MeArogyam Health News Telugu - MeArogyam.com
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు
MeArogyam Health News Telugu - MeArogyam.com
Home Health Tips

Home Remedies Gastric Problems : గ్యాస్ ట్రబుల్‌కు ఇక గుడ్‌బై.. ఎసిడిటీని తగ్గించే అద్భుతమైన బెస్ట్ రెమెడీస్..

mearogyam by mearogyam
January 24, 2023

Home Remedies Gastric Problems : గ్యాస్ ట్రబుల్.. ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారా? ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో మంటగా అనిపిస్తోందా? పుల్లటి తేనుపులు వస్తున్నాయా? గుండె పట్టేసినట్టుగా అనిపిస్తోందా? వికారంగా ఉంటుందా? అయితే ఇవన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలే. గ్యాస్ ట్రబుల్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్యాస్ సమస్య అనేది తేలికగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. గ్యాస్ ట్రబుల్ ముందుగా సమస్య చిన్నదిగా అనిపించినా రానురాను దాని తీవ్రత మరింత పెరిగిపోతుంది. అందుకే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చునని సూచిస్తున్నారు.

గ్యాస్ సమస్యతో గుండెలో మంటగా అనిపిస్తుంది. కడుపులోని ఆమ్లాలు పైకి ఎగిసిపడుతుంటాయి. దీన్నే అసిడిటి అని అంటారు. ఈ సమస్య చాలామందిని వేధిస్తోంది. యువకుల నుంచి వృద్ధుల వరకు ఈ అసిడిటీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అసిడిటీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమందిలో పుల్లటి తేన్పులు పదేపదే వస్తుంటాయి. ఆమ్లాలు గొంతులోకి ఎగసిపడుతుంటాయి. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు వెంటనే తమ ఆహార పద్ధుతుల్లో మార్పులు చేసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు ఒకే సమయంలో ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

వాస్తవానికి అసిడిటీ పూర్తి వైద్యం అందుబాటులో లేదనే చెప్పాలి. వీటి ద్వారా కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం పొందవచ్చు. అసలు మందు ఒక్కటే.. జీవన శైలిని మార్చుకోవాలి.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం.. ఈ పద్ధుతులు పాటించినప్పుడే అసిడిటీ సమస్య క్రమంగా తగ్గిపోతుంది. ఎప్పటిలానే మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు. అది కూడా పరిమితంగానే.. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫుడ్ జోలికి పోకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట భోజనం విషయంలోనూ జాగ్త్రత్తలు తీసుకోవాలి.

Gastric-Problems-Home-Remed
Gastric-Problems-Home-Remed

నిద్రకు మూడు గంటల ముందే ఆహారం తీసుకోవాలి. చాలామంది పడుకునే సమయంలో భోజనం చేస్తుంటారు. ఇలా ఎప్పటికీ చేయకూడదు. ఈ అలవాటును తొందరగా మార్చుకోవాలి. లేదంటే.. మీరు తిన్న భోజనం అరగదు. అజీర్ణ సమస్య ఎదురవుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించకూడదు. కొంతసేపు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీరు తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.

రాత్రిసమయాల్లో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పగటిపూట తీసుకునే ఆహారం కంటే చాలా తక్కువగా తీసుకోవాలి. అప్పుడే మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మాంసాహారాన్ని రాత్రిపూట తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే.. మాంసాహారం అరగడానికి చాలా సమయం పడుతుంది. తద్వారా అజీర్ణ సమస్య వస్తుంది.

ఈ పొరపాటు అసలే చేయొద్దు :
చాలామంది చేసే మరో పొరపాటు ఏంటంటే.. ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగరు.. ఇలా చేయడం ద్వారా మీ జీర్ణవ్యవస్థలోని ఆమ్లాలకు పనిభారం పెరుగుతుంది. వాటిని అరిగించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి. అదే మీరు తినే సమయంలోనే బాగా నమిలి తింటే సగానికి పైగా మీ నోటి లాలాజలంలోనే కరిగిపోతుంది. అప్పుడు మిగతా ఆహారం పొట్టలోపలికి వెళ్లగానే ఆమ్లాలు తొందరగా అరిగించుకోగలవు. ఫలితంగా అసిడిటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. పొట్టనిండా ఆహారం తీసుకోకూడదు. పొట్ట ఎప్పుడూ కొంచెం ఖాళీగా ఉంచుకోవాలి. కొంచెం నీళ్లు, కొంచెం ఆహారం, మిగతా గాలితో నింపాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

