Gongura Pulihora Recipe : గోంగూర పులిహోర.. ఈ పేరు వింటేనే చాలు.. నోట్లో లాలాజలం ఊరిపోతుంది. అందులోనూ ఆంధ్ర స్టయిల్లో పులిహోర గోంగూరను ఒకసారి తింటే ఆహా.. అమృతంలా ఉంటుంది. ఒక్కసారి గానీ రుచి చూశారంటే వదిలిపెట్టరు. అందుకే, అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పులిహోరను ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి తింటే.. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అయితే, ఎంతో రుచికరమైన గో్ంగూర పులిహోరను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ గోంగూర పులిహోర ఇలా చేస్తే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. ఒకసారి మీరూ ట్రై చేసి చూడండి..
కావలసిన పదార్థాలు.. :
గోంగూర 100 గ్రాములు, బియ్యం 11/2 కప్పుల, నూనె, పసుపు 2టీ స్పూన్, ఉప్పు , పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 15, కరివేపాకు 2రెమ్మలు, పల్లీలు 2టీ స్పూన్, జిలకర 1టీ స్పూన్, ఆవాలు 1టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2టీ స్పూన్, సాయ మినప్పప్పు 1టీ స్పూన్, మెంతులు 1టీ స్పూన్, ఇంగువ, చింతపండుగుజ్జు 1/3 కప్పు.
తయారీ విధానం.. :
ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన పెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్ లో వేసి పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఆయిల్, 2 1/4 కప్పుల వాటర్ పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. రెండు విజిల్స్ హై ఫ్లేమ్ లో, ఒక విజిల్ లో ఫ్లేమ్ లో అలా చేయడం వల్ల అన్నం పొడి పొడి గా వస్తుంది. పులిహోరకు చాలా బాగా ఉంటుంది. మరోవైపు మూకుల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు చిటపటమనేవరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో అందులో 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి వేయాలి.

మిరపకాయలు ఎర్రగా వేగిన తర్వాత రెండు చిటికెల్లా ఇంగువ వేసిన తర్వాత చల్లారాక మిక్సీ జార్ లో పొడి చేసుకోవాలి. మూకుల్లో ముప్పావు కప్పు నూనె పోసి ముదురు ఎర్ర గోంగూర వెయ్యాలి. అందులో ఒక టీ స్పూన్ ఉప్పు, ఈ స్పూన్ పసుపు వేసి తరవాత గోంగూర వేగపోతే జిగురు వస్తుంది. కాబట్టి గోంగూరలో నూనె పైకి తేలేంత వరకు ఎర్రగా వేయించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు వేసుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి వేసి బాగా కలపాలి. అన్నం చల్లారిన తర్వాత గోంగూర పేస్టు అన్నానికి పట్టించాలి.
ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నూనె, రెండు స్పూన్లు పల్లీలు దోరగా అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, రెండు ఎండుమిర్చి ఎర్రగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు, రెండు పచ్చిమిర్చి చీలికలు, వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును పులిహోరలో కలుపుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఉందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోండి.. అంతే ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర రెడీ…
Read Also : Kakarakaya Ulli Karam : కాకరకాయ ఉల్లికారం చేయడం చాలా ఈజీ.. వేడివేడి అన్నంలో కలిపి తింటే ఆ టేస్టే వేరబ్బా..!