Remove blackheads on nose : మీు ముక్కుపై బ్లాక్ హెడ్స్ (నల్లటి వలయాలు)తో ఇబ్బంది పడుతున్నారా? అందమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. కానీ, ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడటంతో నలుగురిలో తిరగాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. వాతావరణం కాలుష్యం కారణంగా ముఖమంతా అందవిహీనంగా మారిపోతుంది. అప్పుడు ముక్కుపై బ్లాక్ హెడ్స్ ఏర్పడుతుంటాయి. మురికి చేరి నల్ల మచ్చలు ఏర్పడుతున్నాయి. ఈ వంటింటి చిట్కాల ద్వారా బ్లాక్ హెడ్స్ సులభంగా తొలగించుకోవచ్చు. ఓసారి ప్రయత్నించండి..
వంట సోడా (cooking Soda) :
వంట సోడాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వంట సోడాలో నీరు పోయాలి.. పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని చుట్టూ బ్లాక్ హెడ్స్ అప్లయ్ చేయాలి. ఆ తర్వాత పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా ముక్కు దగ్గర నల్లగా ఉన్న చర్మమంతా నునుపుగా మారిపోతుంది. క్రమంగా చర్మం సాధారణ రంగులోకి మారుతుంది.
శనగపిండి (Peanut butter) :
బ్లాక్ హెడ్స్.. ముక్కుపై తొందరగా పోగట్టుకోవాలంటే కొంచెం నువ్వుల నూనె రాయాలి. ఆ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేయాలి. 15 నిమిషాల తర్వాత ముక్కుపై నెమ్మదిగా రుద్దుతూ మర్దనలా చేస్తుండాలి. కాసేపు అయినా తర్వాత కడిగేయాలి.. ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
తేనె-నిమ్మరసం (Honey-Lemon):
ముక్కుపై నల్లటి మచ్చలను తొలగించడంలో నిమ్మకాయ, తేనె అద్భుంగా పనిచేస్తుంది. నిమ్మకాయ రసానికి రెండు చుక్కల తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని ముక్కు చుట్టూ అప్లయ్ చేయాలి. ముక్కుపై ఉన్న బ్లాకు హెడ్స్ పూర్తిగా తొలగిపోతాయి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తుంటే ముక్కుమీద బ్లాక్ హెడ్స్ మాయమైపోతాయి. ముక్కుపై నల్ల చుక్కలను తగ్గించడంలో రెమడీలు చాలానే ఉన్నాయి. నల్ల చుక్కలు (మచ్చలు)గా పిలిచే ఓపెన్ కామెడోన్స్.. మెటిమల్లో ఇదొరకంగా చెప్పవచ్చు.
ఎక్కువగా మహిళల్లో ముక్కుపై ఇలాంటి చుక్కలు కనిపిస్తుంటాయి. ముక్కుపై మాత్రమే కాదు.. నుదటిపైనా, గడ్డంపైనా కూడా తరచుగా కనిపిస్తుంటాయి. ముఖ చర్మంపై కనిపించే ఈ మచ్చలతో ఎలాంటి హాని ఉండదు.. నొప్పి లేదా దురద ఏమి ఉండదు. చూడటానికి ఆధ్వాన్నంగా కనిపిస్తాయి. ముఖ చర్మం అందాన్ని దెబ్బతీస్తాయి. నల్ల మచ్చలను వదిలించుకునేందుకెు మహిళలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు అనేక రెమడీలు కూడా అందుబాటులో ఉన్నాయి..
మచ్చలకు కారణాలివే :
నల్ల మచ్చలు రావడానికి కారణాలు కూడా తెలుసుకోవాలి. హర్మోన్ల మార్పులతో చర్మంపై ఇలాంటి మచ్చులు ఏర్పడుతుంటాయి. తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకునేవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కొవ్వు పదార్థాలతో పాటు కాఫీ ఇతర పానియాలను తీసుకోవడం ద్వారా కూడా ఈ నల్లమచ్చల సమస్య వేధిస్తుంటాయి. మరికొంతమంది అదేపనిగా ముఖంపై ఏవో క్రీములు, లోషన్లు అంటూ బ్యూటీ ప్రొడక్టులను తెగ వాడేస్తుంటారు. ఎలాపడితే అలా ముఖంపై రాసేస్తుంటారు. ముఖంపై మచ్చలు ఏర్పడటానికి ఇది కూడా కారణమని చెప్పవచ్చు. శరీరంలో అంతర్గత అవయాల్లో వచ్చే వ్యాధుల కారణంగా కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ, ఎండోకైన్ వ్యవస్థ పనితీరుకు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా ముఖంపై నల్ల మచ్చలు రావడానికి అసలు కారణాలుగా చెప్పవచ్చు.

