Jataka Chakram : జాతక పరంగా జాతక చక్రంలో కొన్ని ప్రత్యేకమైన దోషాలు ఉన్నప్పుడు జీవితంలో అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది. శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దోషం శపిత దోషం ఈ శపిత దోషము అంటే అర్థమేంటంటే ఎవరికైనా జాతక చక్రంలో శని రాహువు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నట్లయితే దాన్ని సెపిత దోషము అనే పేరుతో పిలుస్తారు ఈ సేపిత దోషమనేది పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల ఏర్పడుతుంది పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్ల ఈ జన్మలో జాతక చక్రంలో శని రాహులు కలిసి ఉంటారు దీన్ని సెపిత దోషము అంటారు ఈ సేపిత దోష ఉన్నప్పుడు ఉద్రేకపూరిత స్వభావాన్ని కలిగి ఉంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని ముందుగా చేయటం తర్వాతే ఆలోచించటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
ఎలాంటి సంబంధాలైనా సరే ఒక్కసారిగా బాంధవ్యాలు దూరం అయిపోతా కూడా ఈ శపిత దోషం కారణమవుతుందని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. అయితే ఈ సేపిత దోషాన్ని సేపిత యోగము అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే శని భగవానుడు రాహువు ఈ రెండు గ్రహాలు కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో ఉన్నప్పుడు యోగాన్ని కలిగింపజేస్తారు ఊహించని విధంగా ఒక్కసారిగా అత్యున్నత స్థాయిలో ఎదుగుతారు అయితే చాలా వరకు మాత్రం శని రాహుల్ కలిసుంటే మంచిది కాదు ఈ సేపిత దోషం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయి సహజంగా ఈ శపిత దోషం అనేటటువంటిది 2012 డిసెంబర్ 24వ తేదీ నుంచి 2014 జూలై 13 వ తేదీ వరకు గోచార పరంగా ఉంది కాబట్టి ఈ సమయంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ శపిత దోషం అనేది ఉంటుంది దాన్ని పోగొట్టుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. వీళ్ళు మాత్రమే కాకుండా జాతకంలో ఎవరైనా సరే శని రాహుల్ ఒక ప్రత్యేకమైన స్థానంలో కలిసి ఉంటే శపిత దోషాన్ని పోగొ ట్టుకోవడానికి పరిహారాలు పాటించాలి.
శపిత దోషాన్ని పోగొట్టే శక్తి నరసింహ స్వామి వారి అర్చనకు ఉందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది కాబట్టి శని రాహుల్ కలిసిన శపిత దోషము ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా నరసింహస్వామి వారి ఆలయ దర్శనం చేయండి నరసింహస్వామి వారి ఆలయంలో అర్చన గాని అభిషేకంగానే చేయించుకోండి నరసింహస్వామి ఆలయంలో కూర్చొని లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి వీలైతే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముత్యం నమామి హమనే సుదర్శన మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కూర్చొని వీలైనన్నిసార్లు చదువుకోండి ఇలా చేస్తూ ఉంటే శపిత దోష వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకోవచ్చు ప్రధానంగా ఈ దోషమున్నప్పుడు జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఒక్కసారిగా జీవితంలో పరిస్థితులు తారుమారైపోతుంటే అవన్నీ పోగొట్టుకోవటానికి మంత్ర శాస్త్ర పరంగా నరసింహస్వామి వారికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని చెప్పడం జరిగింది.
ఆ మంత్రాన్నిగండభేరుండ నారసింహ దిగ్బంధం మంత్రం అనే పేరుతో పిలుస్తారు భయంకరమైనటువంటి శని రాహులు కలిసిన శపిత దోషాన్ని పోగొట్టే శక్తి మంత్రానికి ఉంటుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ అఘోర పక్షిరాజాయ ఇంద్రమండలే గజారుడాయ వజ్రహస్తాయ ఇంద్రాదిసం బంధమాం రక్షరక్ష స్వాహా ఇది మంత్రం గండభేరుండ నారసింహ దిగ్బంధమంత్రము అనే పేరుతో పిలుస్తారు ఈ మంత్రాన్ని ఎవరైతే సేపిత దోషముందో వాళ్ళు రోజు కూడా స్నానం చేశాక పూజ గదిలో కూర్చుని 21సార్లు చదువుకుంటూ ఉండండి నరసింహస్వామి వారి విశేషమైన అనుగ్రహం వల్ల ఈ దోషం పనిచేయదు.
సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు అలాగే వీలైనప్పుడు సంవత్సరానికి ఒకసారి నరసింహస్వామి ఆలయానికి వెళ్లి అర్చన గాని అభిషేకంగాని చేయించుకున్నాక ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తులు వేసి నరసింహస్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించుకు ఆ దీపం వెలిగించుకోవడం ద్వారా కూడా ఈ దోష నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు కాబట్టి జ్యోతిషశాస్త్రంలోనే చాలా పెద్ద దోషం శని రాహులు జాతక చక్రంలో కలిసి ఉన్న చెపిత దోషాన్ని పోగొట్టుకోవటానికి ఏ శక్తివంతమైనటువంటి గండభేరుండ నారసింహ దిగ్బంధమంత్రాన్ని జపించుకోవాలో..