Tomato Beauty Tips : అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు.. ఆ అందం కోసం ఏమేమో క్రీములు వాడేస్తుంటారు. ఆ క్రీములతో అందం పెరగడం ఏమో కానీ… ముఖం మాత్రం చాలా వరకు పాడైపోతుంది.. క్రీముల వల్ల లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతుంటాయి. అందుకే ముఖానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేచురల్‌గా అందాన్ని పెంచుకోవచ్చు. ఇంతకీ అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రతిఒక్కరి వంటిల్లో టమాట లేకుండా వంట చేయడం కుదరదు.. ఏ కూరల్లో అయినా టమాటా కాంబినేషన్ ఉండాల్సిందే..
అలాంటి టమాటా.. వంటల్లోనే కాదు.. అందానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని చాలామందికి తెలియకపోవచ్చు. టమాటతో తళతళమెరిసే ముఖాన్ని తళతళ మెరిసేలా చేసుకోవచ్చు. సాధారణంగా బయట తిరిగినప్పుడు ముఖం వెంటనే మాడిపోతుంది. నల్లగా మారిపోతుంటుంది. ఇలాంటి సమయంలో టమాటతో ముఖంపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..
Tomato Beauty Tips : ముఖంపై నలుపు పోయి తెల్లగా మారాలంటే..
వంటింట్లో శనగపిండి ఉంటుంది కదా.. ఇప్పుడా శనగపిండిని తీసుకోని అందులో కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా రోజ్ వాటర్ కూడా వేయాలి. ఇప్పుడు టమాట రసాన్ని తీసి ఇందులో పోయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీ ముఖానికి రాసుకుని నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇదంతా ముఖంపై బాగా ఎండేవరకు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.
ఇలా వారానికి మూడు సార్లు చేయాలి. ఆ తర్వాత మీ ముఖం ఎంత అందంగా మారుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇలా చేస్తుండం వల్ల మీ ముఖంపై పాత మచ్చలు, మొటిమల మచ్చలు ఏదైనా సరే క్రమంగా మాయమైపోతాయి. అంతేకాదు.. చర్మానికి అవసరమైన పోషకాలు అందడం ద్వారా ముఖం చాలా మెరిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ ముఖాన్ని అందంగా తయారుచేసుకోవచ్చు.
Read Also : Work Stress : పనిఒత్తిడితోనే గుండెపోటు.. మీకు ఈ లక్షణాలున్నాయా? తస్మాత్ జాగ్రత్త..