Ganga Jal : గంగాజలం.. చాలా మంది దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎలాంటి మంచి పనులు మొదలు పెట్టిన దీనిని వాడటం ఆనవాయితీ. చాలా శుభకార్యాల్లో గంగాజలం వాడటం కంపల్సరీ. గంగ మోక్షాన్ని ఇస్తుందని చాలా మంది విశ్వాసం అందుకే చాలా మంది గంగానదిలో స్నానం చేస్తారు. దీని వల్ల వారు చేసిన పాపాలు దూరమవుతాయని నమ్మకం. చాలా మంది తమ ఇంటిలో గంగాజలాన్ని ఉంచుతారు. దీని వల్ల ఇల్లు శుభప్రదంగా ఉంటుందని, అభివృద్ధి చేకూరుతుందని నమ్మతారు. అందుకే ఇంట్లో ఉంచిన గంగాజలాన్ని భక్తితో కొలుస్తారు. మరి గంగాజలం ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులు ఎంటో తెలుసుకుందాం.
ఎక్కువ మంది ఈ గంగాజలాన్ని డబ్బాల్లోనో, లేదా ప్టాస్టిక్ బాటిల్స్‌లోనూ నిల్వ ఉంచుకుంటారు. అలా చేయకూడదు. ఇలా చేస్తే పొరపాటే. ఎందుకంటే ప్లాస్టిక్‌ను ఎవరూ స్వచ్ఛంగా భావించరు. గంగాజలాన్ని వీలైనంతవరకు రాగి, ఇత్తడి, వెండి, మట్టి చెంబుల్లో మాత్రమే ఉంచాలి. ఇంట్లో గంగాజలం ఉంటే ఇక పరిశుభ్రత పట్ల కేర్ ఉండాల్సిందే. ఈ జలాన్ని ఉంచిన ప్రదేశాల్లో నీచు వస్తువులు, పదార్థాలు పెట్టొద్దు. గంగాజలాన్ని కిచెన్ కు దూరంగా ఉంచాలి.
ఈ జలాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. పవిత్రంగా భావించే స్థలంలో ఉంచి అక్కడ ఎలాంటి మురికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జలాన్ని తాకే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. శుభ్రం చేసుకోని చేతులతో ఈ నీటిని ముట్టుకోకూడదు. మురికి చేతులతో ఈ జలాన్ని తాకొద్దు. అలా తాకితే దానిని పెద్ద దోషంగా భావిస్తారు. కాబట్టి గంగాజలాన్ని ముట్టుకునేముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానిని ఉంచే ప్రదేశాన్ని సైతం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.
Read Also : Peepul Tree : ఇంట్లో రావి చెట్టును అస్సలు పెంచకూడదట.. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!