Palmistry Money line in Telugu : మీ అరచేతిలో ఎలాంటి గుర్తులు ఉంటే.. జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి? అరచేతిలో ఎలాంటి గుర్తులు ఉంటే తొందరగా జీవితంలో రాజయోగం పడుతుంది? అరచేతిలో ఉన్నటువంటి రేఖల విషయంలో ఉన్న అపోహలేంటో తెలుసుకుందాం. ఎవరికైనా సరే.. అరచేతిలో కొన్ని గుర్తులు ఉంటే.. అదృష్టం తొందరగా పడుతుంది. అందులో ముఖ్యమైన గుర్తు చతురస్రాకార గుర్తు.. అంటే స్క్వేర్ గుర్తు ఎవరికైనా చేతిలో ఎక్కడైనా స్క్వేర్ ఉంటే అది రక్షణకు సంకేతం.. జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయట పడటానికి స్క్వేర్ చతురస్రం గుర్తు బాగా పనిచేస్తుంది.
అలాగే అరచేతిలో ట్రయాంగిల్ గుర్తు క్రియేటివిటీకి సంకేతమని చెబుతారు. అరచేతిలో ట్రయాంగిల్ అనేది లైఫ్‌లైన్ మీద ఉంటే.. ప్రాపర్టీస్ కచ్చితంగా వస్తాయి. ఎవరికైనా సరే అరచేతిలో చూపుడువేలు కింద నుంచి మణికట్టు వరకు ఒక రేఖ వెళుతుంది. దాన్ని లైఫ్ లైన్ అంటారు. మీకు పూర్వీకుల నుంచి ఆస్తులు బాగా వస్తాయి. మీకు కచ్చితంగా ప్రాపర్టీస్ వచ్చే యోగం అనేది ఈ లైఫ్ లైన్ మీద ఉన్న ట్రయాంగిల్ చెప్తుంది. అలాగే, అరచేతులు కుడి చేతి చూపుడువేలు కింద మైండ్ లైన్ అని ఉంటుంది. కొంతమందికి స్ట్రైట్ గా ఉంటుంది.
కొంతమందికి వంపు తిరిగి ఉంటుంది. మైండ్ లైన్ మీద ట్రయాంగిల్ ఉంటే వాళ్ళు కుబేరులు అవుతారు. వాళ్ళకు క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు ఇంటెలిజెంట్ పర్సన్స్ అయి ఉంటారు. ఎవరికైనా మైండ్ లైన్ మీద ట్రయాంగిల్ సింబల్ అనేది వాళ్ళ క్రియేటివిటీకి సంకేతంగా చెప్పవచ్చు. అరచేతిలో కొంతమందికి కన్ను గుర్తులు కూడా వస్తూ ఉంటాయి. వీటిని ఐలాండ్స్ అంటారు. ఐలాండ్ అంటే కన్ను గుర్తుగా చెబుతారు. కన్ను ఎలా ఉంటుందో అలాంటి సింబల్ అరచేతిలో ఉంటే.. అది నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. లైఫ్ లైన్ మీద కన్ను కొడుతుంటే అనారోగ్యం వస్తుంది. మైండ్ లైన్ మీద కన్ను కొడుతుంటే డిప్రెషన్ వస్తుంది. కన్ను గుర్తు ఐలాండ్ అనేది అరచేతిలో ఉంటే మంచిది కాదు. అయితే, ఆ కన్ను గుర్తు అనేది బొటనవేలు దగ్గర ఉండటం చాలా మంచిది.
ఎవరికైనా సరే ఆడవాళ్లకు కానీ మగవాళ్ళకి కానీ బొటనవేలి దగ్గర మొదటి కణుపు దగ్గర ఒక కన్ను ఆకారం ఉంటే దాన్ని ఎవరేఖ అని పిలుస్తారు. వాళ్ళకి జీవితంలో తింటానికి ఉంటానికి ఎలాంటి సమస్యలు రావని ప్రామిస్టిలో చెప్పారు. వ్యక్తి జీవితంలో ఉండటానికి తింటానికి జీవితం చివరి వరకు కష్టాలనేవి ఉండవు అని చెప్పే రేఖ ఎవరేఖ అంటారు. వడ్ల గింజ అనేది బొటనవేలి మొదటి కణుపు దగ్గర ఉంటుంది. వృత్తాకారా ఆకారంలో ఐలాండ్ కనుగొర్తులో ఉంటుంది. అది ఉన్నవాళ్ళకి తింటానికి ఉంటానికి జీవితంలో సమస్యలు అనేవి రావు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే అరచేతిలో ఉంగరం వేలు కింద ఎవరికైనా ఒక వర్టికల్ లైన్ ఉంటే మాత్రం వాళ్లు కచ్చితంగా ప్రపంచాన్ని ఏలుతారు. వాళ్ళ రంగంలో టాప్ పొజిషన్‌కి వెళ్తారు
Palmistry Money Line : మీ చేతి రేఖలు ఇలా ఉంటే చాలా అదృష్టవంతులు..
ఈ రేఖను రవి రేఖ అని కూడా అంటారు.. అంటే.. సన్ లైన్ గా పిలుస్తారు. ఆడవాళ్లు లేదా మగవాళ్ళు ఉంగరం వేలు కింద చూసుకోండి. రింగు ఫింగర్ కింద చూసుకోండి. రింగ్ ఫింగర్ కింద వర్టికల్ లైన్ నిలువ గీత ఉన్నదా? మీరు మీ రంగంలో ఎప్పటికైనా టాప్ పొజిషన్‌కు వెళ్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే ఆ వర్టికల్ లైన్ నిలువు గీత అనేది పూర్తిగా మనికట్టు వరకు వస్తే మాత్రం వాళ్ళు ప్రపంచాన్నే ఏలేవాళ్ళుగా ఉంటారు. అలా కాకుండా కొంత వరకు వస్తే లైఫ్‌లో ఆలస్యంగా అయినా సరే సక్సెస్ అవుతారు.
ఉంగరం వేలి కింద వర్టికల్ లైన్ రవి రేఖ ఉంటే.. అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుంది. ఉంగరం వేలు కింద రింగ్ ఫింగర్ కింద స్క్వేర్ గుర్తుందేమో చూసుకోవాలి. ఏ వ్యక్తికైతే ఉంగరం వేలు కింద అంటే.. రింగ్ ఫింగర్ కింద స్క్వేర్ గుర్తు ఉంటుందో వాళ్ళు ఎప్పటికైనా లక్ష అధికారులు అవుతారు లేదా కోటీశ్వరులు అవుతారు. మగవాళ్ళు అయితే కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి చూసుకోవాలి. మీ రింగ్ ఫింగర్ ఉంగరం వేలు కింది భాగంలో ఆ ఏరియాలో ఎక్కడైనా స్క్వేర్ ఉందేమో చూసుకోవాలి. అలా ఉంటే.. ఎప్పటికైనా మీరు లక్ష అధికారులు కోటీశ్వరులు అయి తీరుతారు.
Read Also : Palmistry Marriage Lines : మీ చేతిలో గీతలు ఇలా ఉన్నాయా? అయితే మీ వివాహం విచ్ఛిన్నమవుతుంది జాగ్రత్త..!