Vastu tips : ప్రస్తుతం చాలా మంది తమ ఇంటి డెకరేషన్ కోసం మనీ ప్లాంట్ లను ఉపయోగిస్తుండటం చూస్తూనే ఉంటాం. ఈ మొక్క చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది తీగ జాతికి చెందిన మొక్క. ఎండ తగలక పోయిన ఇది బాగా ఎదుగుతుంది. అందువల్లే చాలా మంది దీనిని ఇళ్లలో పెంచుకుంటారు. కానీ వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ధనానికి ప్రతిరూపం. ఈ మొక్క ఏ ఇంట్లో ఉంటే అక్కడ డబ్బులకు లోటు ఉండదు. దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు పోతాయని నమ్ముతారు. ఈ ప్లాంట్ ఉన్న ఇంట్లో ఎప్పుడూ సంపదలు, సంతోషం వెల్లివిరుస్తాయని నమ్మకం. మరి ఇంట్లో దీనికి ఎక్కడ పడితే అక్కడ పెంచొచ్చా? ఎక్కడ పెంచితే ఎలాంటి లాభాలు చేకూరుతాయి? మరి ఏ దిక్కున పెంచితే ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం..
Vastu tips_ planting money plant in the house
ఇంటిలో మంచి జరగాలన్నా.. డబ్బులు రావాలన్నా.. ఈ మొక్కను తూర్పు, ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఎందుకంటే ఆగ్నేయంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వినాయకుడు ఆ దిశకు అధిపతి. కాబట్టి ఆగ్నేయం దిశలో ఈ మొక్కను పెంచితే మంచి ఫలితాలు వస్తాయి. మరచిపోయి కూడా దీనిని ఈశాన్యం తూర్పు, ఈశాన్యం ఉత్తర దిక్కుల్లో ఉంచొద్దు. దీని వల్ల అశుభాలు ఏర్పడతాయి. ఈ ప్లాంట్ ను ఎప్పుడూ ఇంటిలోపలే పెంచాలి. దీని తీగ పైకి పెరిగితే వల్ల ఎంతో లాభం చేకూరుతుంది. ఈ తీగను ఎప్పుడూ కిందికి వేలాడదీయొద్దు. కిందికి వేలాడదీస్తే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే చాన్స్ ఉంది. దీనిని కుండలో లేకుంటే డబ్బాలో పెట్టాలి. దాని వల్ల మొత్తం ఇంటికే శక్తి అందుతుంది.