గ్యాస్ ట్రబుల్ సమస్యను అలానే వదిలిస్తే.. తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. మీ జీవనశైలోలో మార్పులతో పాటు ఆహార అలవాట్లులోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఎసిడిటీ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు. గ్యాస్ ట్రబుల్‌ సమస్యను ఎలా గుర్తించాలో తెలుసా? ఎసిడిటీ రావడానికి అసలు కారణాలేంటి? గ్యాస్ ట్రబుల్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్య నిపుణులు సూచననలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం..

గ్యాస్ ట్రబుల్ లక్షణాలు :
ఆహారం తీసుకున్న కొన్ని గంటలకు వికారంగా అనిపించినా, తల తిరుగుతున్నట్టు అనిపించినా, వాంతులు ఫీలింగ్ కలిగినా అది గ్రాస్ట్రిక్ ట్రబులే.. అలాగే ఎక్కువగా చెమటలు పడుతున్నాయా? గుండెల్లో మంట అనిపించినా జీర్ణ సమస్యలు తరచూ కనిపిస్తున్నా గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడు తున్నారన్నట్టే. మలబద్ధకం సమస్య కూడా ఎసిడిటీ లక్షణాలే. ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉంటే తీవ్రమైన ఎసిడిటీగా మారే ప్రమాదం ఉంది. ముందుగా డాక్టర్‌ను సంప్రదించి సరైన ట్రీట్ మెంట్ తీసుకోవడం చాలా అవసరం. కడుపులో మంట తగ్గాలని ట్యాబ్లెట్స్, సిరప్ప్ వాడేస్తుంటారు.

ఇలా చేయడం మంచిది కాదు. ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. ఆహారాన్ని పూర్తిగా నమిలి నిదానంగా తినాలి. నీరు ఎక్కువగా తాగాలి. రాత్రిపూట డిన్నర్ తర్వాత వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. స్మోకింగ్,డ్రింకింగ్ మానేయాలి. ప్రతిరోజులో మీరు కనీసం 7 గంటల నుంచి 8 గంటలు వరకు నిద్ర పోవాలి. ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించే వంటింటి చిట్కాలు ఓసారి ట్రై చేయండి.

Gastric-Problems-Home-Remed
Gastric-Problems-Home-Remed

వాము :
మీ కిచెన్ గదిలో లభించే ద్రవ్యాల్లో వాములో అనేక విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్‌ వంటివి ఉంటాయి. వాము పచ్చిగా తీసుకుంటే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం దూరమవుతాయి. వామును వేయించి పొడి చేసుకోవాలి. అన్నంతో కలిపి నెయ్యి కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే వెంటనే గ్రాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. నిమ్మకాయను తీసుకుని ముక్కులుగా చేసి దాని రసంలో వాము పొడి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని తాగితే కడుపులో వచ్చే పుల్లటి తేన్పుల నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

సొంపు గింజలు :
సోంపు గింజలను నీటిలో మరిగించాలి. ఆ నీటిని వేడిగా తాగితే ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది. సొంపు గింజులు తినడం ద్వారా యాంటీ అల్సర్ గుణాలతో ఎసిడిటీ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. అన్నం తిన్న వెంటనే కొన్ని సొంపు గింజలను నమిలాలి. తేలికగా జీర్ణం అవుతుంది. నీట్లో సొంపు గింజల్ని ఒక రాత్రంతా నానబెట్టాలి. తెల్లారిన తర్వాత ఆ నీటిలో తేనె కలిపుకుని తాగితే ఎసిడిటీ సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఈ సోంపుగింజల నీటిని రోజుకు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది.

