Karthika Masam 2022 : కార్తీక మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో వెలిగించే జ్వాలా తోరణానికి ఎంతో విశిష్టత ఉంది. అయితే కార్తీక మాసం మొత్తం పూజలు చేస్తుంటారు. నెల రోజులు పూజలు చేయడం ఒకెత్తయితే, పౌర్ణమి రోజులు పూజలు చేయడం మరొక ఎత్తు. ఆ రోజు వెలగించే జ్వాలా తోరణం ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది.
కార్తీక పౌర్ణమి రోజు శివుని ఆలయాల ఎదుట రెండు కర్రలతు పాతుతారు. మరో కర్రను ఆ కర్రలకు అడ్డముగా ఉంచుతారు. ఇలా అడ్డముగా ఉంచిన కర్రకు కొత్తగా వచ్చిన గడ్డిని చుట్టి ఉంచుతారు. దీనిని యమద్వారమని చెప్పుకుంటారు. తర్వాత ఈ గడ్డిపై నెయ్యి వేస్తూ మండనిస్తారు. దాని కింది నుండి ఈశ్వరుడిని పల్లకిలో ఉంచి ఇటూ, అటూ ఊరేగిస్తారు.

అయితే అమృతం కోసం సమాద్రాన్ని చిలికినప్పుడు ఫస్ట్ విషం వచ్చింది. దానిని తీసుకున్న శివుడు.. తన కంఠంలో దాచేశాడు. అదే సమయంలో శివుడికి కలిగిన ప్రమాదాన్ని నివారించేందుకు ప్రతి ఏటా అగ్ని్జ్వాల కింద తన భర్తతో దూరి వస్తానని మొక్కుకున్నదట. అందుకే ప్రతీ ఏటా కార్తీకపౌర్ణమి రోజున శివుడి ఆలయం వద్ద ఇలా జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తారు.
అయితే కార్తీకపౌర్ణమిన ఇలా మూడు సార్లు జ్వాతాతోరణం గుండా ఎవరైతే వెళతారో వారికి శివుడి అనుగ్రహం లభిస్తుందని పూర్వికుల నమ్మకం. అందుకే దీనిని ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. జ్వాతాతోరణం ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిపోయిన గడ్డని ఇంటి వద్ద, గడ్డివాముల్లో, ధాన్యాగారాల్లో పెడుతుంటారు. దీని వల్ల ఎలాంటి భూతాలు ఇంట్లోకి రావడి, సంతోషాలు దరిచేరుతాయని ప్రజల నమ్మకం. అందుకే చాలా మంది ఇలా చేస్తుంటారు.
Read Also : Breathing Problems : బ్రీతింగ్ ప్రాబ్లమ్ వేధిస్తుందా..? చిన్నపిల్లలు, పెద్దవారిలో శ్వాస రేటు ఎంత ఉండాలంటే..!