sunflower seeds for diabetics: ఇలాంటి విత్తనాలు తిన్నారంటే? ఏమౌతుందో తెలుసా? డయాబెటిస్ రమ్మన్నా రాదట.. ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న ఈ డయాబెటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి ఒకసారి ఎటాక్ అయిందంటే జీవితాతం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి షుగర్ వ్యాధిని జన్మలో రాకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఈ విత్తనాలు తినాల్సిందేనట.. వయస్సుతో సంబంధం లేదు. గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గుదల కారణంగా ఈ సమస్య తలెత్తుంది.
అది మన జీవన విధానం కూడా ఒక కారణమే.. లైఫ్ స్టయిల్ మార్చుకుంటే షుగర్ వ్యాధిని దగ్గరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు.. మందులతో కాకుండా సహజ సిద్ధంగా ఈ విత్తనాలతో డయబెటిస్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.. అవే.. పొద్దుతిరుగుడు విత్తనాలు.. ఈ విత్తనాలను మీ డైట్ లో భాగం చేసుకుంటే డయాబెటిస్ వెంటనే కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు పోషక నిపుణులు.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో అధిక క్యాలరీలు ఉంటాయి. రుచి కూడా బాగానే ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు నలుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో మోనోసాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ పుష్కలంగా ఉన్నాయి ఫైబర్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. ఈ విత్తనాలను తింటే ఆకలి కూడా వేయదు.. డయాబెటిస్ ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉంటే.. తమ డైట్ లో ఈ పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చుకోవాలి. అంతే.. షుగర్ నియంత్రణలోకి వస్తుంది ఇప్పటికే చాలా అధ్యయనాల్లో తేలింది. ఈ విత్తనాలను నేరుగా తినొచ్చు.. నీళ్లలో నానబెట్టి తీసుకుంటే మరిన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు..
పొద్దుతిరుగుడు విత్తనాలతో వంటనూనె తయారుచేస్తారని తెలిసిందే.. అదే సన్ ప్లవర్ ఆయిల్ అంటారు కదా.. ఈ ఆయిల్ గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నూనె కంటే పొద్దుతిరుగుడు విత్తనాలు నేరుగా తింటేనే చాలామంచిదని చెబుతున్నారు. విత్తనాల్లో ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వును కరగదీయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అంటున్నారు.
బరువు తగ్గాలనుకుంటే ఇదే బెస్ట్ రెమడీ.. ఈ విత్తనాలను తినడం ద్వారా కీళ్లనొప్పులు, ఆస్తమా సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు. విటమిన్ ఇ అధికంగా ఉండే ఈ విత్తనాల్లో కంటి ఆరోగ్యాన్ని రక్షించే గుణాలు పుష్కలంగా ఉన్నాయట.. విటమిన్ సి కూడా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ఈ విత్తనాలు నిరోధిస్తాయి.
కరోనా సమయంలో చాలామంది ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. అందులో పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలు మంచి స్నాక్స్ కూడా.. ఎక్కువ మంది ఈ పువ్వు విత్తనాలే తింటున్నారు. పొద్దు తిరుగుడు విత్తనాలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే.. అందులో మంచి పోషకాలతో పాటు.. కేలరీలు కూడా అందుతాయి. విత్తనాలు తియ్యగా ఉండటంతో ఎక్కువమంది ఈ విత్తనాలను ఇష్టంగా తింటుంటారు.
మూడు రకాల సన్‌ఫ్లవర్ విత్తనాలు…
పొద్దు తిరుగుడు విత్తనాల్లో మినరల్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి కూడా. ఈ విత్తనాలను పువ్వు మధ్యలో నుంచి సేకరిస్తారు. బూడిద రంగులోనూ నలుపు రంగులో కనిపిస్తాయి. సైంటిఫిక్‌గా పరిశీలిస్తే మూడు రకాల సన్‌ఫ్లవర్ విత్తనాలు ఉన్నాయి. సన్ ప్లవర్ లో న్యూసన్, లైనోలెయిక్, హైలీ ఒలెయిక్ అనే మూడు రకాల విత్తనాలు ఉన్నాయి. శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వు పదార్థాల ఆధారంగా విత్తనాలను పిలుస్తారు.
పొద్దు తిరుగుడు విత్తనాలు ముఖ్యంగా మీ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. విటమిన్ సి కలిగిన విత్తనాలు తినడం ద్వారా గుండె జబ్బులు రావు. విటమిన్ E కూడా సమృద్ధిగా లభిస్తుంది. దీనిద్వారా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటాయి. ప్రతిరోజూ ఒక పావు కప్పు పొద్దుతిరుగుడు గింజలు తింటే విటమిన్ (E) 90 శాతం వరకు లభిస్తుంది. అలాగే విత్తనాలతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. ఫైబర్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించేస్తుంది.
