Turmeric health benefits : పసుపు.. ఈ పేరు వినని వారు బహుశా ఎవరూ ఉండరు. ప్రతి ఇంట్లోని కిచన్‌లో ఇది చాలా ఫేమస్. ఎందుకంటే ప్రతి వంటకంలో దీనిని కంపల్సరీగా వేయాల్సిందే. ఇందులో ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉంటాయి. ఇది యాంటీ బయటిక్ గా ఉపయోగపడుతుంది. కరోనా టైంలోనూ చాలా మంది దీనిని వాడారు. పసుపు వల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.. పసుపును చాలా రకాల వ్యాధులకు నివారిణిగా వాడుతారు. శరీరంలో ఎక్కడైనా దెబ్బతగిలి రక్తం వస్తుంటే ఆ ప్రాంతంలో వెంటనే పసుపు రాస్తారు.

ఇది పురాతన కాలం నుంచి వస్తుంది. జలుబు పడిశంతో బాధపడుతున్న వారు బాగా మరిగిన నీటిలో కాస్త పుసుపు వేసుకుని ఆవిరి పట్టుకుంటే చాలా ఉపశమనం లభిస్తుంది. పసుపు, వేప ఆకులను కలిసి మెత్తగా పేస్టులాగా చేసుకుని తామర, గజ్జి వంటివి ఏర్పడిన ప్రదేశాల్లో పూస్తే రిజల్ట్ కనిపిస్తుంది. ఉప్పు, పసుపు రెండూ కలిసి పళ్లు తోమితే నోటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో పాటు పుప్పి పళ్లు నొప్పి ఉంటే దాని నుంచి సైతం రిలాక్స్ లభిస్తుంది.
కాళ్లు పగిలినప్పుడు పసుపు, వేపాకు ను నీటిలో బాగా మరిగించి దానితో కాళ్లను కడుక్కుంటే పగుళ్ల నుంచి కొంత రిలాక్స్ పొందొచ్చు. డయాబెటిస్‌తో బాధపడేవారు పసుపును తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖంపై మొటిమలతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు జమ ఆకులు, పసుపును మెత్తగా చేసుకుని ముఖానికి రోజుకు రెండు సార్లు రుద్దుకుని కడుక్కోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. పసుపును చర్మానికి రుద్దుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
Read Also : Ayurveda Good for Heart : గుండె ఆరోగ్యానికి ఈ 5 ఆయుర్వేద మూలికలే సంజీవని..!