Guru Purnima 2023 : ఆషాడ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గురు పౌర్ణమి విశిష్టతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో కాశీ క్షేత్రంలో వేద నిధి వేదవతి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. ఈ బ్రాహ్మణ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం ఎన్ని పూజలు చేసిన సంతానం కలగక బాధపడుతూ ఉండేవాళ్లు. అయితే, ప్రతిరోజు కాశీ క్షేత్రానికి వ్యాసభగవానుడు మారువేషణలో వచ్చి అక్కడ కాశీలో స్నానం చేస్తున్నాడు.
ఆ విషయాన్ని ఈ దంపతులు తెలుసుకుంటారు. మారువేషణలో ఉన్న వ్యాసభగవానున్ని ఈ వేదనిధి వేదవతి దంపతులు గుర్తుపట్టి ఆయనకు నమస్కారం చేసుకొని స్నానం పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆతిథ్యానికి ఆహ్వానిస్తారు. వ్యాసభగవానుడు వాళ్ల గృహానికి వెళ్తాడు. వ్యాసభగవానుడికి అవసరమైనటువంటి పూజా సామాగ్రి మొత్తం ఆ దంపతులు సిద్ధం చేస్తారు. తులసి దళాలు సాల గ్రామము రకరకాల పుష్పాలు వీటన్నిటిని కూడా సిద్ధం చేస్తారు.
వ్యాసభగవానుడికి వాళ్లు భోజనం పెడతారు. వ్యాసభగవానుడు ఎంతో ఆనందంతో మీకేం వరం కావాలో కోరుకోమని అడిగినప్పుడు వేదనిధి వేదవతి దంపతులు మాకు సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తారు. వ్యాసభగవానుడు తథాస్తు అని అనుగ్రహిస్తాడు. ఆ దంపతులు ఎంతో ఆనందంతో స్వామి మళ్లీ మిమ్మల్ని ఎప్పుడు దర్శించగలం అని అడిగినప్పుడు వ్యాసభగవానుడా దంపతులతో ఆషాడ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమితిథి నా జన్మదినం. నా పుట్టినరోజు ఆ రోజు.. నేను మీకు మళ్ళీ దర్శనమిస్తాను. ఒకవేళ నేను మీకు దర్శనం ఇవ్వకపోయినప్పటికీ ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు ఎవరైతే వేద వేదాంగాలు చదివి ఆ వేద వేదాంగాల విద్యను అందరికీ చెబుతూ ఉంటారు. ఆ గురుస్వరూపాలలో నన్ను దర్శించుకోండని ఆ దంపతులకు చెప్పి వ్యాసభగవానుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Guru Purnima 2023 : గురు పౌర్ణమిన గురువుని పూజించే పూజా విధానం గురించి తెలుసా..
ఈ కథను మనకు బ్రహ్మాండ పురాణంలో స్కాంద పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆషాడమాసం శుక్లపక్షం పౌర్ణమితి వ్యాసభగవానుడి జన్మదినం.. వ్యాసుడు గురువు అందుకే దీని గురుపౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే, వేద వేదాంగాలు చదివిన వాళ్లు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు వాళ్లందర్నీ గురుస్వరూపంగా భావించాలని వ్యాసభగవానుడు చెప్పాడు. దేవతల అంశాశ్వరూపమైన అటువంటి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి శిరిడి సాయినాధుడు రాఘవేంద్ర స్వామి వీళ్ళందర్నీ కూడా గురు పౌర్ణమి రోజు అర్చన చేయాలి. ఈ దేవాలయ దర్శనం చేయాలి.
ప్రధానంగా మాత్రం గురు పౌర్ణమి అంటే వ్యాసభగవానుడి జన్మ దినమని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే, గురు పౌర్ణమి సందర్భంగా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమోవై బ్రహ్మణిదయే వాశిష్ఠాయ నమో నమః ఈ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21సార్లు చదువుకోవాలి. ప్రధానంగా గురు పౌర్ణమి అంటే.. వ్యాస పౌర్ణమి కాబట్టి వ్యాసుడికి సంబంధించిన విద్యాన శ్లోకం చదువుకోవాలి. అలాగే, గురు స్వరూపమైన అటువంటి దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలి. దత్తాత్రేయుడి విగ్రహానికి సెనగల దారంతో దండలాగా కట్టి అలంకరించడం చేసుకోవాలి.
గురుపౌర్ణిమ రోజు షిరిడి సాయి ఇలా పూజ చేస్తే :
షిరిడి సాయినాధుడి మందిరానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. షిరిడి సాయినాధుడి మందిరంలో ఆముదపు దీపాలు వెలిగించి జాతక దోషాలు తగ్గింప చేసుకోవాలి. అలాగే, దక్షిణామూర్తి చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించి నమస్కారం చేసుకొని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి. రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్లి ఆ మంత్రాక్షతలు స్వీకరించి దగ్గర ఉంచుకొని కార్య నిమిత్తమై వెళ్ళాలి. ఈ విధివిధానాలు పాటిస్తే.. ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే, గురు పౌర్ణమికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే.. ఈ గురు పౌర్ణమి రోజు పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో సర్పాలతో బంధించి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు.
పరమేశ్వరుడు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజున శివశయను ఉత్సవం అనే పేరుతో పిలుస్తారు. గురు పౌర్ణమి శివుడికి కూడా చాలా ఇష్టమైన రోజు శివశయనోత్సవం ఎలాగైతే తొలి ఏకాదశి రోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. అలాగే, గురు పౌర్ణమి రోజు శివుడు కూడా యోగనిధులకు వెళతాడు. అయితే శివుడు భక్తుల పాపాలు జటాజూటంలో సర్పాలతో బంధించి యోగ మిత్రులకు వెళ్లి భక్తుల పాపాలు పోగొడతాడు. శివుడు యోగ నిద్రలోకి వెళ్లే రోజు శివశయనోత్సవం సందర్భంగా మీరు గృహంలో ధర్భలు కొన్ని తీసుకొని ఆ ధర్తలతో ఒక పడకలాగా ఏర్పాటు చేయాలి. దాని కింద శివలింగం ఉంచాలి. శివుడిని పూజించాలి. అప్పుడు శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. శివుడు నిద్రించడానికి అనువుగా ఉండే విధంగా దర్భలతో పడకలాగా ఏర్పాటు చేయాలి. దాని కింద శివుడిని పూజిస్తే శివుడి అనుగ్రహం వల్ల మీ సర్వపాపాలు పటాపంచలైపోతాయి.
కోకిలా వ్రతము.. :
గురుపౌర్ణమి రోజు కోకిల వ్రతమని ఇంకో వ్రతాన్ని హేమాద్రి సంహిత అని పిలుస్తారు. దృక్పదుడి భార్య కోకిల తెలగపిండి తీసుకొని అమ్మవారి లాగా తయారుచేసి అమ్మవారిని పూజించింది దీని కోకిలా వ్రతం అంటారు. ఈ కోకిల వ్రతం చేయటం వల్ల దృక్పథుడి భార్య త్వరలోనే సంతానాన్ని పొందింది. ఎవరైనా సరే స్త్రీలకు వివాహం ఆలస్యమవుతున్న సంతానం తొందరగా కలగాలని గురు పౌర్ణమి రోజు అమ్మవారి ఆలయ దర్శనం కూడా అద్భుత ఫలితాలను కలిగిస్తుంది. ప్రధానంగా గురుపౌర్ణమి అంటే.. వ్యాసభగవానుడు జన్మదినం రోజున ఇంట్లో దీపారాధన చేశాక వ్యాసుడికి సంబంధించిన ఈ శ్లోకాన్ని చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.