుతారనే విషయాలను తెలుసుకుంటే…

అమ్మాయిలు అబ్బాయిల నుంచి కోరుకునేది నిజాయతీ. ఆ నిజాయతీ కనుక మీలో వారు గుర్తించారంటే మీరు వద్దన్నా కానీ వారు మీతో ప్రేమలో పడిపోతారు. కానీ ముందు వారు మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు చేసే పనులు అమ్మాయిలకు నచ్చాలి. అంతే కానీ మీరు పని కట్టుకుని వారిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. కావున మీరు కూడా ప్రతి విషయాన్ని చాలా ఓపెన్ గా మాట్లాడేందుకు ట్రై చేయండి.
సరదాగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కానీ ఈ విషయాన్ని వారంతట వారు బయటకు చెప్పరు. కాబట్టి మీరు అమ్మాయిలతో మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నమ్మకం ఈ మూడక్షరాల పదం బంధం నిలవడం కోసం చాలా అవసరం. నమ్మకం లేని చోట ఏ విషయం అయినా కానీ నిలబడదు. అందుకోసమే మీ మీద అమ్మాయిలకు నమ్మకం కలిగేలా మసులుకోవడం చాలా ఇంపార్టెంట్.
Read Also : Relationship Problems : భార్య భర్తలు కలిసి ఇలా మాట్లాడుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు