Vastu Tips: ఇంట్లో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థిక సమస్యలు కావొచ్చు.. ఆరోగ్య సమస్యలు కావొచ్చు.. ఈ రెండింటితో మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పక ఉండే ఉంటుంది.
ఇందులో ఏ సమస్య వచ్చినా ముందుగా ఆర్థికంగానే దెబ్బతగులుతుంది. జాతక దోషాలతో పాటు ఇంట్లో కొన్ని దోషాలను తొలగించుకోవాలంటే అనేక రెమడీలు ఉన్నాయి. ఇంటి వాస్తు సరిగా లేకపోయినా కూడా కుటుంబంలో అనారోగ్య సమస్యలు అధికంగా వస్తుంటాయి.
ఇంట్లో దోషాలను తొలగించుకోవాలంటే ఒక అద్భుతమైన రెమడీ ఉంది. ఇంట్లో మానసిక ప్రశాంతత కోసం ఒక పక్షి ఫొటో తెచ్చి పెట్టుకోండి.. అదే రాబందు ఫొటో.. ఈ ఫొటోను ఇంట్లో పెట్టుకోవడం వల్ల దోషాలు తొలిగిపోతాయట.. అంతేకాదు.. పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకొస్తుందట.. అనేక సమస్యలకు మంచి పరిష్కారం కూడా దొరుకుతుందని చెబుతున్నారు. ఏదిఏమైనా ఇంట్లో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చునని అంటున్నారు.
రాబందు ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది. పురాతన కాలం నుంచే రాబందుకు విశిష్టత కలిగి ఉంది. ఈ రాబందు ఫొటోను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా పలు సమస్యలు వాటంతట అవే తొలిగిపోతాయట.. అలాగే రాబంధు ఫొటోను పెయింటింగ్ వేయించుకోవచ్చు. ఫలితంగా మంచి పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది.
మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఈ రాబంధు ఫొటోను మీ ఇంట్లో పెట్టుకునే ముందు దీనిగురించి తెలిసినవారి సలహాలను కూడా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు తెలియకుండా ఏదో ఒకటి ఇంట్లోకి తెచ్చుకున్నాక దానివల్లే ఈ సమస్యలు అంటూ అనుమానాలతో ఇబ్బందులు పడుతుంటారు.
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఎలాంటి పక్షుల ఫొటోలను పెట్టుకోవాలో తెలుసుకోవాలి. చాలామంది తెలిసి తెలియకుండా ఏయే ఫోటోలను ఇంట్లో అందం కోసం తెచ్చి పెట్టుకుంటుంటారు. ఇలా చేయడం ద్వారా మీకు తెలియకుండానే వాస్తు దోషం ఏర్పడుతుందని గుర్తించరు. పక్షుల ఫొటోల్లో రాబందు ఫొటోతో చిన్న చిన్న వాస్తు దోషాలు కూడా తొలగించుకోవచ్చు.
చిన్నపాటి వాస్తు దోషాలు కూడా మనిషిని చాలా ఇబ్బందుల పాలు చేస్తాయి. ఇంట్లో ఏయే వాస్తు దోషాలు ఉన్నాయో వాస్తు నిపుణులకు చూపించి సరిచేసుకోవాలి. అవసరమైతే కొన్ని రెమడీలను కూడా పాటించడం చాలా మంచిది. వాస్తు దోషాలు తొలగించుకోవడం ద్వారా ఇంట్లో ఆర్థికపరంగా, మానసిక, ఆరోగ్య పరంగా అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఎక్కువగా అనారోగ్య సమస్యల రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
రాబంధు ఫొటోను తెచ్చి పెట్టుకోవడం ద్వారా సకల వాస్తు దోషాలను వెంటనే నివారించుకోవచ్చు. మీ ఇంట్లో ఏదైనా పక్షి ఫొటోను పెట్టుకోవాలనుకుంటే ముందుగా రాబంధు ఫొటోను పెట్టుకోవచ్చు. కొంతమంది ఇంట్లలో గుడ్లగూబ ఫొటోను తెచ్చిపెట్టుకుంటారు. ఎంతమాత్రం అలా చేయొద్దు. లేనిపోని కష్టాలను కొనితెచ్చుకున్నట్టే.. ఇంట్లో వాస్తు దోషాలను గుర్తించి వాటిని సరిచేసుకోనేందుకు ప్రయత్నించాలి.
అప్పుడే మీతో పాటు మీ కుటుంబంలోని సభ్యులు కూడా ఇబ్బుందుల నుంచి బయటపడొచ్చు. వాస్తు దోషాలు లేని ఇంట్లో నివసించేవారు ఎప్పుడూ కలతలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Read Also : Food At Wrong Time : ఆహారం తినేటప్పుడు మీరు చేస్తున్న తప్పులివే!