Vitamin B12 Deficiency : B12 లోపంతో కనుక బాధపడితే మీకు అనేక సమస్యలు వస్తాయి. ఎముకలు, కీళ్ల నొప్పులు, రక్తహీనతతో బాధపడతారు. మీరు కనుక B12 లోపంతో బాధపడితే కింది ఆహారాలను కనుక మీరు తీసుకుంటే B12 లోపాన్ని మీరు ఇట్టే తగ్గించుకోవచ్చు. ఆ ఆహారాలను ఒక సారి కనుక గమనిస్తే…
కోడిగుడ్లను మీ రోజూవారి ఆహారంలో కనుక తీసుకుంటే B12 లోపం ఇట్టే తగ్గిపోతుంది. రోజుకో బాయిల్డ్ ఎగ్ ను తీసుకోవడం వలన అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన శరీరంలో పోషకాల శాతాన్ని పెంచుకోవడం కోసం సూప్ లు మరియు స్టైర్ ఫ్రైస్ లో బాయిల్డ్ ఎగ్ లను తీసుకోవడం చాలా మంచిది. ఇక మనకు విటమిన్ B12 లభించే ఆహారం పన్నీర్. ఈ పన్నీర్ ను తీసుకోవడం వలన B12 విటమిన్ మనకు అధికంగా లభిస్తుంది. పన్నీర్ లో మాత్రమే కాకుండా పాల ఉత్పత్తి అయిన మజ్జిగలో కూడా విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. మజ్జిగ అనేది మన జీర్ణక్రియకు మంచి మేలు చేస్తుంది.

మజ్జిగను కావాలంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మజ్జిగలోనే కాకుండా చేపల్లో కూడా విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. చేపల్లో రకాలైన ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్, సార్డినెస్ ఫిష్, ట్రౌట్ చేపల్లో ఈ విటమిన్ మనకు అధికంగా లభిస్తుంది. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం… సాల్మన్ ఫిష్ లో అధిక మొత్తంలో ఈ ప్రొటీన్ ఉంటుంది. ఈ చేపను తినడం వలన మనకు విటమిన్ B12 అధికంగా లభిస్తుంది. చికెన్ తినడం వలన కూడా విటమిన్ B12 లోపం తగ్గుతుంది. అందుకోసమే చికెన్ ను తినడం వలన అధిక ప్రయోజనం ఉంటుంది.
Read Also : Vacha Sweet Flag : ‘వస’తో డైజేషన్, నొప్పులు, కొలెస్టరాల్కు చెక్.. ఇంకెన్నో ఉపయోగాలు తెలుకోండిలా..!