Joint Family Problems : నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు మచ్చుకైనా కనిపించడం లేదు. పల్లెటూర్లు మినహా ప్రధాన నగరాలు, పట్టణాల్లో కుటుంబంలోని అందరూ ఒకే దగ్గర కలిసి ఉండటం అనేది పెద్ద వండర్ అయిపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ మనుషుల్లో వచ్చిన మార్పులు, సొసైటీలో అలవర్చుకున్న పాశ్చాత్య కల్చర్, ఒంటరి జీవనాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేశాయని చెప్పవచ్చును.
జెనరేషన్ గ్యాప్ : సాధారణంగా తమ పిల్లలకు పెళ్లిళ్లు చేశాక అమ్మానాన్నలతో కలిసి కొడుకు కోడలు ఒకే దగ్గర ఉన్నప్పుడు చిన్నచిన్న కమ్యూనికేష్ గ్యాప్స్ వస్తుంటాయి. దీంతో ఇంట్లో గొడవలు జరగడం కామన్. అందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు పనివిషయంలో లేదా ఇతర విషయాల్లో అత్తలు కోడళ్లపై యాజమాయిషీ చెలాయిస్తారు. కానీ నేటితరం కోడళ్లు అత్తలు మాటంటే కొంచెం కూడా పడటం లేదు. దీంతో గొడవలు పెరిగిపోతుంటాయి. చివరకు అవి వేరే కాపురానికి కూడా దారితీయొచ్చు..

ఎవరు ముఖ్యం : పెళ్లయిన కొత్తలో తన కొడుకులో మార్పులు రావడాన్ని తల్లి అస్సలు సహించదు. ఇన్నిరోజులు తానే సర్వంగా బతికిన తన కొడుకు పెళ్లాం రాగానే తన మాటలు పట్టుకుని దూరంగా వెళ్లడం, చెప్పిన మాట వినకపోవడం, ఎదురుచెప్పడం వంటివి చూస్తే తట్టుకోలేదు. అదేవిధంగా భర్తే సర్వస్వం అనుకుని వచ్చిన భార్యను కూడా తల్లి మాట విని కొడుకు బాధ పెడితే ఆ వివాహిత ఏం చేస్తుంది. అప్పుడు తల్లా.. పెళ్లామా.. అన్ని ప్రియారిటీ గొడవలు తలెత్తే అవకాశం లేకపోలేదు. అలాంటి సమయంలో అటు తల్లికి కొడుకుగా.. ఇటు భార్యకు భర్తగా..సంయమనంతో ఉండి ఇద్దరినీ సముదాయిస్తే ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. అదేవిధంగా అత్తాకోడలు ఒకేసారి కిచెన్లో పనులు చేయకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే..
అత్తాకోడళ్లు మాటలు అనుకున్న సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్దలు రాకుండా సర్దిచెప్పాలి. ఎవరిది తప్పు ఉందో సున్నితంగా వారిచేత ఒప్పించాలి. ఉద్యోగానికి వెళ్లొచ్చాక కుటుంబంలో గొడవలు జరిగితే అనవసరంగా ఎవరిపైనా కోపం ప్రదర్శించరాదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అప్పుడే అందరూ హ్యాపీగా ఉండవచ్చు. అంతేకాకుండా అటు తల్లికోసం, ఇటు భార్యకోసం ఎప్పుడైతే విడివిడిగా టైం కేటాయిస్తారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఉమ్మడిగా కలిసి ఉండగలుగుతారు. లేనియెడల ముడు ముక్కలై జీవితాంతం బాధపడుతూనే ఉండాలి.
Read Also : Couple Relationship : ఆలుమగలు అన్నాక ఆ పని తప్పనిసరిగా చేయాలా..?