Vacha Sweet Flag : అనారోగ్య సమస్యలు ఏవైనా ఆయుర్వేదంలో మందు దొరుకుతుంది. ఆయుర్వేదం అనగా ఇంగ్లీష్ మందుల లాగా ఎక్కడపడితే అక్కడ షాప్స్ ఉండవు. మన వంటిల్లే దానికి వైద్యశాల.. కిచెన్‌లో లభించే పదార్థాలే టాబ్లెట్స్ చెప్పుకోవచ్చు. అయితే, పురాతన కాలం నుంచి మన పూర్వీకులు అన్నిరోగాలకు ఒకే ఒక మందును వినియోగిస్తున్నారు. అదే ‘వస’.. ఇది బయట ఎక్కడా సరిగా లభించదు. కేవలం ఆయుర్వేద దుకాణాల్లో మాత్రమే లభ్యమవుతుంది. వస వలన మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వస.. వాడటం వలన జీర్ణ సమస్యలు, నొప్పులు, వాపులు, శరీరంలో అధిక కొవ్వుశాతాన్నినివారించడానికి ఎంతగానో ఉపయోగడపడుతుంది. అంతేకాకుండా నాడీ మండల వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. అధిక ఒత్తిడి, ఆందోళన తగ్గించి, మెమోరీ పవర్ పెంచుతుంది.

మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది. ఆహారం అరగకపోవడంతో సరిగా ఆకలి కాదు. దీంతో మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వ్యక్తులు వస తీసుకుంటే జీర్ణాశయం పనితీరు మెరుగుపడి ఆకలి బాగా అవుతుంది. వస కొమ్ములు, పసుపు, శొంటి కొమ్ములను దంచి నీళ్లలో మరిగించి కాషాయంలా తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.
Vacha Sweet Flag : వస మొక్కతో ఎన్ని లాభాలో తెలుసా?
ఇకపోతే మూర్చ వ్యాధి గ్రస్తులు వస కొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే తగ్గుతుంది. ఆవనూనెతో కలిపి ఈ పొడిని రాస్తుంటే శరీరంపై ఏర్పడే వాపులు తగ్గుతాయి. వస పొడిని తేనె, బెల్లంతో కలిపి తింటే అసిడిటీ తగ్గుతుంది. హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు వసకొమ్ము, దేవదారు వేరు ముక్క లేదా గురవింద గింజలను మెత్తగా నూరి జుట్టు రాలిన చోట రాస్తే తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి.