Warts Remove Tips : కొందరు పులిపిర్ల సమస్యతో బాధపడుతుంటారు. వారు ఎంత అందంగా ఉన్నా మొహం, మెడ, చెంప, నుదురు భాగాల్లో పులిపిర్లు రావడం మూలాన వారి అందం చెడిపోతున్నదని తెగ బాధపడుతుంటారు. వాటిని తొలగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. వైద్యులను సంప్రదించడం లేదా పూర్వ కాలంలో పులిపిర్ల నివారణకు ఉపయోగించిన పద్ధతులను ఫాలో అయ్యి కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాంటి వారికోసం మీ ఇంట్లోనే సులువుగా పరిష్కారం పొందవచ్చు.. ఎలాగో ఇపుడు తెలుసుకుందాం..
సాధారణంగా పులిపిర్లు శరీరంలో ఎక్కువగా చెమట ఉత్పత్తి కావడం, శుభ్రత లేకపోవడం వలన హ్యూమన్ పాలిలోమా అనే వైరస్ ఉత్పత్తి అవుతుంది. అదే శరీరం మీద కణజాలం లాగా పెరిగి పులిపిరిలా వ్యాప్తి చెందుతుంది. దీనివలన ఎటువంటి నొప్పి ఉండదు. కానీ చూపరులకు కొంత అసహ్యాన్ని కలిగిస్తాయి. ఏం చేస్తే పులిపిరులు వాటంతటవే రాలిపోతాయో ఇపుడు చూద్దాం..
అవిశ గింజల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి మనకు ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి ఫైబర్‌ను కూడా అధికంగా అందిస్తాయి. వీటిని పేస్టులాగా చేసి కొద్దిగా తేనె కలిపి పులిపిరులు ఉన్న చోట రాసి కట్టుకట్టాలి. ఇలా తరచూ చేయడం వలన పులిపిరులు రాలిపోతాయి. అదేవిధంగా వెల్లుల్లిని కూడా పులిపిరులు ఉన్న చోట రాసి కట్టుకడితే కొద్దిరోజులకు ఫలితం కనిపిస్తుంది.
ఇకపోతే ఉల్లిపాయ ముక్కలను వెనిగల్‌లో కలిపి రాత్రంతా నాన బెట్టాలి. తెల్లారి ఆ మిశ్రమాన్ని పులిపిరిపై రాసి కట్టుకట్టాలి. ఇలా కొద్దిరోజులు చేసినా అవి రాలిపోతాయి. అదే విధంగా కర్పూర తైలం, ఆముదం రెగ్యులర్‌గా రాసినా, బంగాళ దుంప, పైనాపిల్ ముక్కలను పులిపిర్ల మీద రుద్దుతూ ఉంటే తొందగానే ఫలితం కనబడుతుంది. దీంతో పులిపిర్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. మీ సౌందర్య వంతమైన ముఖంపై ఎటువంటి మరక, మచ్చ కనిపించదు.
Read Also : Remove blackheads on Nose : ముక్కుపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే ఈ వంటింటి చిట్కాలు ట్రై చేయండి!