Ketu Dosha : ఆషాడ మాసం శుక్లపక్షం చవితి తిథి నవగ్రహాలలో కేతువుకు ప్రియమైన రోజని ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. నవగ్రహాలలో కేతువుకు చాలా ప్రియమైన రోజు కాబట్టి కేతువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఎవరికైనా జాతకంలో కేతు బలం తక్కువగా ఉన్నట్లయితే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఊహించని విధంగా ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది.
అవన్నీ రాకుండా ఉండాలంటే.. కేతువును ప్రసన్నం చేసుకోవాలి. అలాగే ఎవరి ఇంట్లో అయినా సరే తల్లిదండ్రులకు ఎప్పుడు ఇబ్బందులు ఉన్నట్లయితే తల్లిదండ్రులకు ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటే.. ఆ ఇంట్లో వాళ్లకి కేతు బలం తక్కువగా ఉందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కేతువుని పరిపూర్ణంగా ప్రసన్నం చేసుకోవడానికి కేతువుకు ప్రియమైన స్నానం చేయాలి. కేతువుకు ప్రియమైన దానం ఇచ్చుకోవాలి. కేతువుకు ప్రియమైన విధంగా ప్రత్యేకమైన అర్చన చేయించుకోవాలి.

అలా చేస్తే.. నవగ్రహాల్లో కేతువు యోగిస్తాడు. కేతువుకు ప్రియమైన స్నానం చేయాలంటే.. ముందుగా మీ గృహంలో కంచు పాత్ర ఉన్నట్లయితే.. ఆ కంచు పాత్రలో నీళ్లు పోయండి. ఒకవేళ, కంచు పాత్ర లేకపోతే మామూలుగా బిందెలో నీళ్లు పోయండి. ఆ నీళ్లలో కొన్ని ఎవలు వెయ్యండి. అలాగే, ఆ నీళ్లలో వేప చిగుళ్ళు కొని వేయండి. కొద్దిగా కుంకుమ పువ్వు కలపండి. ఎవలు వేపచిగుళ్ళు, కుంకుమపువ్వు ఇవన్నీ కానీ లేదా వీటిలో ఏది అందుబాటులో ఉంటే అది.. నీళ్లలో కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నేలతో స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు ‘పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమా మేహం‘ అనే కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని 7 సార్లు చదువుకోండి. ఆ నీళ్లతో స్నానం చేయండి. ఇది కేతువుకు ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి రాగి పాత్రలో ఉలవలు పోసి దానం ఇవ్వండి.
ఒకవేళ రాగి పాత్ర మీకు అందుబాటులో లేకపోయినట్లయితే.. ఒకటింపావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలా దానం ఇస్తే.. అది కేతువుకు ప్రియమైన దానమవుతుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన ఉలవలు ఈరోజు ఆహారంగా తినిపించండి. ఈరోజు సాయంత్రం రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఒక ప్రత్యేకమైన విధివిధానం పాటించినట్లయితే.. జాతకంలో ఉన్న కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి. కేతు మహాదశ నడుస్తున్న కేతు అంతర్దశ నడుస్తున్న గోచార పరంగా కేతు వ్యతిరేకంగా ఉన్న లేదా జాతకంలో కేతు బలం లేకపోవటం వల్ల అకస్మాత్తుగా సమస్యలు వస్తుంటాయి. తల్లిదండ్రులకు ఎప్పుడు ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అప్పుడు రావి చెట్టు దగ్గర ఒక శక్తివంతమైన విధి విధానం పాటించండి.
Ketu Dosha : కేతువు దోష పరిహారాలు.. విధివిధానాలివే..
ఆ విధివిధానమేంటంటే.. రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని దర్పలు కలిపి గరికపాచలు కొన్ని కలిపి ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. సాయంకాలం దీపాలు పెట్టే వేళ ఈ విధివిధానం పాటించి రావి చెట్టు దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత గృహానికి వచ్చి గోధుమలతో తయారుచేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇలా చేస్తే కేతువుని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంతే కాకుండా.. కేతువు ప్రభావం కుక్కల మీద విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కుక్కలకి ఏదైనా ఆహారం వేయటం ద్వారా కూడా కేతువును సలభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కేతువుకి అదిష్టాన దైవం గణపతి కాబట్టి.. ఈరోజు గణపతి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం చాలా మంచిది.
గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించాలి. గణపతి ఆలయంలో కూర్చొని సంఘటనాసిక గణేశ స్తోత్రం చదవటం లేదా వినడం ద్వారా కూడా కేతు గ్రహ దోష తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు. కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే, ఎలాంటి పరిహారాలు పాటించలేకపోయినా కేతువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఆషాడ శుక్ల చవితి తిథి కాబట్టి.. ఇంట్లో దీపారాధన చేశాక కేతువుకు సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇంటి యజమాని 21 సార్లు చదవాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఇదే.. ‘ఓం ఐం హ్రీం కేతవే నమః’ ఈ మంత్రాన్ని 21 సార్లు చదివినా కూడా కేతు గ్రహాన్ని చాలా సలభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా ఆషాడ శుక్ల చవితి తిధి సందర్భంగా కేతువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆకస్మిక సమస్యలన్నీ తొలగిపోతాయి. చాలామందికి కేతు మహాదశ నడుస్తున్నప్పుడు వైరాగ్యం వస్తుంది. కుటుంబ సమస్యలు వస్తే కుటుంబంలో బంధాలు అనేటటువంటివి బలహీన పడతాయి. కేతువు బంధాలనుంచి దూరం చేసేటటువంటి గ్రహం కేతువుని వైరాగ్య గ్రహము అంటారు. బంధాలు దూరం అవటానికి వైరాగ్యం పెరగటానికి కేతువు కారణమవుతాడు.
ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే కేతువుకు ప్రియమైనటువంటి ఆషాడ శుక్ల చవితి సందర్భంగా ఈ విధివిధానాలు పాటించండి. ఊహించకుండా హఠాత్తుగా అనుకోకుండా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఇంటి యజమాని ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21సార్లు చదువుకోవాలి. అంతటి శక్తివంతమైన మంత్రం ఏంటంటే.. ‘ఓం ఐం హ్రీం కేతవే నమః’ మంత్ర జపం చేయండి. వేదములో సర్ప సూక్తము ఉంటుంది. ఆ సర్పసూక్తం చాలా శక్తివంతమైనది. ఈరోజు సర్ప సూక్తం చదివిన విన్నా చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి.