varahi kanda deepam : దృష్టి దోషాలు, శత్రు బాధలు తొలగి గృహ లాభం, భూ లాభం కలగాలంటే ఈ వారాహి దేవి మంత్రం తప్పక పఠించండి. ఆషాడమాసం ప్రారంభమవుతుంది. ఆషాడ మాసంలో శుభ కార్యక్రమాలు ఏవి నిర్వహించరాదు. గృహప్రవేశం, శంకుస్థాపన వివాహాది, శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. అయితే, ఆషాడమాసం ఉగ్రదేవతల అర్చనకు అనుకూలమైన మాసం. దుర్గాదేవిని మహిషాసుర మర్దిని అమ్మవారిని నరసింహస్వామిని కాలభైరవుడ్ని ఈ మాసంలో పూజిస్తే జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతాయి. రాజయోగాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. తొందరగా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించవచ్చు.
అలాగే ఈ మాసంలో గొడుగు గాని పాదరక్షలు గాని ఉసిరికాయలు గాని ఎవరికైనా దానం ఇస్తే జాతక దోషాలనుంచి తొందరగా బయటపడొచ్చు. ఎలాంటి దానాలు ఇవ్వలేని వాళ్ళు ఈ మాసంలో ఉప్పు దానం ఇచ్చినా కూడా సకల శుభాలు కలుగుతాయి. అలాగే, ఈ మాసం శ్రీమన్నారాయణ మూర్తికి అమ్మవారికి ఎంతో ప్రతిపాత్రమైన మాసం. కాబట్టి, ఈ మాసంలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ లలితా సహస్రనామ పారాయణ చేస్తే.. విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. పారాయణులు చేసుకోలేని వాళ్ళు రోజు కనీసం ఆ పారాయిడ్లు విన్నా కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు. అదేవిధంగా, ఈరోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి.
వారాహి అమ్మవారి గొప్పతనం గురించి చండీ సప్తశతిలో చెప్పడం జరిగింది. చండీ సప్తశతిలో సప్తమాతృకలు అనే పేరుతో అమ్మవారు అనేక రూపాలలో యుద్ధ రంగంలో రాక్షసులను సంహరించారు. ఆ సప్తమాతృ కారు పాలలో అత్యంత శక్తివంతమైనటువంటి రూపం వారాహి అమ్మవారి రూపం. వరాహస్వామి భూమిని ఉద్ధరించినప్పుడు వరాహ స్వామిలో ఉన్నటువంటి స్త్రీ శక్తి స్వరూపమే వారాహి దేవిగా ఆవిర్భవించిందని చండీ సప్తశతిలో ఉంది.

ఈరోజు నుంచి వారాహి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న శుభ తరుణంలో దేవి భాగవతంలో చండీ సప్తశతిలో చెప్పబడినటువంటి వారాహి దేవి ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 11 సార్లు చదువుకున్నట్లయితే.. వారాహి దేవి అనుగ్రహం వల్ల శత్రువుల నశించిపోతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు. రాజకీయాల్లో గాని ఉద్యోగాల్లో గాని అఖండమైన రాజయోగం కలుగుతుంది. అలాగే, తొందరగా సొంతింటి యోగం కలగటానికి భూలాభం కలగటానికి వారాహి అమ్మవారి ధ్యాన శ్లోకం విశేషంగా సహకరిస్తుంది.
అలాగే, నరదృష్టిని పోగొట్టుకోవటానికి కూడా ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. “గృహిత్యోగ్ర మహా చక్రే ధంష్టోదృత వసుంధరే వరాహ రూపిని శివే నారాయణి నమోస్తుతే..” ఈ శ్లోకాన్ని చండీ సప్త స్థితిలో చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్న అర్ధాన్ని మనం పరిశీలించినట్లయితే.. గృహిత్యోగ్ర మహా చక్రే అంటే.. సుదర్శన చక్రాన్ని ధరించి.. దంష్టోత్తరత వసుందరే అంటే.. కూరలతో భూమిని ఉద్ధరించినటువంటి.. వరాహ రూపిని శివే నారాయణి నమోస్తుతే అంటే.. వరాహరూపంలో ఉన్నటువంటి వరాహ స్వామిలో ఉన్నటువంటి.. స్త్రీ శక్తి స్వరూపమైన వారాహి దేవికి నమస్కారం అని చెప్పటమే.. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం.
Varahi Kanda Deepam : కంద దీపం ఎలా పెడితే మంచిది.. ఏయే ఫలితాలంటే?
అలాగే ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఇంట్లో ఒక శక్తివంతమైన దీపం పెడితే వారాహి దేవి వరాల జల్లు కురిపిస్తుంది. ఆ దీపాన్ని వారాహి కంద దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ వారాహి కంద దీపాన్ని ఎలా వెలిగించాలంటే.. మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫొటో ఉంటే.. ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి లేదా విగ్రహం ఉంటే విగ్రహాన్ని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక కందగడ్డను తీసుకోవాలి. ఆ కందగడ్డను శుభ్రంగా కడిగి పసుపు బొట్లు పెట్టాలి. కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ కందగడ్డపై భాగంలో కొంత భాగాన్ని తీసివేసి అక్కడ తీసివేసిన భాగంలో ఒక ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వారాహి అమ్మ వారి చిత్రపటం దగ్గరగాని విగ్రహం దగ్గరగానే ఉంచాలి. దీన్ని వారాహి కంద దీపం అనే పేరుతో పిలుస్తారు.
మామూలుగా వారాహి అమ్మవారి దగ్గర దీపారాధన చేయడంతో పాటుగా ఈ వారాహి కంద దీపాన్ని కూడా వెలిగించినట్లయితే తొందరగా భూ లాభం గృహలాభం కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే, ఈ కంద దీపాన్ని వెలిగించిన తర్వాత లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. ఏవైనా దుంపలు నైవేద్యం పెట్టాలి తేనె కూడా నైవేద్యం పెట్టాలి. అలా చేస్తే.. విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మర్నాడు స్నానం చేసిన తర్వాత ఈ వారాహి కంద దీపాన్ని అంటే.. ఆ కందను ఎవరైనా ఆహారంలో వినియోగించుకోవచ్చు. ఆహారంగా స్వీకరించని వాళ్ళు ఎవరైనా సరే.. దాన్ని గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు. ఆషాడమాస ప్రారంభం వారాహి నవరాత్రి ఉత్సవాల ప్రారంభించిన సందర్భంగా వారాహి దేవి అర్చన చేయండి. అలాగే వారాహి కంద దీపం పెట్టండి. అమ్మవారి అనుగ్రహం వల్ల భూ లాభము గృహలాభం కలుగుతాయి.