Watermelon Seeds : పుచ్చకాయను తినేటప్పుడు గింజలను పడేస్తున్నారా? పుచ్చకాయ మన దప్పికను తీర్చడంతోపాటు శరీరంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మనం చాలామంది పుచ్చకాయ తినేటప్పుడు వాటిలో ఉన్న గింజలను తినడానికి ఇష్టపడరు. అయితే పారే వేసే గింజలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు (watermelon seeds health benefits) దాగి ఉన్నాయి..
ఈ విత్తనాలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఫాస్పర్, సోడియం, మాంగనీస్ జింకుతో పాటు విటమిన్స్, యాంటీఆక్సిడెంట్, అమినో ఆమ్లాలు లభిస్తాయి. పుచ్చకాయ గింజలు జుట్టు బాగా పెరగడానికి సహాయపడతాయి. ఇందులోని కాపర్ జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే మొలానిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇవి వెంట్రుకల కుదురుల నుండి బలోపేతం చేసి ఒత్తు జుట్టును పొందేందుకు సహాయపడతాయి. వెంట్రుకలు చిట్ట్లడం రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
పుచ్చకాయ గింజలు (watermelon seeds benefits) మెత్తగా నూరి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లే చేయడం ద్వారా కాంతివంతమైన ముఖవర్షతను పొందవచ్చు. ఇది మీ చర్మానికి సహజవంతమైన కాంతిని ఇవ్వడంతో పాటు చర్మంపై ముడతలు, చర్మం పొడిబారే సమస్యను తగ్గిస్తుంది. షుగర్ వ్యాధి సమస్యతో బాధపడే వారికి పుచ్చకాయ గింజలు ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు. పుచ్చకాయ గింజలతో చేసే టీ ని రోజు తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. ఇందులోని ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుంది.

Watermelon Seeds : పుచ్చకాయ గింజలతో ఎన్ని లాభాలో తెలుసా?
ఈ గింజల్లో సమృద్ధిగా ఉండే పాలి ,మోనో ప్లాటి ఆమ్లాలు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు గుండె సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. ఎముకలను ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పుచ్చకాయ గింజల్లో (యాంటీయాక్సైడ్) పుష్కలంగా కలిగి ఉంది. ఇది శరీరానికి (ఫింగ్మేటషన్) భారీ నుండి కాపాడుతుంది. ఇందులోని పోషక విలువలు శరీరంలో కణజాలను, డిఎన్ఏ (DNA) డ్యామేజీల బారి నుండి కాపాడుతుంది. ఇందులో నియాసిన్ అనే రసాయనం రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ బి హార్ట్, నరాలకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషుల్లో వీర కణాల ఉత్పత్తి పెంచుతుంది. ఇది వయసు పై పడటం వల్ల వచ్చే (వృద్ధాప్యం) సమస్యను తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది. అందువల్ల పుచ్చకాయలు గింజలతో సహా నమిలి తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. పుచ్చకాయ గింజలను ఎండబెట్టి గాజు సీసాలో నిల్వ చేసుకుంటే మనకు కావలసినప్పుడు తినవచ్చు..
Read Also : Avisa Seeds Health Benefits : అవిసె మొక్క.. ఎన్ని జబ్బులను మాయం చేస్తుందో తెలిస్తే అసలే వదిలిపెట్టరు!