Tamalapaku benefits : తమలపాకు.. దీనికి చాలా శ్రేష్టమైనదిగా చెబుతుంటారు. దేవుడి దగ్గర ఈ ఆకులను ఎక్కువగా వాడుతుంటారు. పూజలు, వ్రతాలు, వాయినాలు ఇచ్చేటప్పుడు, జీర్ణ సంబంధిత వ్యాధులకు, ఆయుర్వేద మెడిసిన్‌లో కూడా తమలపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొందరికీ పాన్ (కిల్లీ) తినడం అలవాటుగా ఉంటుంది. భోజనం చేశాక కిల్లీ వేసుకోకపోతే వారికి కడుపు నిండినట్టు అనిపించదని కొందరు చెబుతుంటారు. మరికొందరు జర్దా, టోబాకోను తమలపాకుతో కలిపి తీసుకుంటారు. తమలపాకుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తమలపాకును పాన్ షాపుల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దేవుళ్ల పూజ విషయానికొస్తే హనుమంతుడికి తమలపాకులను మాల వేస్తుంటారు. తమలపాకుల దండ అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతిపాత్రమైనదని పూజారులు చెబుతుంటారు.ఇది తాంబూలంగా కూడా స్వీకరిస్తారు. ఈ ఆకుల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.. విటమిన్ ఎ, సీ, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ తమలపాకులో సమృద్దిగా ఉంటాయి.
తమలపాకు తలనొప్పి, మైగ్రైన్, మోకాళ్ళ నొప్పులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తలనొప్పి కలిగినపుడు తమలపాకు ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుని 30 నిమిషాల వరకు ఎదరుచూడాలి. దీంతో తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఇలా చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుందట. మెదడుపై అధిక భారం తగ్గి రిలాక్స్ అవుతుందని చెబుతున్నారు. కీళ్లనొప్పులు నొప్పులతో బాధపడే వారు మెత్తగా నూరిన తమలపాకుల రసాన్ని నొప్పులు ఉన్న చోట రుద్దుకోవాలట.. అప్పుడది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది.
ఇకపోతే లేత తమలపాకు రోజూ ఒకటి తింటుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి ఆహారం బాగా అరుగుతుంది. టైంకు ఆకలి అవుతుంది. గ్యాస్ సంబంధిత ఇబ్బందులు దూరమవుతాయి. ఇందులో ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.
Read Also : Mirabilis Jalapa Uses : ఈ చంద్ర కాంత మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి.. ఎందుకంటే..?