Couple Relationship : ఆలు మగలు సంతోషంగా జీవనం సాగించడానికి రొమాన్స్ అవసరం ఎంతైనా ఉంటుందట.. శృంగారం అనగా దాంపత్యం మాత్రమే కాదు.. తన భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజెప్పే ఒక సున్నితమైన సాధనం.. ఇది జంటల జీవితాలను ప్రతీక్షణం ఆనందంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇద్దరి మధ్య ఎన్నోకొత్త అనుభూతులు, జ్ఞాపకాలను మిగిలిస్తుంది.
శారీరకంగా మానసికంగా తమవారిని సంతోష పెడుతుంది. తరచుగా కౌగిలించుకోవడం, కళ్లలోకి చూడటం, ముద్దు పెట్టడం ఇవన్ని ఒకరైన ఫీలింగ్స్. మనం ఎదుటివారిని ఎంతలా ప్రేమిస్తున్నామనేది నోటితో చెప్పకపోయినా రొమాన్స్ ద్వారా చెప్పవచ్చు. అప్పుడు వారు కూడా మనల్ని అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారి మధ్య ప్రేమతో పాటు సాన్నిహిత్యం కూడా తప్పనిసరి. ఒకరినొకరు ఇష్టపడటమే కాదు. ఒకరి విలువను మరొకరు అర్థం చేసుకోవాలి. తమ భాగస్వామిని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. అసలు దంపతుల మధ్య దాంపత్యం లేని జీవితం ఊహించలేమంటున్నారు నిపుణులు. ఇద్దరి మధ్య అస్సలు రొమాన్స్ లేకపోతే వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పెళ్లి తర్వాత ఆలుమగలు కార్యంలో పాల్గొనడం కామన్. పెళ్లికి ముందు ప్రతీమగాడిలో దాంపత్యం చేయాలనే కోరిక బలంగా ఉంటుంది. కానీ, వివాహం అయ్యాక పలుమార్లు కార్యంలో పాల్గొన్నాక ఆ కోరిక తగ్గిపోతుందట.. కొన్నిసార్లు భర్తకు దాంపత్య కోరికలు వచ్చినా భార్య పట్టించుకోకపోవడం, భార్యకు కావాలన్నప్పుడు అతను దూరంగా పెట్టడం వలన చాలా అనార్థాలు జరుగుతాయని తెలుస్తోంది. అటువంటి టైంలోనే భార్య లేదా భర్త వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపుతారని నిపుణులు చెబుతున్నారు.
తమకు కావలసింది భాగస్వామి ఇవ్వని యెడల ఆ కోరికలను ఇతరుల నుంచి పొందాలని కొందరు ఆశిస్తారని తెలిసింది. అదే జరిగితే వారి దాంపత్య జీవితం బుగ్గిపాలు అవ్వడం ఖాయం. గొడవలు జరిగి కుటుంబాలు విడిపోయే వరకు వెళ్తుంది. పిల్లలు ఒంటరి వారవుతారు. అందుకు భార్యభర్తలు ఇద్దరు ఒకరొకొకరు అర్థం చేసుకుని ఎవరికీ కావాల్సింది వారు ఇచ్చుకుంటే ఆ కాపురం ఆనందంగా ఉంటుంది
Read Also : Couple Relationship : మీ భాగస్వామిలో ఇలా సంకేతాలు కనిపించాయా..? ఇక వారు మిమ్మల్ని వదలకుండా చేస్తారట!