Horoscope Today, July 24, 2023 : జూలై 24, 2023కి సంబంధించిన రోజువారీ జాతక ఫలితాలు, 12 రాశులలో ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపే గ్రహా ప్రభావాలు, ఈరోజు మీకు ఏ నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నిం చేద్దాం. గ్రహాల కదలికలతో పాటు నక్షత్రాలు ఎలా ఉన్నాయో విశ్లేషించడంతో పాటు రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ముందుగానే జాతక అంచనాలు వేయాలి అనే పూర్తి రాశిఫలితాలను ఓసారి వివరంగా పరిశీలిద్దాం.
మేష రాశి : ఈ రోజు అన్ని మీ అదుపులో ఉంటాయి. గత సమస్యల నుంచి బయట పడతారు. చాలా ఓపికతో పని చేయాల్సి ఉంటుంది. మీ పనిలో కొత్త విషయాలను నేర్చుకుంటారు. ప్రేమికులు విహారయాత్రకు వెళ్లేందుకు అనువైన సమయం. విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల మంచి దృష్టిని పెట్టవచ్చు.
వృషభ రాశి : ఈరోజు మీకు సంతోషకరమైన రోజుగా అనిపించవచ్చు. కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావొచ్చు. మీ గృహపరమైన పనులకు ఆటంకాలు తొలగిపోతాయి. మీ పనిలో అహంకారాన్ని చూపించరాదు. లేకపోతే మీరు మీ చుట్టూ శత్రువులు పెరిగే అవకాశం ఉంది. వేగంగా డ్రైవింగ్, అడ్వెంచర్ టూర్‌లను తప్పనిసరిగా వాయిదా వేసుకోవడం మంచిది.
మిథున రాశి : ఈరోజు మీరు సంతోషంగా ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మీ గృహ జీవితంలో సామరస్యాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో కొన్ని శృంగార క్షణాలను ఆస్వాదించవచ్చు. వృత్తిపరమైన విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ కుటుంబం నుంచి మీకు పూర్తి మద్దతు ఉంటుంది. మీ వ్యాపారం లేదా పనిలో కొన్ని కొత్త వెంచర్లు లేదా భాగస్వామ్యాలను పొందవచ్చు.
కర్కాటక రాశి : ఈరోజు చంద్రుడు సానుకూలంగా ఉంటాడు. మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. మీ సహనమే మీకు రక్షణగా ఉంటుంది. మీ ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. రివార్డుల పరంగా కొన్ని ప్రోత్సాహకాలు పొందవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. ఉద్యోగార్ధులకు వారి డొమైన్‌లో తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమికులు తమ డేటింగ్‌ను ఆనందించవచ్చు.
సింహ రాశి : ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ చుట్టూ ఉన్నవారి నుంచి ఎక్కువ ఆశించవద్దు. అది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. మీకు మీరే సొంతంగా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి సరైన సమయం. లేదంటే.. మీలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవచ్చు. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిన సమయం.

కన్య రాశి : ఈరోజు అసంతృప్తి మిమ్మల్ని కలవరపెడుతుంది. మీ ఏ క్షణాన్ని కూడా ఆస్వాదించలేకపోవచ్చు. మీకు ఓపిక తగ్గిపోతుంది. మీ పని విధానంపై ప్రభావితం చేయొచ్చు. మీరు చేసే పనిలో పొరపాట్లు జరగవచ్చు. మీరు ధ్యానం లేదా యోగా సాధన చేయాలి. మనసు శాంతి కోసం కొన్ని మతపరమైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.
తుల రాశి : మీరు చాలా ఆహ్లాదకరంగా గడుపుతారు. మీ పనిలో వేగం పెరుగుతుంది. కష్టమైన పనిని సులభమైన మార్గంలో చేయవచ్చు. తోబుట్టువుల మధ్య వివాదాలు ఇప్పుడు పరిష్కరిమవుతాయి. మీ కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది. మీ లక్ష్యాల వైపు మీ దృష్టిని పెట్టే సమయం. తద్వారా మీ పనిలో విజయాన్ని అందిస్తుంది.
వృశ్చిక రాశి : ఈరోజు మీరు చంద్రుని అనుగ్రహం పొందుతారు. కొన్ని వారసత్వ ఆస్తులను పొందవచ్చు. మీ పనిలో సహనంతో ఉండాల్సిన సమయం. అది మీలో సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా మెలగాలి. మీ రోజువారీ పనులలో తక్కువ ప్రయత్నాలు చేయవచ్చు. పనిలో పురోగతి పరంగా కొత్త పనిని చేయడం ద్వారా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారు.
ధనుస్సు రాశి : ఈ రోజు మీపై చంద్రుని అనుగ్రహం ఉంటుంది. తద్వారా ఈ రోజుంతా సహనంతో మెలుగుతారు. మీరు పనిలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. అంతర్గతగా మీ మనస్సు ప్రశాంతంగా ఉండవచ్చు. మీ పని, గృహ జీవితంలో మీ ప్రతి క్షణం ఆనందించవచ్చు. కొన్ని కొత్త ఆదాయ మార్గాలు సంతోషాన్ని అందిస్తాయి. ఆర్థికంగానూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడొచ్చు.
మకర రాశి : ఈరోజు మీకు నిస్తేజంగా అనిపించవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. అది నిద్రలేమికి గురయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని అసహనానికి గురి చేస్తుంది. మీ ప్రవర్తన కుటుంబ వాతావరణంపై ప్రభావితం చేయవచ్చు. మీకు రావాల్సిన లాభాలు నష్టాలుగా మారవచ్చు. ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.
కుంభ రాశి : ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు. మీ నష్టాలన్ని లాభంగా మారవచ్చు. మీ వ్యాపార వృద్ధి పెరుగుతుంది. మీ కింది అధికారుల సాయంతో వ్యాపారంలో కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు సమర్థవంతంగా పని చేయవచ్చు. మీ యజమాని నుంచి మీకు సపోర్టు అందుతుంది. మీ సేవింగ్స్‌లో ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు.
మీన రాశి : ఈ రోజు మొత్తం పనిలో బిజీగా ఉండవచ్చు. పనిలో కొన్ని కొత్త ఆలోచనలను ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త నియమాలను పాటించవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ప్రేమగా ఉంటారు. తద్వారా మీలో మానసిక ప్రశాంతతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు.
Read Also : Horoscope Today Telugu : ఈ రాశి వారికి సాయం చేసే గుణం ఎక్కువంట.. ఈ లిస్టులో మీరున్నారో లేదో చూసుకోండి!