Jagannath Puri Rath Yatra 2023 : పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభైనప్పటి నుంచి ప్రతి రోజుకు ఒక విశేషం ఉంటుంది. ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం ప్రాంగణంలో లక్షలాదిమంది భక్తులు మహా కులాహలంగా ఆ స్వామివారి రథోత్సవంలో పాల్గంటారు. పూరి జగన్నాథ స్వామి వారి రథోత్సవం.. అంటే జగన్నాథ స్వామి వారి నీలాచలం.. ఆ కొండ పేరు స్వామి జగన్నాథుడు. కృష్ణ పరమాత్ముడు శరీరాన్ని విడిచి పెట్టేటటువంటి సమయంలో అనగా దట్టమైన అడవిలోనికి వెళ్లి కాలిపైన కాలు వేసుకుని ఆనందంగా పిల్లలగ్రోవిని మోగిస్తూ.. పరవశంగా అందులో లీనమైపోయాడు.

నాద ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. అదే సమయంలో కాలి మీద కాలు వేసుకుని బొటనవేలు, కాలును కదిలిస్తుండగా.. నీలవర్ణంగా కనిపించేలా స్వామివారి కాలు అటుగా వచ్చిన బోయవాడికి కదిలే నెమలి శిరస్సు మాదిరిగా కనిపించింది. అడవిలో మూలిక వంటి చిన్న చెక్క ముక్కను ఆయుధంగా సిద్ధంగా చేసుకుని ధనస్సుకు ఎక్కు పెట్టాడు. ఆ చెక్క స్వామి వారి కాలి బొటనవేలికి తగిలి శరీరం విడిచిపెట్టేలా చేసింది. దుర్వాస మహర్షి శాపం కారణంగా గోపాలుర వంశం మొత్తం నశించిపోయే విధంగా స్వామివారి గర్భంలో నుంచి రోకలి బండ ఒకటి బయటకు వచ్చింది.
గందంగా అరగదీసి సముద్రపు నీటిలో కలిపివేయాలని కృష్ణ పరమాత్ముడు చెప్పారు. గందంగా తీసిన తర్వాత మిగిలిన చివరి ముక్క అదే.. సముద్రంలో నీటిలో కలిసిన గందంతో జన్మించినటువంటి దర్భను ఆగ్రహంతో ఆవేశంతో, మత్తుతో గోపాలకులంతా కూడా ఒడిసి పట్టుకుని ఒకరిని ఒకరు తాటించుకున్నారు. ఆ క్రమంలోనే గోపాలకులంతా కూడా అంతమయ్యారు. గోకులంతా కూడా అలా నాశనమైంది. త్వరలో కలియుగం రాబోతుందని అర్థం. ఎవరు ఏది చేసినా ఈరోజు కాకపోతే రేపైనా మనం అనుభవించాలి అనే ధర్మం ఉంది. తదుపరి ఆ స్వామి దేహాన్ని పార్థివంగా ఉండే ఆ మిగిలిపోయిన ఆ విశేషాన్ని ఆ బోయవాడు పుట్టపైకి తీసుకు వెళ్ళి పూజించాడు.
Jagannath Puri Rath Yatra 2023 : 12 ఏళ్లకు ఒకసారి ఈ ముగ్గురి మూర్తులను..
ఇంద్ర మహారాజు కారణంగా మనకు జగన్నాథ స్వామి బలభద్రుడు అలాగే సోదరీ సుభద్ర ఆ ముగ్గురు యొక్క తీహస్వరూపంగా ఉండేటటువంటి అర్చనమూర్తులు దారువు రూపంలో మనకు లభించాయి. 12 సంవత్సరాల ఒకసారి ఈ దారు రూపంలో ఉండేటటువంటి బలరాముడు కృష్ణ పరమాత్ముడు సుభద్ర ఈ ముగ్గురి మూర్తులను 12 సంవత్సరాలకు ఒకసారి వేప చెట్టుతో మొదలు మళ్లీ సిద్ధం చేసి ఈ అర్చమూర్తులను మూల ప్రతిష్టిస్తారు. పూర్వం అయినటువంటి వాటిని సముద్రంలో నిమజ్జనం చేస్తారు.
ఇలాంటి ప్రత్యేకత కల దేవాలయం ఒకే ఒకటి అదే జగన్నాథ స్వామి. నగరాలలో నేటి కాలంలో చిన్న చిన్న గ్రామాలలో సైతం జగన్నాథ స్వామి వారి ఊరేగింపులను నిర్వహిస్తున్నారు. అందులో పాలు పంచుకుందాం. స్వామివారికి ఆరు రకాల పదార్థాలను నివేదనగా సమర్పిస్తారు. నైవేద్యంగా సమర్పించడం ఒక ప్రత్యేకత మరొక ప్రత్యేకత గంటకు నైవేద్యాలు సమర్పిస్తారు. చిన్న పిల్లలకు పిల్లనగోవిని బహుమానంగా ఇవ్వడం ద్వారా కృష్ణ పరమార్థుడి అనుగ్రహం లభిస్తుంది.