పాలు-పెరుగు (Milik-Curd) :
నిత్యం మీరు ఒక గ్లాస్ పాలను తాగడం ద్వారా అసిడిటీ సమస్యను నివారించుకోవచ్చు. వేడివేడి పాలు కాకుండా చల్లటి పాలు తాగాలంట. కడుపు మంట, వికారం, గుండె మంట, పుల్లటి తేన్పులు తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా పాలల్లో కాల్షియం ఉండటం ద్వారా మీ కడుపులో అధిక మోతాదులో ఉత్పత్తయ్యే యాసిడ్‌ను తగ్గించగలదు. పెరుగుకు కూడా యాసిడ్‌ను కంట్రోల్ చేసే గుణం ఉంది. పెరుగు సహజమైన ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది.

తాజా పండ్లు :
అజీర్ణం, గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టాలంటే తాజా పండ్లు తీసుకోవాలి. తాజా పండ్లలో ఉండే పీచు పదార్థాలు ఉంటాయి. రోజుకు ఏవైనా రెండు తాజా పండ్లు తీసుకుంటు ఉండాలి. కడుపులో గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది. సాయంత్రం పూట ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తేనె.. గోరువెచ్చని నీరు :
ఒక గ్లాసు గోరు వెచ్చగా ఉండే నీళ్లలో ఒక టీస్పూన్ వరకు తేనె కలుపుకొని తాగండి. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందట. తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపండి.. డిన్నర్ చేయబోయే ముందు తీసుకుంటే ఎసిడిటీ సమస్య నుంచి బయటపడొచ్చునని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

Gastric-Problems-Home-Remed
Gastric-Problems-Home-Remed

కొత్తిమీర రసం..
కడుపులో యాసిడ్ ఫాం కాకుండా కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. 10 మిల్లీ లీటర్ల కొత్తిమీర రసం తీసుకుంటే తక్షణమే గ్రాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం కలుగుతుంది. కొత్తిమీర ఆకుల రసాన్ని తీసి గోరు వెచ్చని నీటిలోనిగాని లేదా మజ్జిగలో మిక్స్ చేసి తాగవచ్చు. వికారం, అజీర్ణం ఉంటే పచ్చి ధనియాలు తినచ్చు. వాంతుల ఫీలింగ్ అనిపిస్తే ధనియాలు నమలండి.

గ్రాస్ ట్రబుల్‌కు అసలు కారణాలు ..
ఆహారం తీసుకున్న వెంటనే పడుకోవద్దు.. ఎసిడిటీ సమస్యకు అసలు కారణం ఇదేనంట. అధిక బరువు ఉన్నా, ఆల్కాహాల్ తీసుకున్నా, సిగరెట్ అలవాటు ఉన్నా గ్రాస్ ట్రబుల్ సమస్య వస్తుందంట.. మసాలా స్పైసీ ఫుడ్ తిన్నా, మోతాదుకు మించి కాఫీ, టీలు తాగినా ఎసిడిటీ సమస్య వస్తుందని అంటున్నారు. నిద్ర పోయే ముందు ఆహారం తీసుకోవద్దని చెబుతన్నారు. అలా చేస్తే యాసిడ్‌ ఎక్కువగా ఉత్పత్తి ఎసిడిటీ సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వే వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించుకోనేందుకు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయంలో ఆహారం తీసుకుంటుండాలి. ఆరోగ్యకరమైన జీవనానికి అలవాటు పడాలి. భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రపోకూడదు. కాసేపు అటు ఇటూ ఆరుబయట నడవాలి. కనీసం అరగంట పాటైన నడవడం ద్వారా మీరు తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు తిన్న ఆహారం జీర్ణం కాక జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తించుకోవాలి. చాలామంది చేస్తున్న తప్పు ఇదే.. ఎందుకంటే.. తెలిసి కూడా ఏమౌతుందిలేనన్న నిర్లక్ష్యమే అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది.

తిన్న వెంటనే నిద్రపోతున్నారా? :
తిన్న వెంటనే నిద్రపోతే కడుపులోని జీర్ణ రసాలు (ఆమ్లాలు) ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయి అసిడిటీకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. అలా ఉత్పత్తి అయిన గ్యాస్ మీ కడుపులో నుంచి ఛాతిభాగాల నుంచి గొంతులోకి వెదజల్లే సమస్య ఎక్కువగా ఉంటుంది. అలా గొంతులోకి వచ్చిన వెంటనే మీకు బాగా మంటగా అనిపించిన అనుభూతి కలుగుతుంది. జీర్ణ రసాల వల్ల మీ గొంతు మంటగా అనిపిస్తుంది. ఈ సమస్యతో దీర్ఘకాాలంగా బాధపడేవారిలో గొంతులోని సన్నని పొర దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అలాగే ఆహారం తినేముందు.. తిన్న తర్వాత కొన్ని గంటల పాటు నీళ్లు తాగకూడదని పోషక నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే కూడా మీరు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదని గుర్తించాలి. మీకు వీలైనంత సేపు మీరు తినే ఆహారాన్ని బాగా నమిలి తిని మింగేయండి. జీర్ణ సంబంధింత సమస్యలు పెద్దదిగా కాకముందే ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే.. సమస్య తీవ్రమై ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్యాస్ సమస్యను అధిగమించేందుకు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం తప్ప మరో మార్గం లేదని గుర్తించాలి.

Read Also : Diabetes: ఇలాంటి విత్తనాలు తిన్నారంటే.. జీవితంలో షుగర్ రానేరాదు!

Tags: acidity home remediescure gastric problemGas problemsreduce gastric problemsrelieve gas fastకడుపులో తేన్పులుగ్యాస్ సమస్యకు చిట్కాలుగ్యాస్ సమస్యకు మందుగ్యాస్ట్రిక్ సమస్యలు
Previous Post

Dark Armpits : చంకల్లో నలుపుని ఇలా సులభంగా తొలగించుకోండిలా..

Next Post

best ayurveda moolika benefits : ఈ ఆయుర్వేద మూలికలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Related Posts

Anjeer Health Benefits in telugu
Health Tips

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu
Health Tips

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Sky Fruit health Benefits in Telugu
Health Tips

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Pulipirlu Taggadaniki
Health Tips

Remove Warts : ఈ ఆకులతో ఇలా చేస్తే.. మీ శరీరంపై పులిపిర్లు ఎక్కడ ఉన్నా వెంటనే రాలిపోతాయి.. అద్భుతమైన రెమడీ.. తప్పక పాటించండి..!

Kitchen Remedies
Kitchen Remedies

Kitchen Home Remedies : ప్రతి ఇల్లాలి కోసం 20 వంటింటి చిట్కాలు.. తప్పక తెలుసుకుని పాటించండి..!

Pampara Panasa Benefits in Telugu
Health Tips

Pampara Panasa Benefits : పంపర పనసకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? వాంతులు, విరోచనాలను క్షణాల్లో తగ్గిస్తుంది..!

Leave Comment

TODAY TOP NEWS

    • Latest
    Anjeer Health Benefits in telugu

    Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

    by mearogyam

    7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu

    Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

    by mearogyam

    Atibala-plant-Atibala-plant-benefits in telugu

    Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

    by mearogyam

    aloo garlic curry in telugu

    Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

    by mearogyam

    Sky Fruit health Benefits in Telugu

    Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

    by mearogyam

    Graha Dosha Nivarana Remedies in telugu

    Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

    by mearogyam

    Sunday Surya Mantras Remedies in Telugu

    Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

    by mearogyam

    .Mithuna Rasi Phalalu November Month Horoscope 2024 in telugu

    Horoscope 2024 : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?

    by mearogyam

    Guru Dattatreya

    Guru Dattatreya : గురువారం దత్తాత్రేయున్ని, అనగాదేవి ని ఇలా అర్చన చేస్తే గురుగ్రహదోషం ,గతజన్మ పాపాల దోషాలు తొలగుతాయి….

    by mearogyam

    • Home
    • About Us
    • Contact Us
    • Terms & Conditions
    • Disclaimer
    • Privacy Policy

    © 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News

    No Result
    View All Result
    • Home
    • అందం-ఆరోగ్యం
    • ఆయుర్వేదం
    • ఫిట్‌నెస్
    • ఆరోగ్య చిట్కాలు
    • రిలేషన్ షిప్
    • ఆధ్యాత్మికం
    • వంటకాలు

    © 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News