Adhika Amavasya 2023 : అధికమాసంలో వచ్చే అమావాస్య రోజు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే.. అనేక సంవత్సరాల పాటు జాతక దోషాలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా అమావాస్య తిధి చాలా శక్తివంతమైనది. ఆరోజు దేవతలు పితృదేవతలు కలిసి ఉంటారు. దేవతలు, పితృదేవతలు కలిసి ఉండే రోజు కావడంతో అమావాస్యకి అంత శక్తి ఉంది. సూర్యుడు తన శక్తిని చంద్రుడికి అందింపజేసే శక్తివంతమైన రోజు. జాతక దోషాలు, శత్రు బాధలు, నరదిష్టి పోగొట్టే శక్తి అమావాస్యకు ఉంటుంది. అందులోనూ అధికమాసంలో వచ్చే అమావాస్య అంటే.. కొన్ని వేల రెట్లు శక్తివంతమైనదని ప్రామాణి క గ్రంథాల్లో చెప్పారు. అధికమాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా కొన్ని విధివిధానాలు పాటిస్తే.. అనేక సంవత్సరాల పాటు మీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది. అధికమాసంలో వచ్చే అమావాస్య రోజు ముఖ్యంగా మీరేం చేయాలంటే ఏదైనా దేవాలయంలో అన్నదాన నిమిత్తమై కొంత ధనాన్ని కట్టండి. అలా కడితే మీకున్నజన్మల దోషాలన్నీ నశించిపోతాయి.
మీకు అదృష్టం పట్టడం ప్రారంభమవుతుంది. అయితే, దేవాలయంలో అన్నదానానికి ధనం కట్టడం, వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే మీ చేత్తో ఆరోజు వీలైనంతమందికి నిమ్మకాయ పులిహోర పంచి పెట్టడం చేయాలి. అధిక అమావాస్య రోజు మీ చేత్తో నిమ్మకాయ పులిహోర వీలైనంతమందికి, కనీసం ముగ్గురికి కానీ నలుగురు కానీ పంచిపెట్టినట్లయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. విశేషంగా అదృష్టం కలిసేస్తుంది. అలాగే, రావి చెట్టు దగ్గర ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోటు గాని లేదా కేవలం రావి చెట్టు ఉన్న దగ్గర గాని వెళ్లి అక్కడ ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆవాల నూనె పోయాలి. అందులో 12 వత్తులు వేయాలి. రెండు వత్తులు కలిపి ఒక వత్తి చొప్పున మొత్తం 12 వత్తులు విడివిడిగా వేయాలి.
ఆ 12 వత్తులు వెలిగించాలి అంటే.. ఒకే మట్టి ప్రమిదలు 12 జ్యోతులు, 12 దీపాలు వెలగాలి. దీన్ని ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు. అధికమాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపం ఎవరైతే పెడతారో వాళ్ల వంశంలో ఏడు తరాలపాటు పితృ దోషాలు ఉండవు. పితృ శాపాలు ఉండవు. పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎవరికైనా జాతకంలో భయంకరమైన పితృ దోషాలు, పితృ శాపాలు ఉంటే వారి జీవితాల్లో అన్ని కష్టాలు ఉంటాయి. అవన్నీ ఏడు తరాల వరకు పోగొట్టుకోవాలంటే అధికమాసంలో వచ్చి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి.
Adhika Amavasya 2023 : అధిక అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేయాలంటే?
ఉదయం గాని సాయంత్రం గాని ఏ సమయంలో అయినా సరే దీపాన్ని వెలిగించండి. అలాగే అధికమాసంలో వచ్చి అమావాస్య సందర్భంగా ఆవుకు పచ్చగడ్డి తినిపించినట్లయితే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఆవుకు తవుడు గాని పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపించండి. కార్యసిద్ధి తొందరగా ఏర్పడుతుంది. అలాగే అధికమాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా వస్త్ర దానం చేస్తే.. ఆకస్మిక ధన ప్రాప్తియోగం కలుగుతుంది. మీ చేత్తో పేద వాళ్ళు ఎవరికైనా సరే లేదా పని వాళ్ళు ఎవరికైనా సరే వస్త్రాలు ఇచ్చినట్లయితే మీరు ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది.
ఆకస్మిక ధనప్రాప్తియోగం కలిగించే శక్తి వస్త్రధానానికి అధికమాస అమావాస్య రోజు ఉంది. అలాగే, అధికమాసంలో వచ్చే అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం పాటిస్తే.. ఘల్లు ఘల్లుమని ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఆ నవధాన్యాల పరిహారం ఏంటంటే.. మీరు లక్ష్మీదేవి ఫొటో దగ్గర ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని దీపం పెట్టి లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని నవధాన్యాలు ఉంచండి. లక్ష్మీదేవి పూజ అయిపోయాక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ గ్లాసులో ఉన్న నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి. అవి మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఆవుకి తినిపించండి. అధికమాసంలో వచ్చే అమావాస్య రోజు ఇలా లక్ష్మీ పూజలో నవధాన్యాలు ఉంచి తర్వాత వాటిని ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లితే మొలకలు రావడం ద్వారా మీకున్న దురదృష్టం తగ్గిపోతుంది. అదృష్టం మీ వెంట నడుస్తూ ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
అధికమాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజుగా చెబుతారు. వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఆరోజు దర్శించవలసిన దేవాలయం.. దుర్గాదేవి ఆలయం లేదా పరమేశ్వరుడి ఆలయం. అధిక అమావాస్య రోజు మీరు జపించుకోవాల్సిన మంత్రాలు ‘ధూమ్ దుర్గాయై నమః శ్రీం శివాయ నమః’ ఎలాంటి పరిహారాలు చేయలేకపోయినా ‘దుమ్దుర్గాయై నమః శ్రీం శివాయ నమః’ ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చొప్పున చదువుకోండి. శివుడు దుర్గాదేవి మిమ్మల్ని అద్భుతంగా అనుగ్రహిస్తారు. కొన్ని సంవత్సరాల వరకు మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మామూలు అమావాస్యల కన్నా కొన్ని వేల రెట్లు శక్తివంతమైనటువంటి అధికమాసంలో వచ్చే అమావాస్యని సద్వినియోగం చేసుకోండి.
Read Also : Parama Ekadashi 2023 : పరమ ఏకాదశి నాడు దీపారాధన చేసిన తర్వాత ఈ మంత్రం పఠిస్తే పూర్వజన్మ పాపాలు తొలగుతాయి..!