avisa seeds health benefits : ఆయుర్వేదంలో అవిసె మొక్క ప్రత్యేకత ఉంది.. అవిసె మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసా? అవిసె మొక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవిసె గింజలకు అనేక పేర్లు ఉన్నాయి. మదనగింజలు, అతశి, అవిసె ఉలుసుల వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఈ మొక్కలోని ఆకులు, చెక్కలు, వేర్లు, పువ్వుల్లో అనేక ఆయుర్వేద ఔషధ గుణాలున్నాయి.
అవిసె ఆకులను బాగా ఉడికించి వండి తినడం వల్ల కడుపులోని ఆహారం చాలా తేలికగా తొందరగా జీర్ణం అవుతుంది. పలు అనారోగ్య సమస్యల్లో క్రిమి రోగాలు, కఫం రోగాలు, పైత్య వంటి జ్వరాలు, రక్త పైత్యాన్ని నివారించిండంలో పనిచేస్తుంది. అవిసె ఆకు, అవిసె బెరడు, అవిసె పువ్వులు తినడానికి చాలా చేదుగా ఉంటాయి. అవిసె ఆకుల రసం బాగా వేడి చేస్తుంది. శరీరంలో కొవ్వుని బాగా కరిగించి దేహాన్ని తేలికగా మారుస్తుంది.
చర్మ సౌందర్యానికి కూడా అవిసె పూలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ముందుగా నీడలో ఆరబెడతారు. ఆ తర్వాత బాగా దంచి జల్లించి నిల్వ చేస్తారు. అవిసె పోడిని స్నానం చేసే ముందు పాలను కలపాలి. కొంచెం వెన్నె కూడా వేసుకుని ఆ మిశ్రమాన్ని శరీరానికి నలుగు పిండిలా రాసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేయడం ద్వారా నలుపు మచ్చలు వెంటనే తగ్గిపోతాయి. చర్మం ఛాయ కూడా బాగా మెరుగుపడుతుంది. అవిసె ఆకుతో కూర వండుకుని తింటే సుఖవిరేచనం అవుతుంది. కడుపు లోపల పెరిగిన కొవ్వు కూడా మొత్తం కరిగి నడుము సన్నగా మారిపోతుంది. గవద బిళ్లలతో ఇబ్బందులు పడే వారికి అవిసె ఆకు బాగా పనిచేస్తుంది. అవిసె గింజలను తీసుకుని కొద్ది మొత్తంలో గుల్ల సున్నం కలపాలి. బాగా నూరి ఆ మిశ్రమాన్ని గవద బిళ్ళపై మెత్తగా రుద్దితే చాలు గవద బిళ్లలు దానంతటే అవే కరిగిపోతాయి.
రేచీకటి సమస్యకు అవిసెలతో చెక్ :
రేచీకటి సమస్యను నివారించేందుకు ప్రతి రోజు అవిసె మొగ్గలను, పూలను కూరగా వండుకుని అన్నంలో కలుపుకుని తినాలి. ఇలా వరసగా 21 రోజులు పాటు తినడం ద్వారా రేచీకటి సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే సెగ గడ్డల నివారణకు కూడా అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. పసుపు కొమ్ములు సమంగా తీసుకోవాలి. అలా మెత్తగా నూరి గడ్డలపై కట్టుకట్టాలి. మూడురోజుల్లోనే గడ్డలు పగిలిపోయి పుండు మానిపోతుంది. పొట్ట తగ్గేందుకు అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆముదం గింజలను సమానంగా తీసుకోవాలి. ఆముదం గింజలను పగలగొట్టి పెచ్చులను తీసివేయాలి. లోపలి పప్పుతో అవిసె గింజలను తీయాలి. నీటితో మెత్తగా ముద్దలాగా చేయాలి. కొంచం పలచగా ఉండేలా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడుపుపై పట్టు మాదిరిగా వేయాలి. అలా చేస్తే పొట్ట తగ్గిపోతుంది.
ఉదర సంబంధిత సమస్యలకు వ్యాధులకు కూడా అవిసె మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. బాగా శుభ్రపరిచిన అవిసె ఆకులతో పాటు చిన్నపాటి ఉల్లిపాయలతో పాటు మిరియాలను కూడా చేర్చాలి. జీలకర్ర సూప్‌లా తీసుకోవాలి. ఉదర సంబంధిత రుగ్మతలను కూడా తగ్గించగలదు. పార్శ్వపు తలనొప్పితో ఇబ్బంది పడేవారు అవిసె గింజలు, ఆవాలు సమానంగా తీసుకోవాలి.
మంచినీటితో మెత్తగా నూరాలి. ఆ మిశ్రమాన్ని తల కణతలపై పట్టులాగా వేసుకోవాలి. ఆపై కాగితం కూడా అంటించాలి. అలాగే ఇటుక పొడిని కూడా బాగా వేయించి బట్టలో మూటకట్టాలి. దాన్ని కాపడం పట్టాలి. అంతే.. పార్శ్వపు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. బల్ల రోగానికి కడుపుపై ప్రతిరోజు అవిసె గింజలను నూరి పట్టుగా వేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.
చర్మవ్యాధులకు అవిసె ఆకుల రసం :
చర్మసంబంధిత వ్యాధులకు అవిసె ఆకుల రసాన్ని తీసుకోవాలి. చర్మంపై దద్దుర్లపై రాస్తే మంచి ఉపశమనం ఉంటుంది. చర్మసంబంధిత సమస్యలు ఉన్న ప్రాంతంలో అవిసె ఆకుల రసాని తీసుకోవాలి. కొబ్బరి నూనెలో బాగా వేయించి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ పేస్టును చర్మంపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మూత్రపిండాలు ఫెయిల్ అయినవారు.. మూత్రసంబంధిత సమస్యలకు అవిసె మంచి ఔషధంగా పనిచేస్తుంది.
అవిసె గింజలను దొరగా వేయించాలి. గింజల్లో సగం కొలతల్లో చక్కర పొడి కలిపాలి. రోటిలో వేసి మెత్తగా అయ్యేవరకు దంచుకోవాలి. ఆ తర్వాత లడ్డుల్లా చేసుకోవాలి. లడ్డు ముద్దలను ప్రతిరోజూ ఉదయంపూట సాయంత్రంపూట తీసుకోవాలి. అది కూడా ఆహారానికి గంట ముందే తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మూత్ర పిండాలకు సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలు వెంటనే తగ్గుముఖం పడతాయి.
అవిసె గింజలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మాటల్లో చెప్పలేం. అవిసె మొక్క, పూలతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి ఈ అవిసె మొక్కతో కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అసలే వదిలిపెట్టరు. డయాబెటిస్, బీపీ వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలకు ఈ అవిసె అద్భుతంగా పనిచేస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. అవిసె గింజలతో గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడేవారు ఈ అవిసె గింజలను వాడటం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా పొట్టు చుట్టూ పేరుకుపోయిన ప్రాణాంతక కొవ్వును కరిగించవచ్చు. అధిక కొవ్వు సమస్య నుంచి తొందరగా బయపడొచ్చు. ఇన్నీ అద్భుత ప్రయోజనాలు కలిగిన అవిసె గింజలను చక్కని ఆరోగ్య కోసం ఒకసారైనా వాడి చూడాల్సిందే. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదలమన్నా వదలరంతే.
Read Also : Diabetes: ఇలాంటి విత్తనాలు తిన్నారంటే.. జీవితంలో షుగర్ రానేరాదు!