తొలగించే మార్గాలివే :
ముఖంపై నల్లటి మచ్చలను తొలగించుకోవాలంటే ముందుగా వైద్యనిపుణుల సలహాలు తీసుకోవాలి. వారు సూచించినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మురికి చర్మం కలిగిన చోట తాకడం ద్వారా బ్యాక్టిరీయా వంటి ఇతర వ్యాధికారకాలు ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. అందుకే మురికి చేతులతో నల్ల మచ్చలను తొలగించడం మంచింది కాదని గుర్తించుకోవాలి. ముఖంపై ఏమైనా గాయాలు లేదా దద్దర్లు వంటి ఎరుపు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆవిరి పట్టడం చేయకూడదు. ముఖంపై మచ్చలను తొలగించే ప్రయత్నంలో మాస్క్ లేదా ఏదైనా వస్త్రంతో క్లీన్ చేయాల్సి ఉంటుంది. మచ్చలను తొలగించిన తర్వాత గంట సమయం వరకు ముఖంపై ఎలాంటి లోషన్లు, క్రీములు రాయవద్దు. అలాగే మేకప్ కూడా వేయరాదని గుర్తించుకోవాలి. సహజసిద్ధంగా ఇంట్లో లభించే వనరులతో ముఖంపై నల్ల మచ్చలను తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు.
అప్పటికీ కూడా చర్మంపై నల్ల చుక్కలు తొలగించుకోలేకపోతే వెంటే చర్మ నిపుణిడిని సంప్రదించడమే మంచిది. స్ర్కీన్ స్కానింగ్ చేసిన తర్వాత చర్మంపై మచ్చలు ఏర్పడటానికి గల కారణాలను గుర్తించి తగిన ట్రీట్ మెంట్ పొందవచ్చు. ముఖంపై మచ్చలను తొలగించేందుకు మరికొన్ని రెమడీలు ఉన్నాయి. ముఖంపై మాస్క్ మాదిరిగా వేసుకోవడంతో పాటు స్ర్కబ్స్ వేయడం ద్వారా తొందరగా నల్లటి మచ్చలను తొలగించుకోవచ్చు. ప్రతిరోజూ మీ ముఖాన్ని కుంచెతో కడగడం చేయాలి. అలా చేయడం ద్వారా వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. ఇందుకోసం మీరు ఈ బ్యూటీ ప్రొడక్టులను ఏదైనా ఫార్మసీ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. రోజువారీకి కూడా వినియోగించుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. మీ ముఖాన్ని ఒక చిన్న వస్త్రంతో కడిగితే సరిపోతుంది. కొంత సమయానికి ఫలితాన్ని మీరే గమనించవచ్చు.
ముఖంపై ప్లాస్టర్ మాస్క్ :
మీ ముఖంలోని ముక్కపై నల్లటి మచ్చలను తొలగించుకోవాలంటే.. ఒక పరిశుభ్రమైన ప్లాస్టిక్ మాస్క్ తీసుకోవాలి. ఈ మాస్క్ ద్వారా మీ ముక్కపై నల్లటి మచ్చలను వెంటనే తొలగించుకోవచ్చు. ప్లాస్టర్ మాస్క్.. మీ ముక్కుపై అతికించుకోవాలి. నిపుణులు సూచించిన విధంగా కొంత సమయం వరకు అలానే ప్లాస్టిక్ అతికించుకోవాలి. కాసేపటి తర్వాత ఆ ప్లాస్టిక్ తొలగించుకోవాలి. క్లియరింగ్ ప్లాస్టర్ ఉపయోగించి మాస్క్ తయారు చేసుకోవడం చాలా ఈజీ కూడా. మైక్రోవేవ్ ద్వారా వేడిచేసిన వెచ్చని పాలతో కూడా చర్మంపై రంధ్రాలను త్వరగా శుభ్రపరుస్తుంది.
హాట్ ప్రెజరింగ్ :
హాట్ ప్రెజరింగ్ విధానం ద్వారా కూడా మీ ముక్కుపై ఏమైనా నల్లటి మచ్చలు ఉంటే సులభంగా తొలగించుకోవచ్చు. నల్ల మచ్చలను త్వరగా వదిలించుకోవాలంటే.. మరో అద్భుతమైన రెమడీ ఉంది.. ఆవిరి ట్రేలను ఉపయోగించి ముక్కుపై నల్లటి మచ్చలను వెంటనే తొలగించుకోవచ్చు. ఈ హాట్ ట్రేలలో మూలికలతో కలగలిసిన కషాయాలను రెడీ చేసుకోవాలి. ఒక వస్త్రాన్ని తీసుకుని దాని మూడు లేయర్లు వచ్చేలా మడతపెట్టాలి. ఇప్పుడా ఆ వస్త్రాన్ని హాట్ ట్రేలో ముంచిన తర్వాత ముక్కుపై నల్లటి మచ్చలు ఉన్నచోట ఉంచాలి. కొన్ని నిమిషాల తర్వాత తొలగించి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
Read Also : Cold Relief Tips : ‘జలుబు’ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందా..? మీకోసమే ఈ టిప్స్..!