మల బద్ధకాన్ని తగ్గించగలవు :
జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ఈ సీడ్స్‌లో ఫైబర్ మల బద్ధకాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను అడ్డుకుంటున్నాయి. ఈ విత్తనాల్లోని విటమిన్ (E) కణాలను దెబ్బ తినకుండా రక్షిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ సహా ప్రొస్టేట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ వ్యాధులను రాకుండా నివారిస్తుంది. బోన్స్ బలంగా మారుతాయి. విత్తనాల్లోని మెగ్నీషియం వల్ల ఎముకలు బాగా గట్టిపడుతాయి. ఎముకల జాయింట్లు కూడా అరిగిపోకుండా ఉండేందుకు ఈ పొద్దుతిరుగుడు గింజల్లోని కాపర్ ఎముకులను గట్టిపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
పొద్దు తిరుగుడు విత్తనాలతో ఒంట్లోని నరాలకు చాలా మంచిది. పువ్వులోని విత్తనాల్లో మెగ్నీషియం ఉండటం వల్ల అది నరాలను విశ్రాంతపరుస్తుంది. మానసిక సమస్యలను కూడా దరిచేరనివ్వవు. మన మూడ్ పాజిటివ్ ఆలోచనలతో నిండేలా చేస్తాయి విత్తనాలు. తద్వారా మానసిక ఒత్తిడిని తొందరగా తగ్గించుకోవచ్చు. విటమిన్ E సమృద్ధిగా లభించే విత్తనాలతో చర్మంపై అనారోగ్య సమస్యలను వెంటనే తగ్గించుకోవచ్చు. విష వ్యర్థాలను తొలగిస్తుంది. డయాబెటిస్ బారినపడకుండా ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి.
నియంత్రణలో హైబీపీ.. :
హైబీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. శ్వాససమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించగల సెరెటోనిన్ ఉత్పత్తి చేయగలవు. అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మీ పిల్లలన్నీ రక్షించడంలో ఈ విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. కీళ్ల నొప్పులను ఈ విత్తనాలను తొందరగా తగ్గించుకోవచ్చు. ఆస్తమాకు ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు మంచి మందుగా పనిచేస్తాయి. జలుపుతోపాటు దగ్గును నివారించడంలో పనిచేస్తాయి.
హైబీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. శ్వాససమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించగల సెరెటోనిన్ ఉత్పత్తి చేయగలవు. అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మీ పిల్లలన్నీ రక్షించడంలో ఈ విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. కీళ్ల నొప్పులను ఈ విత్తనాలను తొందరగా తగ్గించుకోవచ్చు. ఆస్తమాకు ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు మంచి మందుగా పనిచేస్తాయి. జలుపుతోపాటు దగ్గును నివారించడంలో పనిచేస్తాయి. కళ్లకు బాగా మేలు చేస్తాయి.
సన్ ప్లవర్ నూనెలో విటమిన్ A లభిస్తుంది. కంటి చూపు బాగా కనిపించేలా చేస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. గింజల్లో జింక్ సమృద్ధిగా దొరుకుతుంది. శరీరానికి అయిన గాయాలను తొందరగా నివారించగలదు. విటమిన్-ఈ కూడా ఉంటుంది. చర్మానికి రక్షణ అందిస్తుంది. శరీరంలో అవసరమైన మెలనిన్‌ను కాపర్ ఉత్పత్తి చేస్తుంది.
వృద్ధాప్యం తొందరగా రాకుండా పొద్దుతిరుగుడు గింజలు అడ్డుకుంటాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరగడంలో విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టుకు అవసరమైన ప్రోటీన్స్, విటమిన్లు A, B అందుతాయి. జుట్టు ఆరోగ్యంగా పెరిగి రాలిపోయే సమస్యను నివారించుకోవచ్చు. అలాగే వెంట్రుకలు తెల్లబడకుండా పొద్దుతిరుగుడు గింజలు మంచి రెమడీగా పనిచేస్తాయనడంలో సందేహం అక్కర్లేదు.
కొంతమందిలో చిన్న వయస్సులోనే శరీరం ముడతలు పడిపోతుంటుంది. వెంట్రకులు కూడా తెల్లగా మారిపోతుంటాయి. చుండ్రుతో పాటు జుట్టు వెంటనే రాలిపోయే సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సన్ ఫ్లవర్ విత్తనాలతో మంచి పరిష్కారమని చెప్పవచ్చు. చర్మంపై నల్లటి మచ్చలతో పాటు అనేక అనారోగ్య చర్మ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం అందించగలవు. సన్ ప్లవర్ విత్తనాలను బాగా ఎండబెట్టి వాటి ద్వారా వచ్చిన నూనెను శరీరానికి అప్లయ్ చేయడం ద్వారా చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలిగిపోతాయి. ఆ తర్వాత స్నానం చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతుంది.
పొద్దుతిరుగుడు పువ్వులోని విత్తనాలను అనేక ఔషధ తయారీలోనూ వినియోగిస్తుంటారు. అందులో ఆయిల్ వాడకంలోనూ పొద్దుతిరుగుడు విత్తనాలను విరివిగా వాడుతుంటారు. మనం ఇప్పుడు ఎక్కువగా వినియోగించే వంటనూనెల్లో సన్ ఫ్లవర్ పేరుతో మార్కెట్లో లభించే అనేక నూనెలు ఈ విత్తనాల నుంచే తీసినవే.. సూర్యుని గమనాన్ని అనుసరించే ఈ పొద్దుతిరుగుడు పువ్వుల్లోని విత్తనాల్లో అద్భుతమైన ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో రుజువైంది కూడా. విటమిన్ ఎ అధికంగా ఉండటం ద్వారా కంటి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయని చెబుతున్నారు పోషక నిపుణులు.
Read More: Oral Diabetes : నోటిలో ఇలాంటి లక్షణాలు ఉంటే.. డయాబెటిస్ వచ్చినట్టేనా?