Breathing Problems : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాల ఇబ్బంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలుస్తోంది. కొవిడ్ పాజిటివ్ వచ్చి నయం అయిన వారిలోనూ వైరస్ ఇంకా వారి ఊపిరితిత్తులపై కొద్దిగా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. బాగా అలసిపోయినా, చల్లగాలిలో తిరిగినా, అస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు వైద్యులు గుర్తించారు. సాధారణంగా చిన్న పిల్లలు, పెద్దవారు నిమిషానికి ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటారు. ఒకవేళ ఎక్కువ, తక్కువ స్థాయిలో శ్వాస తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
‘శ్వాస రేటు’అనగా నిమిషానికి మీరు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో తెలిపే ఒక కొలమానం. బ్రీతింగ్ రేటు సరిగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు. శ్వాసతీసుకోవడంలో హెచ్చుతగ్గులు ఏర్పడితే వారు ఊపిరితిత్తుల వ్యాధితో పాటు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టే అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నదని స్పష్టం చేస్తున్నారు.
Breathing Problems : శ్వాస కోస సమస్యలు ఎవరిలో ఎక్కువంటే?
ఓ ఆరోగ్య నివేదిక ప్రకారం.. సాధారణంగా యువకులు, వయోజనుల శ్వాసరేటు నిమిషానికి 16 నుంచి 16 వరకు ఉంటుంది. ఈ స్థాయిలో ఉంటే వారు ఆరోగ్య వంతంగా ఉన్నట్టు.. ఒకవేళ 12 కంటే తక్కువ, 16 కంటే ఎక్కువ బ్రీతింగ్ రేటు ఉంటే అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు.

ఇకపోతే అప్పుడే పుట్టిన పిల్లలు నిమిషానికి 30 నుంచి 60 సార్లు శ్వాస తీసుకుంటారట.. 1 నుంచి 3ఏళ్ల లోపు పిల్లలు నిమిషానికి 24 నుంచి 34 సార్లు.. 6 నుంచి 12ఏళ్ల లోపు పిల్లలు 18 నుంచి 30 సార్లు.. అదేవిధంగా 12 నుంచి 18ఏళ్ల వరకు ఏజ్ వాళ్లు 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటారని పేర్కొంది. పైన చెప్పిన దాని ప్రకారం ఏ వయస్సు వారైనా బ్రీతింగ్ కొద్దిగా తేడా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలట..
Read Also : Vacha Sweet Flag : ‘వస’తో డైజేషన్, నొప్పులు, కొలెస్టరాల్‌కు చెక్.. ఇంకెన్నో ఉపయోగాలు తెలుకోండిలా..!