Work Stress : పనిఒత్తిడితో జాగ్రత్త.. అదే అన్ని అనారోగ్యాలకు కారణం.. ఎక్కువ గుండెజబ్బులకు కూడా అదే కారణమవుతోంది. పనిఒత్తిడితో జీర్ణసంబంధిత అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఒక పనిఒత్తిడి కారణంగా నిద్రలేమి, నీరసం, గుండెపోటు సమస్యలకు దారితీస్తుంది. పురుషులే కాదు.. మహిళల్లోనూ ఈ అనారోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని ఓ కొత్త అధ్యయనం తెలిపింది.
ఈ మేరకు యూరోపియన్ స్టోక్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. పనిఒత్తిడితో డయాబెటిస్, ఆర్టెరీల్ హైపర్ టెన్షన్, అధిక కొవ్వు, స్థూలకాయం, పొగతాగడం, వ్యాయామం సరిగా చేయకపోవడం, కార్డియో సంబంధిత సమస్యలను వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడితో పాటు నిద్రలేమి కూడా గుండెపోటుకు దారితీయొచ్చునని అధ్యయనంలో తేలింది.
పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా హార్ట్ ఎటాక్ రిస్క్ ఉందని హెచ్చరిస్తున్నారు. మహిళల్లోనూ గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా మహిళల్లో నిద్రలేమి సమస్యలు, ఒత్తిడి, అలసట, నీరసంతో గుండెజబ్బులు వస్తున్నాయని గుర్తించారు. గంటల కొద్ది పనిచేసే ఉద్యోగుల్లో కూడా పనిఒత్తిడి కారణంగా గుండె వ్యాధులు అధికంగా ఉంటున్నాయని రుజువైంది. ఇంటి పనులతో పాటు ఆఫీసుల్లో వర్క్ ప్రెజర్ కూడా ఇందుకు కారణమని రీసెర్చర్లు తేల్చేశారు.
పని ఒత్తిడి అనేది సర్వ సాధారణమైన సమస్య.. ప్రతి పనిలో ఒత్తిడి ఉంటుంది. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఒత్తిడి మాత్రం కామన్.. కొందరిలో ఈ ఒత్తిడి అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రతిచిన్నదానికి అధికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెన్షన్ వాతావరణం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. లేదంటే అది మీ జీవితాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని అంటున్నారు.
Work Stress : మానసిక ఒత్తిడితోనే గుండెపోటు.. ఒత్తిడిని జయించాలంటే..
మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుండాలి. ఇక పనిలో ఎదురయ్యే ఒత్తిడిని జయించాలంటే.. ముందుగా దీర్ఘ శ్వాస తీసుకోవాలి. అదేపనిగా పనిచేయడం కంటే మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ పనిచేస్తుండాలి. మెదడుకు విశ్రాంతినివ్వాలి.. అప్పుడు మనస్సు కుదటపడుతుంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్ అధికంగా రిలీజ్ అయినప్పుడు టెన్షన్ పెరిగిపోతుంది. ఫలితంగా బీపీ పెరిగిపోతుంది. అది క్రమంగా గుండెపోటుకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.
ఒత్తిడిగా అనిపించినప్పుడు ఉల్లాసపరమైన విషయాల పట్ల ఆసక్తి చూపించాలి. మీకు నచ్చిన పాటలు లేదా పుస్తకాలను చదవాలి. లేదంటే ప్రకృతిని ఆశ్వాదిస్తూ డీప్ బ్రీతింగ్ ఎక్సరసైజులు చేస్తుండాలి.. మీలోని ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. పని ఒత్తిడి అనేది ఆఫీసుల్లో కావొచ్చు.. ఏయే పని అయినా ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది.
ఇలాంటి సమయాల్లోనే ఒత్తిడిని తగ్గించుకునేందుకు తెలిసిన రెమడీలను పాటిస్తుండాలి. అలా తరచూ చేస్తుండం వల్ల క్రమంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని పూర్తిగా తగ్గించలేకపోయినా.. కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అలా ప్రతిపనిలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు.
Read Also : Cure Mouth Ulcers Fast : నోటి అల్సర్లతో తస్మాత్ జాగ్రత్త.. ఈ చిట్కాలతో క్షణాల్లో తగ్గించుకోవచ్చు!