Nelatadi Plant Health Benefits : నగరాల్లో మనకు ఔషధ గుణాలు కలిగిన మొక్కలు సరిగా కనిపించవు. ఎందుకంటే అసలు మొక్కలు, చెట్లు నగరాల్లో చాలా తక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే వాటికి అనువైన స్థలం లేకపోవడమే కారణం. అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో షో ట్రీస్ తప్పా ఆయుర్వేద మొక్కలు కనిపించడం చాలా అరుదు. కానీ, పల్లెటూర్లో మన పరిసరాలు, పొలాలు, పెరట్లో పెరిగే చాలా రకాల మొక్కల్లో ‘నేలతాడి’ మొక్కలు చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటి నుంచి లభించే దుంపలు, ఆకులతో అన్ని రకాల రోగాలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

నేలతాడి మొక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదట నేలతాడి దుంపలను ఎండబెట్టుకుని వాటి చూర్ణాన్ని తయారు చేసుకోవాలి. దీనిని పూటకు 10 గ్రాముల చొప్పున తేనెలో కలిపి తీసుకుంటే అన్ని రకాల వ్యాధులు తగ్గుతాయి. అదేవిధంగా ఈ దుంపల చూర్ణాన్ని అర చెంచా ఆవు మూత్రంతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకున్నా సీజనల్ జ్వరాలు కూడా తగ్గిపోతాయి. ఇక కడుపునొప్పికి నేలతాడి దుంపల చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే కడుపు నొప్పి మటుమాయం అవుతుంది.
అంతేకాకుండా ఈ దుంపల చూర్ణాన్ని అరగ్లాసు పాలల్లో కలుపుకుని రోజూ రెండు సార్లు తాగితే మహిళల రొమ్ములో కలిగే నొప్పులు తగ్గుతాయి. నేలతాడి దుంపల చూర్ణాన్ని చెంచా నెయ్యితో కలిపి రోజుకు 2 సార్లు తాగితే మగవారిలో వీర్యం వృద్ధి జరుగుతుంది. అలాగే కొబ్బరినీళ్లతో కలిపి తాగితే మెదడు ఆరోగ్యంగా, చురుకుగా పనిచేస్తుంది. ఇక అర చెంచా చూర్ణాన్ని నువ్వుల నూనెతో కలిపి తీసుకుంటే శ్వాస కోశ వ్యాధులు తగ్గుతాయి. డయాబెటిస్, రక్తహీనత వంటి వ్యాధులు కూడా నయం అవుతాయి.
Read Also : Breastfeeding Milk : పిల్లలకు తల్లి పాలు ఎన్నిరోజులు ఇవ్వాలి… ఎప్పటి వరకు ఇస్తే మంచిది..?