Horoscope Today July 24 : గ్రహాలు, రాశుల కదలికల ద్వారా ప్రతి ఒక్కరి జాతకాన్ని అంచనా వేస్తారు. జూలై 24 సోమవారం రోజు (సోమవారం) కొందరికి శుభప్రదంగా ఉంటే.. మరికొందరికి సాధారణంగా ఉంటుంది. ప్రస్తుతం.. మేషరాశిలో గురువు, రాహువు సంచరిస్తున్నారు. కర్కాటకంలో సూర్యుడు, బుధుడు ఉన్నారు. సింహరాశిలో శుక్రుడు, కుజుడు ఉండగా, కన్యారాశిలో చంద్రుడు, కుంభరాశిలో కేతువు సంచారం, తులారాశిలో తిరోగమన శని సంచరిస్తున్నాడు. ఈ 5 రాశుల వారికి ఈరోజు ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశి వారు ముందు శత్రువులు ఓడిపోతారు. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. పెద్దల ఆశీర్వాదం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం కూడా బాగుంటుంది. ఈ రాశి వారు ఆకుపచ్చ వస్తువులను దానం చేసే మంచిది.
వృషభ రాశి : విద్యార్థులకు మంచి సమయంగా చెప్పవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో తూ, తు, మీ, నా అనే పేర్లతో మొదలైన వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. పిల్లలను మితంగా ప్రేమించండి. అందరి ఆరోగ్యం బాగుంటుంది. మీ వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. వినాయకుడి అనుగ్రహం కోసం ఆరాధించండి.
మిథున రాశి : కుటుంబంతో చాలా ఆనందంగా ఉంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ, గృహ విషయంలో కొన్ని చెడు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలకు మంచిది. వ్యాపారం కూడా బాగా కలిసివస్తుంది. ఆకుపచ్చ వస్తువులను దగ్గర పెట్టుకోవడం ద్వారా కలిసివస్తుంది.
కర్కాటకం : ఈ రాశివారికి ఎరుపు రంగులు కలిసివస్తాయి. జీవనోపాధిలో పురోగతి కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలతో ప్రేమగా ఉండండి. వ్యాపారం కూడా బాగుంటుంది. ఎరుపు రంగు వస్తువులను దగ్గరగా పెట్టుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.
సింహం : అదృష్టం మీ వెంటనే ఉంటుంది, ఉద్యోగంలో పురోగతి కలుగుతుంది. ఆరోగ్యం మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టడం మానుకోండి. పచ్చని వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం.