Stevia Leaves Uses : షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ స్టీవియా ఆకుల అద్బుత ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే!

Stevia Leaves Uses : ప్రపంచవ్యాప్తంగా షుగర్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మందిలో ఏడుగురు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.

దీనికి ప్రధాన కారణం రక్తంలోని షుగర్ లెవల్స్ లో ఏర్పడే హెచ్చు తగ్గులే. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకోకూడదనే విషయం చిన్న పిల్లాడిని అడిగినా కానీ చెబుతాడు. కానీ షుగర్ ఉన్న వారికి ఎక్కువగా తీపి పదార్థాలను తినాలనే కోరిక పుడుతుంది. మామూలు వారి కంటే ఎక్కువగా వారు తీపి పదార్థాలు ఇష్టపడతారు. కానీ ఇంట్లోని వారేమో వారిని తీపి పదార్థాలు ముట్టుకోనియరు. ఇలా ముందర ఉన్న తీపి పదార్థాల కోసం షుగర్ వ్యాధి గ్రస్తుల బాధలు మామూలుగా ఉండవు.

ఇలా షుగర్ తో బాధపడే వారు చెక్కరకు బదులుగా స్టీవియా అనే ఆకుని ఉపయోగిస్తే అది తీపిగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకును మధుపత్రి ఆకు అని అంటారు. ఈ ఆకులను వాడడం వలన మనలో ఉన్న షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ లో ఉంటుందట. ఈ ఆకులు వాడితే ఇవి చెక్కెర కన్నా దాదాపు 30 రెట్లు తీయగా ఉంటాయి.

ఈ ఆకుల నుంచి తీసిన చెక్కర ఒక స్పూన్ కు మన మామూలు చెక్కెర కప్పుకు సమానం. ఈ ఆకులను నోట్లో వేసుకుని చప్పరించినపుడు తియ్యగా పిప్పర్ మెంట్ లాగా ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లు చెక్కెరకు బదులుగా ఈ ఆకులను వాడితే చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఈ ఆకులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
Read Also : Jackfruit Benefits : జాక్ ఫ్రూట్ (పనస పండు)తో మధుమేహానికి చెక్..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment